పల్లేరు
ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి. |
పల్లేరు | |
---|---|
in Goa, India. | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | |
Genus: | |
Species: | A. hispidum
|
Binomial name | |
Acanthospermum hispidum |
పల్లేరు
[మార్చు]పల్లేరు అందరికీ తెలిసిన మూలిక. ఇదొక ముళ్ళ మొక్క. దీనిని ఆయుర్వేదంలో గోక్షుర అంటారు.(aster, daisy, or sunflower family- Acanthospermum hispidum) English meaning of palleru =thorny creeping plant called Pedalium murex)» దీని ముళ్లు వల్ల పశువులకు అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది.దీనిలో పెద్దవాటిని ఏనుగు పల్లేరు అంటారు. సాధారణంగా ఇసుక నేలల్లో, ముళ్లతో కూడి కనిపించే ఈ మొక్క విచిత్రంగా ముల్లు కంటే ఎక్కువగా బాధించే మూత్ర సంబంధపు ఇన్‌ఫెక్షన్లను అమోఘంగా తగ్గించగలదు. అలాగే దీనిలోని హార్మోన్ల అంశం వల్ల దీనికి ప్రజనన వ్యవస్థను శక్తివంతం చేసి లైంగిక దోషాలను తగ్గించగలిగే శక్తి అబ్బింది. దీనికి మూత్రాన్ని జారీచేసే శక్తి ఉన్నప్పటికీ, నీరుడు మందుల్లాగా ఇది చర్మాన్ని పొడిగా మార్చదు. దీనిలోని పోషణ అంశాలు శే్లష్మపు పొరలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడి చర్మాన్ని పొడిబారకుండా కాపాడతాయి. పైగా ఇది హస్తపాదాల దురదలను అమోఘంగా తగ్గించగలదు.
ఆయుర్వేద గుణకర్మలు
[మార్చు]మూత్రవిరేచన (మూత్రాన్ని జారీ చేస్తుంది) మూత్రకృఛ్రఘ్న (మూత్రంలో నొప్పిని తగ్గిస్తుంది) అశ్మరీహర (మూత్ర వ్యవస్థలో రాళ్లను కరిగిస్తుంది) భేదన (శరీరంలో సంచితరమైన దోషాలను తొలగిస్తుంది) వేదనాస్థాపన (నొప్పిని తగ్గిస్తుంది) శోథహర (వాపును తగ్గిస్తుంది) వృష్య (కామజ్వాలను పెంచుతుంది) వాజీకరణ (లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుంది) శుక్రశోధన (శుక్రకణాల దోషాలను సరిదిద్దుతుంది) రక్తశోధన (రక్త దోషాలను సరిచేస్తుంది) బృంహణ (శారీరక బరువును పెంచుతుంది) బల్యం (శారీరక బలాన్ని పెంచుతుంది) త్రిదోషహరం (మూడు దోషాలను తగ్గిస్తుంది)
పరిశోధిత విశేషాలు
[మార్చు]డైయూరిటిక్ (మూత్రాన్ని జారీ చేస్తుంది) లితోట్రిప్టిక్ (రాళ్లను కరిగిస్తుంది) యాఫ్రోడైజియాక్ (లైంగిక కేంద్రాలను ఉత్తేజపరుస్తుంది) రిప్రొడక్టివ్ టానిక్ (జననేంద్రియాలను శక్తివంతం చేస్తుంది) నర్వైన్ (నరాలను శక్తివంతం చేస్తుంది) యాంటీ స్పాజ్‌మోడిక్ (అంతర్గత నొప్పిని తగ్గిస్తుంది) ఎనబాలిక్ (జీవక్రియకు తోడ్పడుతుంది)
గృహ చికిత్సలు
[మార్చు]ఒక చిటికెడు పల్లేరుకాయల చూర్ణాన్ని, ఒక టీస్పూన్ అశ్వగంధ చూర్ణాన్ని ఒక కప్పు పాలకు కలిపి మరిగించి, వడపోసుకొని పడుకునే సమయంలో తాగితే మగవాళ్లలో లైంగిక శక్తి పెరుగుతుంది. ఇలాగ కనీసం పది పదిహేను రోజులు వాడాల్సి ఉంటుంది. పల్లేరు చెట్టు బెరడుతో కషాయం తయారుచేసుకొని ఒక టేబుల్ స్పూన్ మోతాదుగా ఉదయం, సాయంకాలం తాగితే పిత్తప్రకోపం వల్ల వచ్చిన తలనొప్పి తగ్గుతుంది. పల్లేరు పువ్వుల ముద్దను ఎండబెట్టి, చూర్ణంగా దంచి, రెండు గ్రాముల మోతాదుగా, రెండు మూడు ఎండు ద్రాక్ష పండ్లతో కలిపి రోజుకి మూడుసార్లు పది పదిహేను రోజులు క్రమం తప్పకుండా సేవిస్తే ఆయాసం, ఉబ్బసం వంటివి తగ్గుతాయి. పల్లేరు మొక్కలు కాయలతో సహా తెచ్చి కచ్చాపచ్చాగా దంచి ఒక కప్పు మేక పాలకు కలిపి నానబెట్టి, మూడు గంటల తరువాత కొద్దిగా నీళ్లు కలిపి, దంచి గుడ్డలో వేసి పిండి, రసం తీయండి. ఈ రసాన్ని ఒక టీ స్పూన్ తేనెతో తాగండి. ఇలా కొంతకాలంపాటు చేస్తే మగవాళ్లలో సంభోగ శక్తి పెరుగుతుంది. పల్లేరు కాయలు, అశ్వగంధ వేర్లు వీటి సమభాగాల సూక్ష్మ చూర్ణాన్ని అర టీస్పూన్ మోతాదుగా, రెండు టీ స్పూన్ల తేనెతో కలిపి రోజుకి రెండుసార్లు తింటూ, పావు లీటర్ పాలను తాగుతూ ఉంటే కొద్ది రోజుల్లోనే క్షయ వ్యాధి, దగ్గు, దౌర్బల్యం ఇలాంటి వ్యాధుల్లో అమితమైన ఫలితం కనిపిస్తుంది.
--Courtesy with డా. చిరుమామిళ్ల మురళీమనోహర్(Ayurvedic physician)