మూసీ పబ్లికేషన్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూసీ పబ్లికేషన్స్ (Musi Publications) ఒక ప్రచురణ సంస్థ. దీని ప్రధాన కేంద్రం హైదరాబాద్ ఉంది. దీనిని ప్రసిద్ధ శాసన పరిశోధకులు, చరిత్రకారులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన బి.ఎన్. శాస్త్రి 1980 స్థాపించారు.

మూసీ పబ్లికేషన్స్ స్థాపన[మార్చు]

మూసీ పబ్లికేషన్స్ 1980 నుంచి భారతదేశ చరిత్ర -సంస్కృతీ (21 భాగాలు), ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతీ శాసనాలు, మూసీ ప్రత్యేక సంచికలు వెలువరించింది. తెలంగాణ సంపూర్ణ సాహిత్యసీమ. వెలుగులోనికి రాని అనేక అంశాలు బయల్పడాలంటే మారుమూల ప్రాంతాలమీద కూడా కాంతిరేఖలు ప్రసరించాలి. ఇందుకు జిల్లా సర్వస్వాల రచన ఎంతో ఉపకరిస్తుందని బి.ఎన్‌. శాస్త్రి విశ్వసించారు. ఇది వ్యూహాత్మకరీతిలో అత్యుత్తమ ఆలోచన. ఈ దిశలో తన వంతు ప్రయత్నాలు ఆరంభించారు. తొలుత నల్లగొండ అటుతరువాత ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా సర్వస్వాలు వెలుగుచూశాయి. ఇవి త్వరితగతిన ప్రామాణికతను సంతరించుకున్నాయి. ఈ జిల్లాల గురించి ఆధ్యయనం చేయాలనుకునేవారు ఇప్పటికే ఈ గ్రంథాల్ని పరామర్శించ వలసిందే. బి.ఎన్‌. వెలువరించిన ఈ మూడు జిల్లా సర్వస్వాలు ఆయా జిల్లాల్లోని మారుమూల పల్లెలకు చేరువయ్యాయి. ఆతరువాత బి.ఎన్‌. శాస్త్రి అల్లుడు ప్రస్తుత మూసీ పత్రిక సంపాదకులు సాగి కమలాకర శర్మ 31 జిల్లాల సర్వస్వాలకు, సాహిత్య సంచికలకు శ్రీకారం చుట్టారు. వీటిని మూసీ పబ్లికేషన్స్ ద్వారానే ప్రచురించబోతున్నారు. వారి బాటలోనే అన్ని జిల్లాల సర్వస్వాలు తీయడానికి అడుగులు వేయబోతున్నారు. 2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ‘ఆలోకనం’ (31 జిల్లాల సాహిత్యం, చరిత్ర, సంస్కృతీ సమాహారం) పేరుతో బృహత్‌ గ్రంథాన్ని వెలువరించింది.

చిరునామా[మార్చు]

మూసీ పబ్లికేషన్స్
2-2-1109/బికె-ఎల్‌ఐజి-10,
బతుకమ్మకుంట, బాగ్‌ అంబర్‌పేట,
హైదరాబాదు-500013

మూసి పబ్లికేషన్స్ ప్రచురణలు[మార్చు]

భారతదేశ చరిత్ర -సంస్కృతీ (21 భాగాలు)[మార్చు]

  • 01. 1994 భారతదేశ చరిత్ర - సంస్కృ 08 { ఢిల్లీ సుల్తానుల యుగము }
  • 02. 1994 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 09 { విజయనగర యుగము }
  • 03. 1995 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 10 { దక్కన్ సుల్తానుల యుగం }
  • 04. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 11 { మొగలు యుగము - 1}
  • 05. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 12 { మొగలు యుగము - 2}
  • 06. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 13 { రాజపుత్ర యుగము }
  • 07. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 14 { మరాఠ యుగము }
  • 08. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 15 { బ్రిటిష్ ఈస్ట్ ఇండియా యుగము - 1 }
  • 09. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 16 { బ్రిటిష్ ఈస్ట్ ఇండియా యుగము - 2 }
  • 10. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 17 { మహా విప్లవ యుగము }
  • 11. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 18 { వైస్రాయిల యుగము - 1 }
  • 12. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 19 { వైస్రాయిల యుగము - 2 }
  • 13. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 20 { సాంస్కృతిక పునరుజ్జీవన యుగము }
  • 14. 1999 భారతదేశ చరిత్ర - సంస్కృతీ - 21 { సంస్థానాల యుగము }

మూసీ పబ్లికేషన్స్ ప్రత్యేక సంచికలు[మార్చు]

  • 01. 1994 నల్లగొండ జిల్లా కవులు - పండితులు
  • 02. 2003 సుచరిత - బి ఎన్ శాస్త్రి సంస్మరణ సంచిక
  • 03. 2014 కదంబం - తెలుగు సాహిత్య ప్రక్రియలు రూపాలు
  • 04. 2017 ఆలోకనం - (31 తెలంగాణ జిల్లాల సాహిత్యం, చరిత్ర, సంస్కృతీ సమాహారం)

మూలాలు[మార్చు]