గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి
జననం1966, సెప్టెంబరు 5
పొతారెడ్డిపేట్, అక్బర్‌పేట-భూంపల్లి మండలం, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ
మరణం2023 ఏప్రిల్ 24(2023-04-24) (వయసు 56)
హైదరాబాదు, తెలంగాణ
వృత్తిఅసోసియేట్ ప్రొఫెసర్
ప్రసిద్ధిసాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు
తండ్రిగుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ
తల్లిపద్మావతి

డా. గుమ్మన్నగారి బాలశ్రీనివాసమూర్తి (1966, సెప్టెంబరు 52023, ఏప్రిల్ 24) తెలంగాణకు చెందిన సాహితీవేత్త, పరిశోధకుడు, పత్రిక సంపాదకుడు. తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేశాడు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

బాలశ్రీనివాసమూర్తి 1966, సెప్టెంబరు 5మెదక్ జిల్లాలోని పోతారెడ్డిపేటలో జన్మించాడు.[2] ఇతని తండ్రి గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మ కవి, అవధాని. తల్లి పద్మావతి.

విద్య[మార్చు]

హైదరాబాదు విశ్వవిద్యాలయంలో చలం రాసిన 'సుధ గీతాల' మీద ఎం.ఫిల్., 'తెలుగులో తాత్త్విక కావ్యాలు' అనే అంశంమీద పిహెచ్.డి. చేసాడు.

సహాచార్యుడిగా[మార్చు]

తెలంగాణ విశ్వవిద్యాలయం ఏర్పడిన తొలినాళ్ళ నుంచి బోధన విధుల్లో ఉన్న బాలశ్రీనివాసమూర్తి విశ్వవిద్యాలయంలోని వివిధ పరిపాలన పదవులు నిర్వహించాడు.[3]

సాహిత్య ప్రస్థానం[మార్చు]

జాగృతి వార పత్రికలో సాహిత్య వ్యాసాలను, జాతీయ-అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలు సమర్పించాడు. దాదాపు పది పుస్తకాలను వెలువరించాడు. తెలంగాణ సాహిత్య అకాడమీ రూపొందించిన 'సమగ్ర తెలంగాణ సాహిత్య చరిత్ర' పుస్తక సంపాదక బృందంలో సభ్యునిగా పనిచేశాడు.

రచనలు[మార్చు]

  1. ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ[4]
  2. సమకాలీన వాదాలు - సాహిత్య విమర్శ
  3. తెలంగాణం - తెలుగు మాగాణం
  4. తుషార సమీరం
  5. తెలంగాణ పత్రికలు
  6. వెలుతురు కొలను
  7. మా ప్రసిద్ధిపేట[5]
  8. విలక్షణ పి. వి.-– నరసింహారావు గారి జీవిత చరిత్ర[6]
  9. దేవులపల్లి రామానుజనరావు (మోనోగ్రాఫ్)[7]
  10. జీవన హిందోళం (గుమ్మన్నగారి లక్ష్మీనరసింహ శర్మగారి జీవితం – అవధానం)[8]

సంపాదకత్వం[మార్చు]

  1. తెలంగాణ వైతాళికులు (మూడు సంపుటాలు, జననేతలు-అక్షరమూర్తులు-ప్రతిభామూర్తులు)[9]
  2. సాహితీ సుధ
  3. తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వం
  4. తెలంగాణ సాహిత్య చరిత్ర

మరణం[మార్చు]

బాలశ్రీనివాసమూర్తి 2023, ఏప్రిల్ 24న గుండెపోటుతో హైదరాబాదు సుచిత్రలోని తన స్వగృహాంలో మరణించాడు.[3]

మూలాలు[మార్చు]

  1. telugu, NT News (2023-04-25). "సాహితీవేత్త బాలశ్రీనివాసమూర్తి మృతి". www.ntnews.com. Archived from the original on 2023-04-25. Retrieved 2023-04-25.
  2. ABN (2023-04-27). "మహావక్త బాల శ్రీనివాసమూర్తి". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-04-27. Retrieved 2023-04-27.
  3. 3.0 3.1 "ఆచార్య బాలశ్రీనివాసమూర్తి హఠాన్మరణం". EENADU. Archived from the original on 2023-04-25. Retrieved 2023-04-25.
  4. గుమ్మన్నగారి, బాలశ్రీనివాసమూర్తి (జూన్ 2014). ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ. హైదరాబాద్: ఎమెస్కో బుక్స్. ISBN 978-9383652051.
  5. Thum, Jayadeep (2016-09-02). "మళ్ళీ చదవాలనిపించే " మా ప్రసిద్ధిపేట". తెలంగాణ. Archived from the original on 2023-04-25. Retrieved 2023-04-25.
  6. Velugu, V6 (2022-07-24). "సమగ్ర జీవిత చరిత్ర". V6 Velugu. Archived from the original on 2022-07-24. Retrieved 2023-04-25.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Dr. Gummannagari Bala Srinivasa Murthy (2017). డా. దేవులపల్లి రామానుజరావు.
  8. telugu, NT News (2021-10-31). "ఒక అవధాని జీవనరాగ సుధ". www.ntnews.com. Archived from the original on 2021-10-31. Retrieved 2023-04-25.
  9. Thum, Jayadeep (2017-09-02). "జిజ్ఞాసువులకు కరదీపికలు 'తెలంగాణ వైతాళికులు'". తెలంగాణ. Archived from the original on 2023-04-25. Retrieved 2023-04-25.