విజేత కాంపిటీషన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విజేత కాంపిటీషన్స్

విజేత కాంపిటీషన్స్ విద్యా, విజ్ఞాన, ఉపాధి అవకాశాల పక్షపత్రిక. 1990 లో ప్రారంభించబడింది. బండ్ల పబ్లికేషన్స్, హైద్రాబాదు చే ప్రచురించబడుతుంది [1] దీనిలో ప్రముఖమైన అంశాలపై ముఖపత్రకథనాలతో పాటు, ప్రస్తుత పోటీ పరీక్షలు, ప్రస్తుత వార్తలలో విషయాలు ప్రధాన శీర్షికలు. ప్రతి సంచికతోపాటు ఒక విశేష అంశంపై అనుబంధం కూడా ప్రచురిస్తున్నది. ప్రతి సంవత్సరం వార్షిక పుస్తకం కూడా ప్రచురిస్తున్నది.

ఇదే సంస్థనుండి కంప్యూటర్ ఎరా పత్రిక కూడా ప్రచురిస్తున్నది. పాఠశాల స్థాయి పుస్తకాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో వివిధ ఉద్యోగాల కోసం ప్రత్యేక పుస్తకాలు ప్రచురిస్తున్నది.


మూలాలు

[మార్చు]
  1. "విజేత కాంపీటీషన్స్ ఇ-కామర్స్ జాలస్థలి". Retrieved 2020-01-20.