దొనకొండ
దొనకొండ | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°52′N 79°28′E / 15.867°N 79.467°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | దొనకొండ |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08406 ) |
పిన్‌కోడ్ | 523336 |
దొనకొండ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా, దొనకొండ మండలం లోని రెవెన్యూయేతర గ్రామం,ఇది దొనకొండ మండలకేంద్రం. బ్రిటీష్ వారి పరిపాలన కాలంలోనే ఇక్కడ విమానాశ్రయం నిర్మించి వాడారు. రైల్వే పరంగా కూడా మీటర్ గాజ్ రైలు కాలంలో ఇక్కడ రైల్వే సంస్థలు వుండేవి. ఇప్పుడు ఇది ఒక ప్రధాన రైలుకూడలి.
చరిత్ర
[మార్చు]ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు దొనకొండ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండేది. బ్రిటీష్ పాలకులు 1934లో దొనకొండకు దగ్గరలో 136.5 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించారు.
భౌగోళికం
[మార్చు]భూమి వినియోగం
[మార్చు]ప్రభుత్వ లెక్కల ప్రకారం దొనకొండ ప్రాంతంలో 35 వేల ఎకరాల సాగు భూమి ఉండగా, 25 వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు పరిధిలో ఉంది. సుమారు 34 వేల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి.
పరిపాలన
[మార్చు]దొనకొండ పరిపాలన గ్రామ పంచాయితీ ద్వారా జరుగుతుంది.[1]వీరభద్రాపురం గ్రామం, ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]- శ్రీ విజయాంజనేయస్వామివారి దేవస్థానం
దొనకొండ నాలుగు రహదారుల కూడలిలోని ఈ ఆలయంలో, ప్రతి సంవత్సరం చైత్రమాసంలో, శ్రీరామనవమి తరువాత, స్వామివారి తిరునాళ్ళు వైభవంగా నిర్వహిస్తారు. [2]
- ఏబీఎం బాప్టిస్ట్ చర్చ
ఇది 19 వశతాబ్దంలో నిర్మితమైంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]రోడ్డు రవాణా
[మార్చు]గుంటూరు నుంచి నంద్యాల వెళ్లే రాష్ట్ర రహదారి దొనకొండ సమీపంలో ఉంది. నల్గొండ జిల్లానకిరేకల్ నుంచి సాగర్, మాచర్ల, యర్రగొండపాలెం, మార్కాపురం, కొనకనమిట్ల, కనిగిరి, నెల్లూరు జిల్లా వెంకటగిరి మీదుగా రహదారిని మంజూరు చేశారు.
రైల్వేలు
[మార్చు]గుంటూరు - గుంతకల్ రైల్వే మార్గం, కర్నూలు - హైదరాబాదు రైలు మార్గాల కూడలి దొనకొండ. 1992కు పూర్వం మీటర్ గేజ్‌గా ఉన్న సమయంలో గుంటూరు నుంచి గుంతకల్ వెళ్లే రైళ్లు, గూడ్స్ బండ్లు దొనకొండలో నిలిపేవారు. డ్రైవర్లు విధులు మారే వారు. 2 వేల మంది రైల్వే ఉద్యోగులు ఇక్కడ పనిచేసే వారు. వీరి కోసం బ్రిటీష్ ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ను నెలకొల్పింది. బ్రాడ్ గేజ్ కావడంతో ఇక్కడ పని చేస్తున్న సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేశారు. సుమారు 200 మంది ఉద్యోగులు నివసించే క్వార్టర్లను నిర్మించారు. రైల్వే క్వార్టర్లు శిథిలావస్థకు చేరడంతో అధికారులు పడేశారు. మొత్తం 140 ఎకరాల స్థలం రైల్వే శాఖ ఆధీనంలో ఉంది.[3]
విమానాశ్రయం
[మార్చు]1934లోనే మద్రాస్ ప్రావింస్‌ని పాలిస్తున్న బ్రిటీష్ పాలకులు దొనకొండకు సమీపంలో 136.5 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో విమానాలను ఇక్కడ నిలిపి ఇంధనాన్ని నింపుకుని సమావేశాలు నిర్వహించుకునే వారు. ఈ విమానాశ్రయంలో 1965-70 మధ్య కాలంలో విమానాల రాకపోకలు నడిచేవి. విమానాశ్రయ స్థలం ఆక్రమణలకు గురికాకుండా 2013 అక్టోబరులో సుమారు 43 లక్షల రూపాయల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఫెన్సింగ్ ఏర్పాటు చేయించింది. ఈ స్థలం ప్రస్తుతం ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో ఉంది.[3]
విద్యాసౌకర్యాలు
[మార్చు]కస్తూర్బా గాంధీ ప్రభుత్వ విద్యాలయం.
మౌలిక సదుపాయాలు
[మార్చు]విద్యుత్ వసతి
[మార్చు]శ్రీశైలం ప్రాజెక్టు, దొనకొండకు వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ విద్యుత్ ప్రాజెక్టు నుంచి దొనకొండ ప్రాంతానికి విద్యుత్ లభిస్తుంది. విజయవాడ ఎన్టీపీసీ విద్యుత్ లైన్లు ఒంగోలు నుంచి పొదిలి వరకు ఉన్నాయి. ఇక్కడ నుంచి కూడా విద్యుత్ ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉంది. శ్రీశైలం కుడిగట్టు కాలువ నుంచి ప్రతి రోజూ కోటి 41 లక్షల 14 వేల మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. జిల్లాకు 41.60 లక్షల మెగా యూనిట్ల విద్యుత్‌ను కేటాయించారు. జిల్లా మొత్తం విద్యుత్ వినియోగం 71.60 లక్షల మెగా యూనిట్లు. శ్రీశైలం నుంచి వచ్చే విద్యుత్ సరఫరాతో పాటు మిగిలిన విద్యుత్‌ను విజయవాడ ఎన్‌టీ పీఎస్ నుంచి అందిస్తున్నారు. మార్కాపురం డివిజన్‌లో రోజుకు 20 లక్షల 60 వేల మెగా యూనిట్ల విద్యుత్‌ను, పొదిలిలో 15.60 లక్షల మెగా యూనిట్ల విద్యుత్‌ను శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా ఉపయోగించుకుంటున్నారు.
పారిశ్రామికాభివృద్ది
[మార్చు]దొనకొండ ప్రాంతంలో సుమారు 34 వేల ఎకరాల అసైన్డ్ భూమి, 1.35 లక్షల ఎకరాల అటవీ భూమి కంభం-మార్కాపురం-పొదిలి మధ్య అందుబాటులో ఉంది. మార్కాపురం ప్రాంతంలో నల్లమలలోని 1.11 లక్షల ఎకరాల అటవీ భూములున్నాయి. గట్టి నేల కావడంతో పాటు భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మార్కాపురం మండలం రాయవరం నుంచి సుమారు 15 కిలోమీటర్ల పొడవున పలకల గనులు విస్తరించి ఉన్నాయి.సుమారు 50 గ్రామాల ప్రజలు పలకల గనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. 60 కిలోమీటర్ల దూరంలో చీమకుర్తి గ్రానైట్ గనులున్నాయి.
సాగు/త్రాగునీటి సౌకర్యం
[మార్చు]గుండ్లకమ్మతో పాటు, నాగార్జున సాగర్ నీరు త్రిపురాంతకం, కురిచేడు, దర్శి, దొనకొండ, చీమకుర్తి తదితర ప్రాంతాల్లోని పొలాలకు అందుతోంది. ఇక వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 15 లక్షల మందికి తాగునీరు, 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం గుండ్లకమ్మ నీరు వృథాగా సముద్రంలో కలుస్తోంది. ఈ నీటిని పరిశ్రమలకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.
ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
చిత్రమాలిక
[మార్చు]-
ఏబీఎం బాప్టిస్ట్ చర్చి వెనుక ద్వారం
-
ఏబీఎం బాప్టిస్ట్ చర్చి శిలాఫలకం
-
దొనకొండ విమానాశ్రయం- 2
-
దొనకొండ విమానాశ్రయం- 3
మూలాలు
[మార్చు]- ↑ "గ్రామములు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా". District Office, Prakasam District. 2019. Archived from the original on 2019-04-18.
- ↑ ఈనాడు పకాశం/అద్దంకి; 2015,ఏప్రిల్-2; 2వపేజీ.
- ↑ 3.0 3.1 "దొనకొండ..ఒక ఆశ "". సాక్షి. 2014-02-25. Archived from the original on 2019-08-30.
వెలుపలి లింకులు
[మార్చు]- Pages with non-numeric formatnum arguments
- క్లుప్త వివరణ ఉన్న articles
- Pages using infobox settlement with bad settlement type
- Infobox mapframe without OSM relation ID on Wikidata
- Commons category link is on Wikidata
- ప్రకాశం జిల్లా మండల కేంద్రాలు
- రెవెన్యూ గ్రామాలు కాని మండల కేంద్రాలు
- Pages using the Kartographer extension