గీటురాయి తెలుగు ఇస్లామిక్ వార పత్రిక

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భారతదేశంలో ఇస్లాం
చరిత్ర

నిర్మాణాలు

మొఘల్ · ఇండో-ఇస్లామిక్

ప్రఖ్యాత వ్యక్తులు

ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్
 · అహ్మద్ రజా ఖాన్
 · మౌలానా అబుల్ కలాం ఆజాద్
సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్  · బహాదుర్ యార్ జంగ్
 · అబ్దుల్ కలాం

కమ్యూనిటీలు

ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు
కొంకణి · మరాఠీ · వోరా పటేల్
మెమన్ లు · ఈశాన్య భారత · కాశ్మీరీs
హైదరాబాదీ · దావూదీ బోహ్రా· ఖోజా
ఒరియా · నవాయత్ · బీరీ  · సెయిట్‌లు
మియో · సున్నీ బోహ్రా
కాయంఖానీ · బెంగాలీ

న్యాయ పాఠశాలలు

హనఫీ · షాఫయీ · మాలికి · హంబలి

విశ్వాస పాఠశాలలు

బరేల్వీ · దేవ్‌బందీ · షియా · అహ్‌లె హదీస్

భారత్‌లో మస్జిద్‌లు

భారతదేశంలో చారిత్రక మస్జిద్‌లు

సంస్కృతి

ముస్లింల ఆచారాలు

ఇతర విషయాలు

దక్షిణాసియాలో అహ్‌లె సున్నత్ ఉద్యమం
కేరళలో ఇస్లాహీ ఉద్యమం
భారత ముస్లింలలో జాతీయతా భావాలు
భారతీయ చరిత్ర కొరకు ముస్లిం క్రానికల్స్

గీటురాయి: ఈ పదానికి అరబ్బీ సమానార్థం "ఫుర్ఖాన్". ఈ పేరుతో హైదరాబాదు నుండి తెలుగుభాషలో వెలువడుతున్న ఒక "ఇస్లామీయ పత్రిక". ఈ పత్రిక తన రచనలను " అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో" అనే ఇస్లామీయ ప్రారంభ వాక్యంతో ప్రారంభిస్తుంది.

గీటురాయి ఒక తెలుగు ఇస్లామిక్ వార పత్రిక. దీని ప్రచురణ కర్తలు తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్, హైదరాబాదు వారు.

గీటురాయి

[మార్చు]

ఇస్లామీయ సాహిత్య భాండాగారం అపారమైనది. కొన్ని లక్షల పేజీల అక్షర సంపదకు నెలవైన, విస్తృతరమైన, వైవిధ్యభరితమైన, ఇస్లామీయ ధార్మిక సాహిత్యం శాఖోపశాఖలుగా వ్యాపించి ఉంది. సర్వసృష్టికర్త, సమస్తవిశ్వానికి ప్రభువు, అందరి పోషకుడు, అయిన అల్లాహ్ నిర్దేశించిన మహత్తర భావనలు, నీతి నియమాలు, బోధనలు, ఆదేశాలు, విలువలు, ప్రమాణాలు ప్రాతిపదికగా పుంఖానుపుంఖాలుగా వెలువడిన ఇస్లామీయ సాహిత్యాన్ని తెలుగులో విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యతను గుర్తించి ఉనికిలోకి వచ్చిన ప్రచురణల సంస్థ 'తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్'.

దివ్యఖుర్ఆన్ ఆడియో కేసెట్ల పరంపరలో మొదట 30వ భాగం – పారయే అమ్ కేసెట్-ను విడుదల చేసింది. అనంత కరుణామయుడైన అల్లాహ్ దయవల్ల తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ దివ్యఖుర్ఆన్ తెలుగు అనువాదంతో పాటు, మహాప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచనాలను, ఇస్లాంను పరిచయం చేసే పుస్తకాలను, ఇస్లాం పట్ల గల అపార్ధాలను తొలగించే మహోపయుక్తమైన గ్రంథాలను, ఇస్లామీయ జీవన విధానాల గురించి ముస్లిం సోదరులలోను, ముస్లిమేతర సోదరులలోను తలయెత్తే రకరకాల సందేహాలను నివృత్తి చేసే ప్రశ్నోత్తర సంపుటం మొదలు నమాజ్ కు సంబంధించి విధి విధానాలను వివరించే పుస్తకాల వరకు తేటతెలుగులో విభిన్న రంగాలకు చెందిన రచనలను వెలువరించింది. వాటిలో అరబ్బీ, ఉర్దూ, ఆంగ్లం, తమిళం వంటి భాషల నుంచి చేసిన అనువాదాలు, తెలుగులో రచించిన మౌలిక గ్రంథాలు ఉన్నాయి.

ఇస్లాం సందేశ పరిచయ కార్యక్రమము:

[మార్చు]

ముస్లిమేతర ప్రజలకు ఇస్లాం సందేశాన్ని పరిచయం చేయడానికి – తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ – వివిధ ప్రాజెక్టుల ద్వారా ప్రయత్నిస్తోంది. అలాంటి కార్యక్రమాల్లో ముస్లిమేతర ప్రముఖులకు ఇస్లాం పరిచయం కూడా ఒకటి. వివిధ వర్గాల మధ్య సామరస్యం, సౌభ్రాతభావం, సహిష్ణుతలను పెంపొందించడానికి ఉద్దేశించినవే ఈ కార్యక్రమాలు. ఇస్లాం గురించి ముస్లిముల గురించి ప్రచారంలో ఉన్న అనుమానాలు, అపోహలు, అపార్ధాలను దూరం చేసి, ఇస్లాం వాస్తవికతను వారికి పరిచయం చేయడానికే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

ఈ సందర్భంగా ముస్లిమేతర ప్రముఖుల్లో, ముఖ్యంగా పాలనాయంత్రాంగం, పోలీసు యంత్రాంగం, తదితర విభాగాల్లోని ముఖ్య అధికారులకు, సమాజంలో పలుకుబడి కలిగిన పెద్దలకు ఇస్లాం గురించి తెలియజేసే సాహిత్యాన్ని పంపిణీ చేయడం ద్వారా సమాజంలో ఇస్లాం గురించి చక్కని అవగాహన కలిగించవచ్చు. ఎందుకంటే, సమాజంలో కీలకపాత్ర పోషించే ఈ ప్రముఖులకు ఇస్లాం పరిచయం చేయడం ద్వారా ఇస్లాం గురించి ప్రచారంలో ఉన్న అపార్థాలు, అపోహలు, తొలగించడం తేలికవుతుంది. ఈ విధంగా మతసామరస్యం, సహజీవన భావాలను పెంపోందించవచ్చు.

తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ఈ ఉద్దేశంతో దివ్యఖుర్ఆన్ తెలుగు అనువాదంతో సహా అనేక ఇస్లామీయ బోధనల పుస్తకాలను ఈ ప్రముఖులకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. దాదాపు 500 రూపాయలు విలువ కలిగిన పుస్తకాల సెట్లను పంపిణీకి ఎన్నుకోవడం జరిగింది. ఇలాంటి 4000 సెట్టులను పంపిణీ చేయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రాజెక్టు దేవుని దయవలన మంచి ఫలితాలను సాధిస్తుందని, సమాజంలో సామరస్యం, సోదరభావం, సహజీవన భావాలను పెంపొందిస్తుందని మా విశ్వాసం. ఈ మంచి కార్యక్రమానికి మాతో సారూప్యభావాలు కలిగిన వారు, సమాజహితం, శాంతి శ్రేయాలు అభిలషించేవారు తమ చేయూతనిచ్చి ప్రోత్సహిస్తారన్న నమ్మకంతొ గీటురాయి కార్యక్రమాలను సాగిస్తున్నది.

గీటురాయి ఆశయము

[మార్చు]

గీటురాయి మూడు దశాబ్దాల ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. చరిత్ర గతి కొత్తపుంతలు తొక్కడానికి వైజ్ఞానిక, సాంకేతిక శాస్త్రాలు కాలంతో పాటు కదం తొక్కుతూ కొత్త శిఖరాలు అందుకోడానికి ఈ కాల వ్యవధి చాలు.

పరిమిత వనరులు, సాధారణ సాధనా సంపత్తి ఉన్న గీటురాయి లాంటి మామూలు పత్రిక మూడు దశాబ్దాల పాటు ఒడిదుడుకులను తట్టుకొని నిలకడగా అడుగులు ముందుకు వేయడమంటే కాలప్రవాహానికి ఎదురీదడమే. ఈ ఎదురీతలో గీటురాయి అలుపెరుగక పురోగమిస్తుందంటే కారణం – అసాధారణ సైద్ధాంతిక బలం, కర్తవ్యదీక్ష, విలువల పట్ల అంకితభావం, పాఠకుల అసమాన అభిమానాలే. ఈ బలంతోనే గీటురాయి కాల ప్రవాహానికి ఎదురీదుతూ – సమకాలీన పత్రికా జగతిలో మిరుమిట్లు గొరిపే రంగుల హరివిల్లుల మధ్య స్వచ్ఛమైన తెల్లని మేఘంలా ముందుకు సాగుతుంది.

సమాజానికి వ్యక్తులే పునాది రాళ్ళు. వ్యక్తులు సౌశీలవంతులు కానంతవరకు, వారి భావాలు, విలువలు ఉన్నత సిద్ధాంతాలతో ప్రభావితం కానంతవరకు సంక్షోభిత సమాజానికి చల్లటి వీచికలు ప్రాప్తంకావు. ఎలాంటి వ్యక్తులో, అలాంటి సమాజమే, ఎలాంటి సమాజమో అలాంటి ప్రభుత్వమే ప్రాప్తిస్తాయి. అందువల్ల సమాజంలో విలువలను, ప్రమాణాలను, సచ్ఛీలాన్ని, దైవభక్తి, దైవభీతిని సృజించడానికి ప్రారంభం నుంచి గీటురాయి చేస్తున్న ప్రయత్నాలు పలువురి ప్రశంసలు పొందాయి.మత సామరస్యం కోసం, అపోహలు, అపార్థాలు దూరం చేయడానికి, ఇస్లామీయ జీవన వ్యవస్థను ప్రజలకు పరిచయం చేయడానికి గీటురాయి చేస్తున్న కృషిని అనేకులు మెచ్చుకున్నారు. ఈ ప్రశంసలు మెప్పులే గీటురాయికి కొండంత బలం.

ప్రజాస్వామ్య, శాంతియుత, చట్టబద్ధమైన విధానాల ద్వారానే ప్రజలు తమ లక్ష్య సాధనకు కృషిచేయాలని గీటురాయి సదా కోరుకొంది. అన్ని వర్గాలు కలసికట్టుగా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించాలని అభిలషించింది. అందుకు అవసరమైన వాతావరణాన్ని ఏర్పరచడానికి వివిధ వర్గాల మధ్య సదవగాహన, సహజీవన భావనలు పెంపొందించడానికి కృషిచేస్తోంది. దైవభక్తి, పరలోక భీతి ఆధారంగా మాత్రమే మనిషి సదాచార సంపన్నునిగా, పరోపకారిగా రూపుదిద్దు కొంటాడన్నది గీటురాయి నమ్మకం. ఆ దిశగా గీటురాయి ప్రజలను ప్రోత్సహిస్తోంది. గత మూడు దశాబ్దాలుగా గీటురాయి ఈ విధి బాధ్యతలనే నిర్వహిస్తూ వస్తోంది. మున్ముందు కూడా ఈ విధి బాధ్యతలనే నిర్వహిస్తుంది.

ఇది తేలికైన పని కాదు. నీతికి, భక్తికి, భీతికి చోటులేని కేవలం భౌతికవాదం రీతి రాజ్యం చేస్తున్నప్పడు ఆ గాలివాటానికి పెద్ద పెద్ద వృక్షాలే మూలాలకు తిలోదకాలిచ్చి మిధ్యాజగత్తులో ఎగురుతున్నప్పుడు ఆ ప్రవాహాన్ని తట్టుకొని, మౌలిక సూత్రాలకు, మూలాలకు అంటి పెట్టుకొని కాల ప్రవాహానికి ఎదురీదడం మున్నందు కొనసాగుతుంది. ఈ సందర్భంగా పాఠకుల ఆదరాభిమానాల ప్రోత్సాహం పుష్కలంగా లభిస్తుందని గీటురాయి ఆశిస్తోంది.

సందేశ భవనం

[మార్చు]

హైదరాబాదు నగరం ప్రపంచంలోనే ఒక ప్రత్యేకత ఉన్న నగరం. ఇస్లామీయ సాహిత్యం, ఇస్లామీయ సంస్కృతీ సభ్యతలకు హైదరాబాదు కేంద్రంగా ఉంటూ వచ్చింది. భారతదేశం అంతటినీ ప్రభావితం చేసిన అనేక ఉద్యమాలకు జన్మస్థానంగా ప్రత్యేకతను సంతరించుకుంది. అనేక మంది ప్రముఖులకు, సంస్కర్తలకు, మేధావులకు, పుట్టినిల్లు హైదరాబాదు. ఆధునిక కాలంలో హైదరాబాదు హైటెక్ సిటీగా పేరెన్నిక గన్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా జ్ఞాన విజ్ఞానాలు ఎల్లెడలా వ్యాప్తి చెందే అవకాశం నేడు లభించింది. ఇస్లామీయ బోధనలు, ఇస్లామీయ సందేశాన్ని ప్రజలు మాట్లాడే భాషలోనే అందించాలన్నది ఎవరూ కాదనలేని యథార్థం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోనూ బయట వివిధ రాష్ట్రాలలోను, విదేశాల లోనూ దాదాపు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడే ప్రజలున్నారు. ఇస్లామీయ సాహిత్యం అరబీ, ఉర్దూ, ఫారసీ, ఇంగ్లీషు తదితర భాషల్లో అపారంగా ఉన్నప్పటికీ తెలుగులో ఇస్లామీయ సాహిత్యం చాలా తక్కువగా ఉంది.


తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ఈ కొరతను తీర్చడానికి నడుం బిగించింది. చక్కని వ్యవహారిక తెలుగులో, సులభమైన శైలిలో, సరళమైన భాషలో తెలుగు పాఠకులకు ఇస్లామీయ బోధనలు, ఇస్లామీయ సందేశం అందించాలన్న లక్ష్యంతో తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ పనిచేస్తుంది. భారతదేశ చరిత్రలో ఇస్లామీయ సాహిత్యాన్ని తెలుగు భాషలో ఒక ఉద్యమంగా ప్రచురించడం ప్రారంభించిన సంస్థ తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్. హైదరాబాదు పాత నగరంలో, చత్తాబజార్ ప్రాంతంలో, సాలార్ జంగ్ మ్యూజియానికి వెనుక భాగాన నిర్మించిన—సందేశ భవనం – కేంద్రంగా తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ప్రచురణల కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.


ప్రచురణలకు గాను ఒక అధునాతనమైన ఆఫ్ సెట్ ప్రింటింగ్ మిషన్, ప్లేట్ మేకింగ్ సదుపాయంతో పాటు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సిబ్బందికి ఈ భవనంలో గృహవసతి కల్పించి పబ్లికేషన్ను ఒక ఉద్యమంగా కొనసాగించడం జరుగుతుంది. ప్రచురణల కోసం ఒక అధునాతనమైన కంప్యూటర్ డి.టి.పి సదుపాయం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇటీవల ఒక వాహనాన్ని సమకూర్చుకుని, పుస్తకాలను – బుక్ షాప్ ఆన్ వీల్స్- ద్వారా ప్రజలందరి వాకిట తీసుకువెళ్ళడానికి ఇస్లామీయ సందేశాన్ని, ఇస్లామీయ బోధనలను, అందరికీ చేరవేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. సమాజంలో వివిధ మతవర్గాల మధ్య సామరస్యాన్ని పెంచడానికి, ఒకరినొకరు అర్ధం చేసుకుని అవగాహన పెంచుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందిస్తూ, అపార్ధాలు తొలగిస్తూ, సహిష్ణుత, సామరస్యాలు పెంచడానికి తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ చేస్తున్న ఈ కృషికి అందరి తోడ్పాటు, చేయూత ఎంతైనా అవసరం.

తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ప్రచురణలు

[మార్చు]

1. దివ్యఖుర్ఆన్
2. ఖుర్ఆన్ అవగాహనం
3. దివ్యఖుర్ఆన్ (30వ భాగం)
4. హదీసు వెలుగు 5. హదీసు వెలుగు (అరబీ మూలంతో) 6. ప్రవక్త ప్రవచనం (అరబీ మూలంతో)
7. ఇస్లామీయ జీవన సరళి 8. మహాప్రవక్త ముహమ్మద్ (స) 9. ఇస్లాం అపార్ధాల మబ్బుల్లో
10. ఇదియే ఇస్లాం
11. నేను ఆరాధించే ఇస్లాం
12. వెన్నెల తెరలు
13. సందేహాలు సమాధానాలు
14. జుమా ప్రసంగాలు
15. సంకెళ్ళు
16. ప్రభువు పిలుస్తున్నాడు.
17. ఆధునిక ఆర్థిక సిద్ధాంతాలు 18. ధర్మపథంలో జీవనరథం
19. ఇస్లాం శిక్షణ 20. ఆరాధనలు 21. నమాజ్ పుస్తకం
22. ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ (స)
23. ఇస్లాం , అజ్ఞానం
24. సాక్ష్యం మానవాళి సమక్షంలో
25. ఇస్లాం రాజకీయ సిద్ధాంతం
26. హేతువు కాంతిలో దైవప్రవక్త
27. ప్రవక్త సందేశం
28. ఖుర్ఆన్ అవగాహనకు మూలసూత్రాలు
29. భవబంధాలు మోక్షానికి ప్రతిబంధకాలా
30. అంటరానితనం
31. ఆదర్శమూర్తి
32. శ్రేయస్కర మార్గం
33. మరణానంతర జీవితం
34. ధర్మ సంస్థాపనం
35. నమాజ్
36. ఇస్లాం పరిచయం
37. ముఖ్యహితవులు 38. కారుణ్యవ్యవస్థ 39. దివ్యఖుర్ఆన్ ముహమ్మద్ (స) రచన కాదు
40. పరదా ప్రగతికి ప్రతిబంధకమా
41. యదార్ధమేది
42. దైవనియమావళి
43. లోకశాంతి
44. మతం - రాజకీయం 45. నిర్మాణం – విచ్ఛిన్నం 46. ముస్లిం పర్సనల్ లా
47. ఈమాన్ వాస్తవికత
48. ఇస్లాం వాస్తవికత
49. ఆరాధనల వాస్తవికత
50. జకాత్ వాస్తవికత
51. హజ్ వాస్తవికత
52. కలిమయే తయ్యిబా అర్థం
53. అల్ ఫాతెహా (తఫ్ హీముల్ ఖుర్ఆన్) 54. ఇస్లామీ మతధర్మం 55. పెట్టుబడిదారీ- సామ్యవాదం – ఇస్లాం
56. ఇస్లాం దృష్టిలో మధ్యనిషేదం
57. ధర్మపథం
58. సత్యధర్మం
59. ఖురానీ గాధలు
60. దైవప్రవక్తలు (1వ భాగం)
61. దైవప్రవక్తలు (2వ భాగం)
62. దైవప్రవక్తలు (3వ భాగం)
63. దైవప్రవక్తలు (4వ భాగం)
64. నీతి కథలు (1వ భాగం )
65. నీతి కథలు (2వ భాగం )
66. నీతి కథలు (3వ భాగం )
67. నీతి కథలు (4వ భాగం )
68. ఈ తల్లి ఒడిలో........... 69. బుష్రా ఉత్తరాలు 70. ప్రియమైన అమ్మకు
71. తీర్పులు
72. విరిసిన మొగ్గలు
73. మణిహారం (1వ భాగం)
74. మణిహారం (2వ భాగం) 75. మహనీయుల బాట (1వ భాగం) 76. మహనీయుల బాట (2వ భాగం)
77. నికాహ్ ప్రసంగం
78. జమాఅతె ఇస్లామి హింద్ చరిత్ర (1వ భాగం)
79. జమాఅతె ఇస్లామి హింద్ చరిత్ర (2వ భాగం)
80. జమాఅతె ఇస్లామి హింద్ చరిత్ర (3వ భాగం) 81. దివ్యగ్రంథంలో దైవ ప్రవక్త 82. దైవదాస్యమే మానవ ఔన్నత్యం
83. మానవ హక్కులు 84. జాతీయ సమైక్యత 85. ఇస్లాం ప్రబోధిని (మొదటి భాగం)
86. ఇస్లాం ప్రబోధిని (రెండవ భాగం)
87. ఇస్లాం ప్రబోధిని (మూడవ భాగం)
88. ఇస్లాం ప్రబోధిని (నాల్గవ భాగం)
89. బైబిల్ లో ముహమ్మద్ (స)
90. మానవులు – సమస్యలు
91. దైవ మార్గం లో సతత సమరం – జిహాద్
92. ప్రయ ప్రవక్త (స) 93. మానవ సేవ 94. టెర్రరిజం – ఇస్లామీయ బోధనలు
95. మాటల ముత్యాలు
96. హజ్రత్ సాలమ్ (రజి)
97. సామాజక న్యాయం ఇస్లాంలోనే సాధ్యం
98. ఇస్లామీయ పరిభాషలో జిహాద్
99. రండి ! ఈ ప్రపంచాన్ని మారుద్దాం !
100. భారతీయ సమాజంలో పరమత సహనం
101. నవయుగం నవతరం
102. భారత దేశంలో ఇస్లామీయ సందేశం
103. ఇస్లాం ఉగ్రవాదానికి వ్యతిరేకం
104. సత్యాన్వేషణ
105. మానవుల్లో సోదర భావం
106. శాంతి ఎలా స్థాపితమవుతుంది ?
107. పరలోక భావన భారతీయ సాంప్రదాయాలు
108. హజ్రత్ అబూబక్ర్ (రజి)
109. హజ్రత్ ఉమర్ ఫారూఖ్-యె-ఆజమ్ (రజి)
110. హజ్రత్ ఉస్మాన్ గని (రజి)
111. హజ్రత్ అలీ (రజి)
112. ప్రవక్త (స) వారి ప్రాణమిత్రులు
113. అమెరికాలో నవ ముస్లిముల వాస్తవ గాథలు
114. ఇస్లాం అధ్యయనం ఎందుకు చేయాలి ?
115. నిన్ను నీవు తెలుసుకో
116. స్వీయ సంస్కరణ
117. బాలశ్రామికులు
118. జమాఅతె ఇస్లామీ హింద్ ప్రాధాన్యతలు
119. దైవదౌత్యం ముగింపు
120. ధర్మపథంలో అవరోధాలు
121. హజ్రత్ ఆయెషా (రజి)
122. ఎడారి పువ్వు
123. మానవులంతా ఒక్కటే
124. మధురమైన మాటలు
125. తూరుపుతావి
126. ఖుర్ఆన్ 24 ఆయత్ లు – అభ్యంతరాలు, వాస్తవికత
127. ఖుర్ఆన్ అవగాహనం (మొదటి సంపుటం)
128. హజ్ పరమార్థం
129. ఒక మనిషి రెండు వైఖరులు
130. క్యాంపస్ గైడ్ (ఎస్.ఐ.ఒ)
131. ఖుర్ఆన్ దైవగ్రంథం
132. తెలుగు అధికార భాష కావాలంటే......
133. దానా హకీమ్
134. దాంపత్య నియమాలు
135. ప్రపంచ మతాలు – ఇస్లాం
136. భారత స్వాతంత్రోద్యమం – ముస్లింలు
137. మైసూరు పులి – టిప్పుసుల్తాన్
138. షహీద్ యె ఆజం-అష్ఫాఖుల్లా ఖాన్
139. మానవ మహోపకారి ముహమ్మద్ (స)
140. మేరాజ్ యాత్ర - సందేశం
141. ఒడి నుండి సమాధి వరకు
142. రమజాన్ శుభాలకు అర్హులు
143. రమజాన్ సత్కార్యాల సమాహారం
144. హజ్రత్ ఇమామ్ హుసైన్
145. అంతరిక్ష అధ్యయనం – దివ్యఖుర్ఆన్
146. భారత స్వాతంత్రోద్యమం – ముస్లిం మహిళలు
147. ఉమ్మడి కుటుంబం – ఇస్లాం
148. బహుభార్యత్వం- ఎప్పుడు – ఎందుకు ?
149. భ్రూణహత్యలు
150. వివాహ సంబంధాల ఎంపిక ఎలా చేయాలి ?
151. వివాహ సంబంధాలు – అసమానతా భావాలు ఇస్లామ్
152. వివాహాలు దుబారా ఖర్చులు
153. లింగవివక్ష
154. సంతానానికి శిక్షణ
155. తలాఖ్
156. దిక్సూచి
157. జాతి నిర్మాణంలో నైతిక విలువలు
158. మీలాదున్నబి
159. యదార్థాల అద్దంలో కామన్ సివిల్ కోడ్
160. కట్న కానుకలు వారసుల ఆస్తిహక్కులు
161. మహిళల ఉపాధి – పరిధులు, అవసరాలు
162. మహాప్రవక్త సహచరుల సందేశ సరళి
163. సత్య సందేశం – ముస్లిమేతరులు
164. దైవసానిధ్యం కోసం ఏం చేయాలి ?
165. విపులా చ పృధ్వీ
166. ప్రవక్త (స) పలుకులు జరిగిన సంఘటనలు
167. శిక్షణకు తొలిమెట్టు
168. దంపతుల హక్కులు
169. ఇస్లామీయ ఉద్యమం – కార్యకర్తలు
170. బాలల సంవత్సరం – ఇస్లాం సందేశం
171. లైంగిక సంబంధాలు ప్రకృతి నియమాలు
172. సూక్తి శతకం
173. తల్లిదండ్రులు – సంతానం హక్కులు, బాధ్యతలు
174. The Holy Quran is Infallible
175. భారత స్వాతంత్ర్యోద్యమం – ముస్లిం యోధులు -1వ భాగం
176. భారత స్వాతంత్ర్యోద్యమం- ముస్లిం ప్రజాపోరాటాలు
177. ఇస్లాం సుశిక్షణా వ్యవస్థ
178. ఉర్దూ సాహిత్యం
179. రమజాన్ కు స్వాగతం
180. ఇస్లాం ధ్యేయం ఏమిటి ?
181. విజయానికి ఏకైక మార్గం ఇస్లాం
182. బాలబాలికలకు ఖుర్ఆన్ పరిచయం
183. ఇస్లామీయ రాజ్యంలో ముస్లిమేతరుల హక్కులు
184. రమజాన్ ఉపవాసాలు
185. మానవ సేవ దైవదాస్యం
186. మగువల మాటలు
187. 1857 ముస్లింలు
188. సాహిత్యం వాదవివాదాలు
189. ఖుర్ఆన్ ఆడియో కేసెట్ల సెట్టు (60 కేసెట్లు)
190. దివ్యఖుర్ఆన్ ఆడియో సి.డి.లు ( 4 సి.డి.లు)

మూలాలు

[మార్చు]