అక్బర్‌పేట-భూంపల్లి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అక్బర్‌పేట-భూంపల్లి మండలం తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, సిద్ధిపేట రెవెన్యూ డివిజన్ పరిథిలోని మండల కేంద్రం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 జులై 23న నూతన మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసి,[1] ప్రజల నుంచి అభ్యంతరాలు, వినతులను స్వీకరించిన అనంతరం తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం (1974లోని సెక్షన్ 3) ప్రకారం 2022 సెప్టెంబర్ 26న నూతనంగా అక్బర్‌పేట-భూంపల్లి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.[2][3]

అక్బర్‌పేట-భూంపల్లి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్, ప్రభుత్వ అతిధిగృహం, డీసీసీబీ శాఖ, పీహెచ్సీ అందుబాటులో ఉన్నాయి. అక్బర్‌పేట నుండి భూంపల్లి మీదుగా చేగుంట, తూప్రాన్ దగ్గరి మార్గంగా చేరుకొని జాతీయ రహదారి మీదుగా హైదరాబాద్ కు చేరవచ్చు. అక్బర్‌పేట నుంచి కూడవెల్లి మీదుగా కామారెడ్డికి చేరుకోవచ్చు.[4]

మండలంలోని గ్రామాలు[మార్చు]

అక్బర్‌పేట- భూంపల్లి నూతన మండలంలో  దుబ్బాక మండలంలోని 5 గ్రామాలు, మిరుదొడ్డి మండలంలోని చెందిన 8 గ్రామాలతో ఏర్పాటైంది.[5]

క్ర.సం. గ్రామం పేరు కొత్త మండలం పాత మండలం పాత జిల్లా
1 పోతారెడ్డిపేట్ అక్బర్‌పేట-భూంపల్లి దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా
2 చౌదర్ పల్లి అక్బర్‌పేట-భూంపల్లి దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా
3 ఎనగుర్తి అక్బర్‌పేట-భూంపల్లి దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా
4 చిట్టాపూర్ అక్బర్‌పేట-భూంపల్లి దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా
5 బొప్పాపూర్ అక్బర్‌పేట-భూంపల్లి దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా
6 ఖాజీపూర్ అక్బర్‌పేట-భూంపల్లి మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లా
7 కుదవెల్లి అక్బర్‌పేట-భూంపల్లి మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లా
8 వీరారెడ్డిపల్లి అక్బర్‌పేట-భూంపల్లి మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లా
9 జంగపల్లి అక్బర్‌పేట-భూంపల్లి మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లా
10 అల్మాస్‌పూర్ అక్బర్‌పేట-భూంపల్లి మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లా
11 భూంపల్లి అక్బర్‌పేట-భూంపల్లి మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లా
12 రుద్రారం అక్బర్‌పేట-భూంపల్లి మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లా
13 మోతే అక్బర్‌పేట-భూంపల్లి మిరుదొడ్డి మండలం సిద్దిపేట జిల్లా

మూలాలు[మార్చు]

  1. 10TV Telugu (23 July 2022). "తెలంగాణలో మరో 13 కొత్త మండలాలు.. ఏఏ జిల్లాల్లో అంటే." Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Namasthe Telangana (27 September 2022). "రాష్ట్రంలో కొత్తగా 13 మండలాలు". Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  3. Andhra Jyothy (27 September 2022). "కొత్తగా మరో 13 రెవెన్యూ మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.
  4. Namasthe Telangana (30 November 2022). "చిరకాల స్వప్నం సాకారం". Archived from the original on 1 September 2023. Retrieved 1 September 2023.
  5. Andhra Jyothy (26 September 2022). "మరో రెండు కొత్త మండలాలు" (in ఇంగ్లీష్). Archived from the original on 30 September 2022. Retrieved 30 September 2022.