సిద్ధిపేట రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్ధిపేట రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాసిద్ధిపేట

సిద్ధిపేట రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. సిద్ధిపేట జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 10 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం సిద్ధిపేట పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను సిద్ధిపేట లోక్‌సభ నియోజకవర్గంలోని సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3][4]

పరిపాలన[మార్చు]

సిద్ధిపేట డివిజనులోని మండలాలు:[5]

క్ర.సం సిద్ధిపేట రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 సిద్దిపేట పట్టణ మండలం 12 రెవెన్యూ గ్రామాలు
2 సిద్దిపేట గ్రామీణ మండలం 12 రెవెన్యూ గ్రామాలు
3 నంగునూరు మండలం 19 రెవెన్యూ గ్రామాలు
4 చిన్నకోడూర్ మండలం 20 రెవెన్యూ గ్రామాలు
5 తొగుట మండలం 16 రెవెన్యూ గ్రామాలు
6 దౌలతాబాద్ మండలం 20 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
7 మిరుదొడ్డి మండలం 17 రెవెన్యూ గ్రామాలు
8 దుబ్బాక మండలం 26 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
9 చేర్యాల మండలం 14 రెవెన్యూ గ్రామాలు
10 కొమురవెల్లి మంండలం 9 రెవెన్యూ గ్రామాలు

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-08-03.
  3. "Subdivision & Blocks | GOVERNMENT OF TELANGANA, SIDDIPET DISTRICT | India". siddipet.telangana.gov.in. Archived from the original on 2021-02-26. Retrieved 2022-08-03.
  4. Vemula, Prakash (2022-03-15). "List of Revenue Divisions, Mandals in Siddipet District". TeachersBadi. Archived from the original on 2020-09-25. Retrieved 2022-08-03.
  5. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-03. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-24 suggested (help)