Jump to content

చర్చ:ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పలు సందేహాలు

[మార్చు]

ఈ వ్యాసంలో చాలా అంశాలు తికమకగా ఉన్నాయి, ఉదాహరణకు

1. అప్పటి ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఈ కేంద్రం మొట్ట మొదటగా స్థాపించబడింది, ఇది దేశంలోనే మూడవ ఆలిండియా రేడియో కేంద్రం

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో హైదరాబాద్ కేంద్రం 1933లో, విజయవాడ కేంద్రం 1948లో, కడప కేంద్రం 1963లో జూన్ 17న, విశాఖపట్నం కేంద్రం అదే సంవత్సరం ఆగస్టు నాలుగున ప్రారంభమైతే 1986లో ప్రారంభమైన కేంద్రం రాష్ట్రంలో మొదటిదీ, దేశంలో మూడవదీ ఎట్లా?

2. 1986లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావా? భవనం వెంకట్రామా?

3. ఏఎం కంటే ఉన్నతమైన ప్రసారాలను ఎఫ్ఎం ద్వారా అందిచవచ్చు...

దీనికి ఆధారమేమిటి? ఏఎం ప్రసారాలు వందల కిలోమీటర్ల దూరం నుంచి వినవచ్చు. ఎఫ్ఎం ప్రసారాలు యాభై కిమీ దాటితే వినబడడం గగనం. త్రివిక్రమ్ (చర్చ) 18:14, 27 డిసెంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]