ఆలోకనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆలోకనం - (31 తెలంగాణ జిల్లాల సాహిత్యం, చరిత్ర, సంస్కృతీ సమాహారం)
కృతికర్త: పలువురు రచయితలు వ్రాసిన వ్యాసాలు
సంపాదకులు: సాగి కమలాకర శర్మ
దేశం: భారత దేశము
భాష: తెలుగు
ప్రక్రియ: 2017 ప్రపంచ తెలుగు మహాసభల సంధర్బంగా
ప్రచురణ: మూసీ పబ్లికేషన్స్
విడుదల: 2017
పేజీలు: 392
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-93-87173-0-40
ప్రతులకు: మూసీ మాస పత్రిక2-2-1109/బికె-ఎల్‌ఐజి-10,బతుకమ్మకుంట, బాగ్‌ అంబర్‌పేట, హైదరాబాదు -13


ప్రపంచ తెలుగు మహాసభల ప్రభావం వల్ల తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త పుస్తకాలు పురుడు పోసుకున్నాయి. మాస పత్రికలు రంగులు మార్చుకుని, పేజీలు పెంచుకుని నిత్యంకంటే కొత్తగా సాహిత్యం, భాష మూలలను వెలికితీసి ప్రత్యేక సంచికలుగా పరఢవిల్లాయి.వీటిలో తెలంగాణ సాహిత్య అకాడమి సహాయం పొందినవి కొన్ని. అందులో ఒకటి ‘మూసీ’ మాస పత్రిక. ఈ పత్రిక ‘ఆలోకనం’ (31 జిల్లాల సాహిత్యం, చరిత్ర, సంస్కృతీ సమాహారం) పేరుతో బృహత్‌ గ్రంథాన్ని వెలువరించింది.

పుస్తకంలోని విషయం[మార్చు]

ఇన్ని రోజులు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలకు రావలసిన గుర్తింపు రాని విషయం మనకు తెలిసిందే. రాష్ట్రం సాధించుకున్నాక మూలాలను తవ్వుతూపోతే చరిత్ర, సాహిత్యాలకు సంబంధించిన కొత్తవిషయాలు ఎన్ని బయల్పడుతున్నాయో. వీటన్నిటిని గ్రంథరూపంలో భద్రపరచుకోడానికి ఎవరో సాహసం చేస్తే తప్ప సాధ్యంకాదు. ఈ పనిని మూసీ ప్రారంభించింది. ప్రతి జిల్లా నుండి ఒక రచయితను ఎంచుకుని ‘ఆలోకనం’కోసం అన్ని అంశాలతో కూడిన ఒక వ్యాసాన్ని రాయించింది. ఆ 31 వ్యాసాల సమాహారమే ఈ గ్రంథం. ఇందులో అన్ని జిల్లాలకు ‘ఈ పేరెందుకు?’తో మొదలుపెట్టి జిల్లా పరిధి, వనరులు, నేలలు, అడవులు, నదులు, ప్రాజెక్టులు, జనాభా, అక్షరాస్యత, జిల్లా చరిత్ర, సంస్కృతి, ఆచారాలు, పండగలు, కళలు, జాతరలు, సాహిత్యం, సాహిత్య సంస్థలు, దర్శణీయ ప్రదేశాలు, ముఖ్య దేవాలయాలు మొదలైన అంశాలను సమకూర్చి ఒక గ్రంథంగా వెలువరించింది. ఈ పుస్తకం పుటలు తిప్పితే తెలంగాణ ఇంతమంది రచయితలకు, కవులకు, కళాకారులకు, చారిత్రక ప్రదేశాలకు, కట్టడాలకు ఆలవాలమా? అని ఆశ్చర్యపోనివారుండరు. ఇంకా సంపాదకుల ముందుమాట ప్రకారం ”జిల్లాల సర్వస్వాలు తయారు చేయడానికి ముందుగా అక్కడ మనకు లభించే సమాచారాన్ని గమనించాలంటే ఒక ముందు చూపు అవసరంగా భావించి తలపెట్టిన గ్రంథము మాత్రమే…” అని రాసారు. అంటే ఇవి పూర్తి సమగ్రమని కాదు. కాని ఈ వ్యాసాల ఆధారంగా ఆయా వ్యాసరచయితల సహాయాలతో 31 జిల్లాల సర్వస్వాలకు, సాహిత్య సంచికలకు శ్రీకారం చుట్టినట్లు ఈ మాటల వల్ల తెలుస్తుంది. ఈ ‘మూసీ’ మానపత్రిక వ్యవస్థాపకులు బి.ఎన్‌.శాస్త్రి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఆదిలాబాద్‌ వంటి జిల్లాల సర్వస్వాలు తీసిన పరిశోధకులు. వారి బాటలోనే అన్ని జిల్లాల సర్వస్వాలు తీయడానికి అడుగులు వేయబోతున్నందుకు సంతోషం.

ఈ గ్రంథం అంతా ఏకరూపతను సంతరించుకుంది. ఏ జిల్లా వ్యాసాన్ని తీసినా ఒకే రూపంగా కనిపిస్తుంది. రచయితలు అందరు ఒకే విధంగా రాయడం అనేది అసాధ్యం. అంటే సంపాదకుల శ్రమ స్పష్టంగా వ్యక్తమౌతుంది. ప్రతి జిల్లాకు మ్యాపు, చారిత్రక ప్రదేశాలు, దేవాలయాలు, కొంతమంది వ్యక్తుల చిత్రాలు రంగుల కాగితాలతో వేయడం వల్ల ‘ఆలోకనం’ చదువరులను మరింత అలరిస్తుందని అనిపిస్తుంది. ఈ ఆలోకనం రచయితలలో అన్ని రకాలవారున్నారు. చరిత్రకారులు, పరిశో ధకులు, పండితులు మొదలైనవారు. వారి వారి జిల్లాల చరిత్ర, సంస్కృతి, సాహిత్యాలను ప్రాచీనం నుండి ఆధునికం వరకు ఏ అంశాన్ని వదలకుండా సూచన ప్రాయంగా సమకూర్చిన ఈ గ్రంథం అన్ని రకాల వారికి కరదీపికగా ఉపయోగపడుతుంది

గ్రంథంలో వ్యాసాలు వ్రాసిన ప్రముఖులు[మార్చు]

  • 01. ఆదిలాబాద్ - సామల రాజవర్ధన్
  • 02. కరీంనగర్ - గంగాధర్
  • 03. కామారెడ్డి - దత్తయ్య అట్టెం
  • 04. కొమరం భీం ఆసిఫాబాద్ - మాడుగుల నారాయణ మూర్తి
  • 05. ఖమ్మం - డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి, కూరాకుల శ్రీనివాస్
  • 06. జగిత్యాల - డాక్టర్ సంగనభట్ల నరసయ్య
  • 07. జనగామ - రెడ్డి రత్నాకర్ రెడ్డి
  • 08. జయ శంకర్ భూపాలపల్లి - పల్లేరు వీరాస్వామి, నర్రా ప్రవీణ్ రెడ్డి
  • 09. జోగులాంబ గద్వాల - డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
  • 10. నల్లగొండ - డాక్టర్ ఇడికోజు శ్రీనివాసాచారి
  • 11. నాగర్ కర్నూల్ - వేముల నారాయణ
  • 12. నిజామాబాద్ - డాక్టర్ ఓం ప్రకాశ్
  • 13. నిర్మల్ - మడిపల్లి భద్రయ్య
  • 14. పెద్దపల్లి - కావటి సతీష్ కుమార్
  • 15. భద్రాద్రి కొత్తగూడెం - రాళ్లబండి బాలాజీ
  • 16. మహబూబాబాద్ - మద్దెర్ల రమేష్
  • 17. మహబూబ్ నగర్ - మాత్యారి ఆనంద్
  • 18. మంచిర్యాల - ఎం. వి. పట్వర్ధన్
  • 19. మెదక్ - వర్ధ వేణు
  • 20. మేడ్చల్ మల్కాజ్ గిరి - డాక్టర్ ఎం. శ్రీకాంత్ కుమార్
  • 21. యాద్రాద్రి భువనగిరి - సిద్ధగౌని సుదర్శన్
  • 22. రాజన్న సిరిసిల్ల - సంకెపల్లి నాగేంద్ర శర్మ
  • 23. రంగారెడ్డి - ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి
  • 24. వనపర్తి - డాక్టర్ గుంటి గోపి
  • 25. వరంగల్ అర్బన్ - డాక్టర్ బి. రాములు
  • 26. వరంగల్ రూలర్ - డాక్టర్ యల్లంభట్ల రంగయ్య
  • 27. వికారాబాద్ - డాక్టర్ పి. భాస్కరయోగి
  • 28. సిద్ధిపేట - కె. లాల్ బహదూర్ శాస్త్రి
  • 29. సూర్యాపేట - డాక్టర్ దామరాజు సూర్యప్రకాష్
  • 30. సంగారెడ్డి - అవుసల భానుప్రకాశ్. ఎ. శ్రీనాథ్ రావు
  • 31. హైదరాబాద్ - దొరవేటి, డాక్టర్ బి. మనోహరి

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఆలోకనం&oldid=2663761" నుండి వెలికితీశారు