మూసీ (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Musi
మూసీ
రకంమాసపత్రిక
యాజమాన్యంబి.ఎన్. శాస్త్రి (భిన్నూరి నరసింహ శాస్త్రి
ప్రచురణకర్తబి. అనంతలక్ష్మి
సంపాదకులుసాగి కమలాకర శర్మ
Staff writersమనోహరి
స్థాపించినది1980
కేంద్రంహైదరాబాద్
ISSN2457-0796
జాలస్థలిhttps://www.musimagazine.org/

మూసీ 1980లో ప్రారంభించబడిన తెలుగు మాసపత్రిక. ఈ ప్రతిక వ్యవస్థాపకులు బి.ఎన్. శాస్త్రి (భిన్నూరి నరసింహ శాస్త్రి. ఈ మాసపత్రిక యొక్క ఐఎస్ఎస్ఎన్ నెంబర్ ISSN 2457-0796[1]. మూసీ మాసపత్రిక యూజీసీ కేర్ లిస్ట్ (UGC Care List) గుర్తింపు కూడా కలిగి ఉంది. [2] 1980లో మూసీ పబ్లికేషన్స్ అనే ప్రచురణ సంస్థను కూడా ప్రచురణ స్థాపించారు.

మూసీ పత్రిక నేపథ్యం[మార్చు]

బి.ఎన్‌. తెలంగాణవాది. దీనికి అద్దంపట్టే తీరు మూసీ అనే పేరుతో పత్రికను నిర్వహించడంలో తేటపడుతోంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో దుర్గంధానికి ప్రతీకగా చెప్పుకునే మూసీనది ఒకప్పుడు భాగ్యనగర అమృతధార. మూసీ అనే పేరులో ఉన్న గత వైభవ సాంస్కృతికతను బి.ఎన్‌ గుర్తించారు. అందుకే 1980లో మూసీ సాహిత్య సాంస్కృతిక పత్రిక ఆరంభమైంది. 1986 వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిచింది. మంచి పత్రికగా మన్ననల్ని పొందింది. దశాబ్ధి కాలంపాటు ఆగిపోయిన మూసీ పత్రిక 1992లో తిరిగి మొదలైంది. అప్పటినుండి ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగుతోంది. బి.ఎన్‌ కన్నుమూసిన తరువాత ఆయన కుమార్తె మనోహరి, అల్లుడు డాక్టర్‌ సాగి కమలాకర శర్మ పత్రికను చక్కగా నడిపిస్తున్నారు. మూసీ పత్రిక ఆర్థికంగా అత్యంత భారమైనా ఆగకుండా నడిపిస్తున్నారు, చిన్నచిన్న అవాంతరాలు వచ్చినప్పటికీ బి.ఎన్‌. శాస్త్రిగారి ఆశయాలమేర, వారి సంకల్ప బలంతో పత్రిక నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది. అన్ని విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలు మూసీ పత్రికను పరిశోధనా మాసపత్రికగా గుర్తించాయి. అలాగే ‘‘మూసీ మాసపత్రిక`సాహిత్య సేవ’’ అనే అంశంపై శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి పిహెచ్‌.డి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించడం గర్వించదగిన విషయం.

శీర్షికలు-అంశాలు[మార్చు]

ఈ పత్రికలోని రచనలు తెలుగు భాషను, సంస్కృతిని సుసంపన్నం చేసే కోణంలో ఉంటాయి. ఇందులో ప్రధానంగా కథలు కథానికలు, కవితలు, పాటలు, స్థల చరిత్రలు, మన సంప్రదాయాలు, మన దేవాలయాలు, యక్ష ప్రశ్నలు, మన చరిత్ర, మన వీరులు, చరిత్రకు తెలియని కవి, పరిశోధక వ్యాసాలు, పండుగలు, జాతీయ దినోత్సవాలు, మన ఆటలు, మొదలైన మొదలైన శీర్షికలతో మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడుతూ మానవజాతి ఘనతను చాటి చెపుతూ ప్రతి నెల పాఠకుల ముందుకు వస్తుంది. సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక పత్రిక మూసీ, చదివి దాచుకోదగిన ఏకైక తెలుగు మాసపత్రిక మూసీ.

సంపాదకులు[మార్చు]

ప్రచురణకర్త[మార్చు]

  • బి. అనంతలక్ష్మి


బాహ్య లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. ఐఎస్ఎస్ఎన్ {ISSN} వారి వెబ్సైట్లో మూసీ మాసపత్రిక ఐఎస్ఎస్ఎన్ వివరాలు
  2. యూజీసీ కేర్ లిస్ట్ (UGC Care List) వారి వెబ్సైట్లో మూసీ మాసపత్రిక వివరాలు