అట్టెం దత్తయ్య
వికీపీడియా తొలగింపు విధానం ప్రకారం ఈ పేజీని తొలగించాలి. కారణమేంటంటే: వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు) ప్రకారం నిర్ధారించదగ్గ తటస్థ మూలాలతో విషయ ప్రాముఖ్యత ఎస్టాబ్లిష్ చేసిలేదు. ఈ ప్రతిపాదనపై మీ అభిప్రాయాన్ని వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/అట్టెం దత్తయ్య పేజీలో రాయండి. |
Dr. Attem Dattaiah డాక్టర్ అట్టెం దత్తయ్య | |
---|---|
జననం | డాక్టర్ అట్టెం దత్తయ్య గ్రామం : శట్పల్లి, మండలం : లింగం పేట్, జిల్లా : కామారెడ్డి జిల్లా |
నివాస ప్రాంతం | హైదరాబాద్ భారత దేశము |
వృత్తి | తెలుగు ఆచార్యుడు |
ఉద్యోగం | శ్రీ వెంకటేశ్వర కళాశాల(SVC), ఢిల్లీ విశ్వవిద్యాలయం, న్యూ ఢిల్లీ |
ప్రసిద్ధి | కవి, రచయిత, సంపాదకులు |
మతం | హిందూ |
తండ్రి | అట్టెం మల్లయ్య |
తల్లి | అట్టెం లక్ష్మి |
డా. అట్టెం దత్తయ్య తెలుగు కవి, రచయిత, విమర్శకులు. దత్తయ్య ప్రస్తుతం ఢిల్లీ లోని శ్రీ వెంకటేశ్వర కళాశాల(SVC) తెలుగు శాఖలో సహాయ ఆచార్యులుగా[1], మూసీ సాహిత్య ధార సంస్థ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాడు.
బాల్యం
[మార్చు]దత్తయ్య తెలంగాణలోని కామారెడ్డి జిల్లా, లింగంపేట్ మండలం శట్పల్లి గ్రామంలో 1983 డిసెంబర్ 26న అట్టెం లక్ష్మి, మల్లయ్య దంపతులకు రెండో కుమారుడిగా జన్మించాడు. ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం ఏడవ తరగతి వరకు శట్పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలోనే జరిగింది. తర్వాత ఉన్నత చదువులకు పరిస్థితులు అనుకూలించకపోవడంతో మేకలను కాచే పనిలో నిమగ్నమయ్యాడు. ఎనిమిదేళ్లుగా అదేపని చేస్తూ మేకలను మేపేందుకు కరీంనగర్, ఖమ్మం, వరంగల్, జిల్లాలకు వెళ్లి జీవనం గడిపాడు. ఈ రోజుల్లోనే అటవీ అధికారుల దెబ్బలు, నక్సలైట్ల బెదిరింపులు భరించాడు. ఒకరోజు మేకల దగ్గర నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు తన బాల స్నేహితుడు ఇఫ్తేకార్ ప్రోత్సాహంతో మళ్ళీ చదువుపై ఆసక్తి పెంచుకొని లింగంపేటకు చెందిన రత్నాకర్ అనే ఉపాధ్యాయుడితో రాత్రివేళల్లో పాఠాలు నేర్చుకున్నాడు.[2]
విద్య
[మార్చు]దత్తయ్య ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే పూర్తయింది. ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య పూర్తిచేసుకుని, కామారెడ్డి ఓరియంటల్ కళాశాలలో బీవోఎల్ కోర్సులో ప్రవేశం పొంది ఉదయం వేళల్లో ప్రయివేటు పాఠశాలల్లో బోధిస్తూ సాయంత్రం కళాశాలకు వెళ్ళేవాడు. తర్వాత నిజామాబాద్ లో తెలుగు పండిట్ కోర్సు పూర్తి చేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం లో ఎంఏ తెలుగు లో సీటు సంపాదించాడు. ప్రొఫెసర్ కమలాకర శర్మ ప్రోత్సాహంతో యూజీసీ నెట్, ఏపీ సెట్ సాధించి ఎంఫిల్ పూర్తి చేశాడు. 'మహాభారతం లో సంవాదాలు సమగ్ర పరిశీలన' అనే అంశంపై పరిశోధన చేసి 2021 అక్టోబర్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పట్టా పొందాడు.[3]
రచనలు
[మార్చు]- కళ్లం (సాహిత్య వ్యాసరాశి)
- తెలంగాణ బి.సి.వాద సాహిత్యం [4] [5] [6]
- మహాభారతం లో సంవాదాలు సమగ్ర పరిశీలన (పీహెచ్ డి పరిశోధన గ్రంథం)
- భూపాల్ ‘పట్నమొచ్చిన పల్లె - భాష పరిశీలన’ (ఎంఫిల్ పరిశోధన గ్రంథం)
సంపాదకుడిగా
[మార్చు]- నిత్యాన్వేషణం (సాహిత్య దీర్ఘవ్యాస సమాహారం),
- ‘శిలాక్షరం’ (బి.ఎన్.శాస్త్రి సాహిత్యం - సమాలోచన)
- ‘సారాంశం -1’ (పరిశోధన గ్రంథాల - పరిచయం వ్యాసాలు),
- సారాంశం -2 (పరిశోధన గ్రంథాలు - పరిచయం వ్యాసాలు)
- కమలాకరం (మూసీ సంపాదకీయాలు)
సహ సంపాదకుడిగా
[మార్చు]- మూసీ మాసపత్రిక (యుజిసి.కేర్ అప్రోవల్ పొందిన పత్రిక) కు సహ సంపాదకులు
సహాయ సంపాదకుడుగా
[మార్చు]- ‘తెలంగాణ సాహిత్యం - సమాలోచనం’ (పరిశోధక విద్యార్థుల సాహిత్యవ్యాసాలు),
- ‘శతవాసంతిక’ (ఉస్మానియా వందేళ్ళ సంబరాల ప్రత్యేక జ్ఞాపిక)
- ’ఆలోకనం‘ (తెలంగాణ 31 జిల్లాల సాహిత్య, సాంస్కృతిక, చారిత్రక అంశాలు)
ఇవే కాక ఇంకా 200 లకు పైగా వ్యాసాలు, 50 కి పైగా పత్ర సమర్పణలు చేసాడు.
మూలాలు
[మార్చు]- ↑ Departments - FacultyTelugu - Dattaiah
- ↑ "మేకల కాపరి @ డాక్టరేట్". m.dailyhunt.in (in ఇంగ్లీష్). Retrieved 2022-11-02.
- ↑ Kaburu News papere (2017-12-19), Phd news of Dattaiha, retrieved 2022-11-05
- ↑ Yotubeలో అట్టెం దత్తయ్య | తెలంగాణ బి.సి. వాద సాహిత్యం | గ్రంథావిష్కరణ సభ | 12.07.2021 సా.5.20 గం.లకు వివరాలు
- ↑ TeluguBooks వెబ్సైటులో తెలంగాణ బీసీ వాద సాహిత్యం పుస్తక వివరాలు
- ↑ Logili వెబ్సైటులో తెలంగాణ బీసీ వాద సాహిత్యం పుస్తక వివరాలు