గోండి (భాష)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోండు భాష : ఆదిలాబాదు మరియు బస్తర్ జిల్లాల్లో గోండు గిరిజనులు మాట్లాడే భాషే గోండు భాష. ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన గోండీ, తెలుగు కన్నా కన్నడకు దగ్గరగా ఉంటుంది. గోండుల్లో ఇప్పటికీ చాలా మందికి గోండీ తప్ప మరే భాషా రాదు, అర్థం కాదు. గోండులతో సహవాసం చేసే కొలాములు తమ భాష కొలామీయే కాక గోండీ కూడా మాట్లాడగలరు. ప్రధాన్‌ వంటి ఇతర గిరిజన జాతులకు కూడా ఇదే మాతృభాష.

గోండు విద్యార్థులు

కొన్ని పదాలు[మార్చు]

ఎడ్కి - జ్వరము, పిర్ - వాన, మర్మి - పెండ్లి, కేడ పేన్ - అడవి దేవుడు, పాడి - ఇంటి పేరు, నాడి - రేపు, నర్ క - రాత్రి, సక్ రే - ప్రొద్దున, ఆటుం - అంగడి, సారి - రొట్టె, ఉద - కూర్చో, రోన్ - ఇల్లు, సమ్దిర్ - అందరు, చొకోట్ - క్షేమం, కాండి - కొడుకు, పేడి - కూతురు,కరుమ్ - దగ్గర, లంగ్ - దూరం, పోడ్ దరి - సాయంకాలం, జోప్(కూర్క్)- నిద్ర, తరస్ - పాము, పెర్స - పెద్ద, యేర్ - నీరు, గాటో - అన్నం, కై కాల్ - కాలు చేతులు, మంత - ఉంది, సిల్లె - లేదు, పొరోల్ - పేరు, బత పొరోల్? - ఏమి పేరు?, గాటో తిత్తికీ ?- అన్నం తిన్నవా?

బయటి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]