సామల రాజవర్ధన్
సామల రాజవర్ధన్ తెలంగాణ రాష్ట్రాం,ఆదిలాబాద్ జిల్లా, విద్యా నగర్ కు చెందిన ప్రముఖ చిత్రకారుడు విశ్రాంత తెలుగు భాషోపాధ్యాయుడు[1],కవి,రచయిత,సంగీత సాహిత్యంలో విశ్లేషకుడు,ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రంలో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు[2][3].
సామల రాజ వర్ధన్ | |
---|---|
జననం | సామల రాజవర్ధన్ అక్టోబరు 05, 1956 ఆదిలాబాదు, ఆదిలాబాద్ జిల్లా,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ |
నివాస ప్రాంతం | విద్యానగర్, ఆదిలాబాద్ జిల్లా,తెలంగాణ 504001 |
జాతీయత | భారతీయుడు |
విశ్వవిద్యాలయాలు | ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల |
వృత్తి | సంగీత సాహిత్యంలో విశ్లేషకుడు, చిత్రకారుడు, |
ప్రసిద్ధి | ప్రముఖ రచయిత |
భార్య / భర్త | శైలజ |
తండ్రి | సామల సదాశివ |
తల్లి | సులోచనాబాయి |
జననం బాల్యం
[మార్చు]సామల రాజవర్ధన్ తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాదు విద్యానగర్ లో సామల సదాశివ, సులోచనా బాయి దంపతుల రెండో సంతానంగా 1956లో అక్టోబరు 5 న జన్మించాడు.
విద్యాభ్యాసం ఉద్యోగం
[మార్చు]ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల నుండి ఎం.ఎ.తెలుగు పట్టా పొందినాడు. 1984లో ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి డా.ఎన్.గోపి పర్యవేక్షణలో మధురాంతకం రాజారాం కథలు అనే అంశం పై పరిశోధన చేసి ఎం.ఫిల్ పట్టా అందుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా యందు తెలుగు భాషోపాధ్యాయునిగా సేవలందించి పదవీవిరమణ పొందాడు.
రచనలు
[మార్చు]సంగీత సౌరభాలు ఈ గ్రంథం హిందూస్థానీ శాస్త్రీయ సంగీతకారుల పరిచయ మాలిక.
ప్రసంగాలు
[మార్చు]సామల రాజవర్ధన్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రంలో ప్రముఖ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి అసంఖ్యాకమైన ప్రసంగాలు,రూపకాలు ప్రసారమయ్యాయి. మాట సోగసు అనే లఘు ప్రసంగ మాలిక బహుళ జనాదరణ పొందింది.
సంగీత,సాహిత్యంలో కృషి
[మార్చు]సంగీత సాహిత్యంలో ప్రముఖ విశ్లేషకుడిగా మంచి పేరు సంపాదించిన సామల రాజ వర్ధన్ సంగీత సాహిత్య సమలంకృతుడు, బహుముఖీనమైన ప్రతిభ గల సరస్వతీ పుత్రుడు, స్వరలయలు గ్రంథకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, డాక్టర్. సామల సదాశివ మాస్టారు తనయుడు[4].వీరు రాసిన సంగీత విశ్లేషణ,పండుగలకు సంబందించిన వ్యాసాలు వివిధ మాస,పక్ష,వార పత్రికల్లో ప్రచురించబడినాయి[5].తెలంగాణ లో సంగీత మధురిమలు వ్యాసం తెలుగు విశ్వవిద్యాలయం వారు,సంగీత నృత్యాలు పరిఢవిల్లెనిచ్చట అనే పేరుతో ప్రపంచ తెలుగు మహా సభల సందర్బంగా ప్రచురించారు. మూసీ,పాలపిట్ట, ఆంధ్రభూమి మొదలైన పత్రికలలో సంగీతజ్ఞుల పరిచయాత్మకంగా ధారావాహికగా యాభ్భై వ్యాసాలు ప్రచురితమైనాయి. ఈ సంగీతజ్ఞుల రేఖా చిత్రాలను స్వయంగా చిత్రించడం మరో విశేషం. సునాద వినోదిని పేరిట ఫేస్ బుక్ వాల్ మీద 150 కి పైగా రాసిన వ్యాసాలు రసజ్ఞుల ప్రశంసలు అందుకుంటునారు. మధురాంతకం రాజారాం మూడు వందల కథలను క్షుణ్ణంగా పరిశీలించి, విశ్లేషణ చేసి తమ సిద్దాంత వ్యాసాన్ని సమర్పించినారు. డా.ఎన్.గోపి తొలి పరిశోధక విద్యార్థి.వీరికి పరీక్షకురాలిగా వచ్చిన డా.సి.ఆనందరామం ఈ పరిశోధనను మెచ్చుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "బహుముఖ కళా రంగాల్లో రాణిస్తున్న విశ్రాంత భాషోపాధ్యాయుడు." News18 తెలుగు. 20240719. Retrieved 2024-07-27.
{{cite web}}
: Check date values in:|date=
(help) - ↑ "This Telangana Teacher's Expertise In Writing, Drawing And Music Has Locals' Attention". News18 (in ఇంగ్లీష్). 2024-07-19. Retrieved 2024-07-27.
- ↑ "MSN". www.msn.com. Retrieved 2024-07-27.
- ↑ telugu, NT News. "Manchiryal new distic Latest News in Telugu, Manchiryal new distic News, Manchiryal new distic Online News Live, Manchiryal new distic Updates | Namasthe Telangana - Page- 8". www.ntnews.com. Retrieved 2024-07-27.
- ↑ Bharat, E. T. V. (2021-09-06). "ఎద్దులకూ ఓ పండుగ ఉంది.. ఎక్కడ చేస్తారో తెలుసా!". ETV Bharat News. Retrieved 2024-07-27.