ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం
స్థాపన1986
రకంరేడియో
కార్యస్థానం
సేవా ప్రాంతాలుభారత్
ముఖ్య కార్యక్రమాధికారికేంద్రే రామేశ్వర్

ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం, ఇది ఆలిండియా రేడియో (అధికారికముగా ఆకాశవాణి) (హిందీ: आकाशवाणी) భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ వారి ఒకానొక ప్రసార కేంద్రం.[1]

ఈ కేంద్రం ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నది.

చరిత్ర[మార్చు]

ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం 1986 అక్టోబరు 12న ప్రారంభించబడినది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాద్ కేంద్రం 1933లో, విజయవాడ కేంద్రం 1948లో, కడప ఆకాశవాణి కేంద్రం 1963లో జూన్ 17న, విశాఖపట్నం కేంద్రం అదే సంవత్సరం ఆగస్టు నాలుగున ప్రారంభమైనాయి.

ప్రసార సామర్థ్యం[మార్చు]

ప్రస్తుతం 3 కిలో వాట్ల సామర్థ్యం గల ఎఫ్ఎం టవర్ ని ఉపయోగిస్తూ 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రదేశాలకు ఈ కేంద్రం నుండి వెలువడే ప్రసారాలు అందుబాటులో ఉన్నాయి. అయితే కరోనా కాలానికి ముందే మంజూరు అయిన 10 కిలో వాట్ల టవర్ అందుబాటులోకి వస్తే ఈ కేంద్రం నుండి వెలువడే ప్రసారాలు 100 కిలోమీటర్ల పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి.

విశిష్టతలు[మార్చు]

ఈ కేంద్రం నుండి ప్రసారమయ్యే విషయాలు పూర్తిగా ఉత్తర తెలంగాణా భాషా మాండలికాలపై దృష్టి సారిస్తూ ఉంటాయి. అంతే కాకుండా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాలలో మాట్లాడే ఆదివాసీ భాషలైన గోండి, కొలామి, బంజారా లలో కూడా ప్రసారాలను అందిస్తున్నారు. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం వలన ఇక్కడి ప్రజలు మరాఠి భాషలో కూడా అంశాలను వినడం దృష్ట్యా ఆయా అంతర్రాష్ట్ర భాషలలో కూడా ఆదిలాబాద్ ఆకాశవాణి కేంద్రం వారు ప్రసారాలు చేపడతారు.[2]

ఏటా ఫిబ్రవరి 15 వ తారీఖున ఈ రేడియో వారు జరిపే కిసాన్ దినోత్సవం నాడు, వినూత్న విధానాలలో వ్యవసాయం చేస్తున్న రైతులని ఆహ్వానించి వారిని సన్మానిస్తారు. అలాగే ఆరోజున పాత కాలం నాటి రేడియోలని కూడా ప్రదర్శనలో ఉంచుతారు.

మూలాలు[మార్చు]

  1. Today, Telangana (2020-10-11). "AIR-Adilabad celebrates 34th anniversary". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-10-13.
  2. "ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం.. శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానం". News18 Telugu. Retrieved 2022-10-13.