కొండపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొండపి
—  రెవిన్యూ గ్రామం  —
కొండపి is located in Andhra Pradesh
కొండపి
కొండపి
అక్షాంశ రేఖాంశాలు: 15°26′59″N 79°45′33″E / 15.449709°N 79.75914°E / 15.449709; 79.75914
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం కొండపి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 4,928
 - పురుషుల సంఖ్య 2,197
 - స్త్రీల సంఖ్య 2,196
 - గృహాల సంఖ్య 1,035
పిన్ కోడ్ 523270
ఎస్.టి.డి కోడ్ 08592

కొండపి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలకేంద్రము. పిన్ కోడ్: 523270., ఎస్.టి.డి.కోడ్ = 08598.

సమీప గ్రామాలు[మార్చు]

ఇలవెర 2.7 కి.మీ,గోగినేనివారిపాలెం 3.1 కి.మీ,చినకండ్లగుంట 3.5 కి.మీ,పెరిదేపి 4.3 కి.మీ,అనకర్లపూడి 4.9 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

పొన్నలూరు 15 కి.మీ,సంతనూతలపాడు 17.1 కి.మీ,జరుగుమిల్లి 17.1 కి.మీ.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

కొండెపి, కట్టావారిపాలెం గ్రామాల మధ్య, శ్రీ నెప్పల కొండయ్య ఏర్పాటుచేసిన ఈ ఆలయంలో, స్వామివారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని, 2014,డిసెంబరు-13వతేదీ శనివారం నాడు, వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. కొండెపి, కట్టావారిపాలెం గ్రామాల ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని, ఈ కార్యక్రమాన్ని తిలకించారు. [2]

శ్రీ వెంకయ్యస్వామి ఆలయం[మార్చు]

నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2015,జూన్-23వ తేదీనాడు, స్వామివారికి ఒక భక్తుడు వెండి కిరీటాన్ని అందజేసినారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం, రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేసినారు. [4]

గ్రామ విశేషాలు[మార్చు]

కొండపి గ్రామము[1]. లోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల ఆవరణలో, 2015,జూన్-3వ తేదీ బుధవారం సాయంత్రం ఆరు గంటలకు, తిరుమల తిరుపతి దేవస్థానo వారి ఆధ్వర్యంలో, శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీనివాసుని కళ్యాణం, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణలతో, కమనీయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుమల నుండి ఉత్సవమూర్తులను తెప్పించి, దేవవస్థాన పండితులచేత ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఈ కళ్యాణాన్ని నిర్వహించారు. అన్నమయ్య భజనబృందంవారి పాటలతో క్రీడాప్రాంగణమంతా గోవిందనామస్మరణతో మారుమ్రోగినది. అనంతరం స్వామివారికి అఖండ దీపారాధన నిర్వహించి, స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు వితరణచేసారు. ఈ కళ్యాణ వేడుకలను తిలకించేందుకు, మండలంలోని వివిధ గ్రామాలనుండి భక్తులు అసంఖ్యాకంగా తరలివచ్చారు. [3]

గ్రామ గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,393.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,197, మహిళల సంఖ్య 2,196, గ్రామంలో నివాస గృహాలు 1,035 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 2,196 హెక్టారులు.

మండల గణాంకాలు[మార్చు]

గ్రామాలు 17

జనాభా (2001) - మొత్తం 36,412 - పురుషుల సంఖ్య 18,283 -స్త్రీల సంఖ్య 18,129
అక్షరాస్యత (2001) - మొత్తం 55.20% - పురుషుల సంఖ్య 65.35% -స్త్రీల సంఖ్య 45.08%

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,డిసెంబరు-14; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం; 2015,జూన్-4; 14వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,జూన్-24; 1వపేజీ.

మూలాలు[మార్చు]"https://te.wikipedia.org/w/index.php?title=కొండపి&oldid=2694728" నుండి వెలికితీశారు