సింగరాయకొండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్రామం
నిర్దేశాంకాలు: 15°15′N 80°02′E / 15.25°N 80.03°E / 15.25; 80.03అక్షాంశ రేఖాంశాలు: 15°15′N 80°02′E / 15.25°N 80.03°E / 15.25; 80.03
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంసింగరాయకొండ మండలం
విస్తీర్ణం
 • మొత్తం15.48 కి.మీ2 (5.98 చ. మై)
జనాభా వివరాలు
(2011)[2]
 • మొత్తం24,324
 • సాంద్రత1,600/కి.మీ2 (4,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి976
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( 85983 Edit this on Wikidata )
పిన్(PIN)523101 Edit this on Wikidata


సింగరాయకొండ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, ప్రకాశం జిల్లా లోని గ్రామం. ఇది సింగరాయకొండ (పట్టణ), సింగరాయకొండ (గ్రామీణ) గా జనగణనలో విభజించబడింది..[3]

గ్రామ భౌగోళికం[మార్చు]

సింగరాయకొండ, జాతీయ రహదారి-16, మీద ఉంది. అలాగే విజయవాడ - చెన్నై రైలు మార్గం కూడా ఈ పట్టణం గుండా వెళుతూ చక్కని రవాణా సదుపాయం కల్పిస్తున్నది.

సమీప గ్రామాలు[మార్చు]

శానంపూడి 6.2 కి.మీ, సోమరాజపల్లి 1.2 కి.మీ, కనుమల్ల 4.3 కి.మీ, మన్నెటికోట 8.6 కి.మీ, ఊళ్ళపాలెం 6 కి.మీ, బింగినిపల్లి 7.6 కి.మీ, పాకల 6 కి.మీ,

సమీప పట్టణాలు[మార్చు]

సింగరాయకొండ 3.4 కి.మీ, ఉలవపాడు 6.6 కి.మీ, కందుకూరు 11.3 కి.మీ, జరుగుమిల్లి 11.7 కి.మీ.


జనాభా గణాంకాలు[మార్చు]

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,937.[4] ఇందులో పురుషుల సంఖ్య 1,938, మహిళల సంఖ్య 1,999, గ్రామంలో నివాస గృహాలు 1,005 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,548 హెక్టారులు.


మౌలిక సదుపాయాలు[మార్చు]

ప్రాధమిక ఆరోగ్య కేంద్రం[మార్చు]

ఉలవపాడు మండలం మన్నేటికోటకు చెందిన గడ్డం శేషయ్య, తన తల్లి కామేశ్వరమ్మ పేరిట, ఈ కేంద్రాన్ని, 1986 లో నిర్మించాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయి నుండి 30 పడకలు కలిగిన ఆసుపత్రిని 2009 లో ప్రారంభించారు. ప్రస్తుతం సి.హెహ్.సి.గా సేవలందించుచున్నది. పలువురు ప్రజా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛందసంస్థల సహకారంతో, పలు సౌకర్యాలు ఏర్పడినవి.

2016-17 సంవత్సరానికి గాను, రోగులకు ఉత్తమ సేవలందించినందుకుగాను, సింగరాయకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రాష్ట్రస్థాయిలోనే ద్వితీయ ఉత్తమ కేంద్రంగా నిలిచింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, 2017, ఏప్రిల్-7న రాష్ట్ర రాజధాని వెలగపూడిలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ చేతులమీదుగా ఈ కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి.పద్మజ, ఈ పురస్కారాన్ని స్వీకరించింది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ అయ్యప్ప స్వామి మందిరము[మార్చు]

సింగరాయకొండ మండలంలో గల అయ్యప్ప నగరం గ్రామంలో వుంది.

శ్రీ వేణుగోపాలస్వామివారి దేవాలయం[మార్చు]

సింగరాయకొండలోని కందుకూరు రహదారి కూడలిలో నెలకొన్నది.

శ్రీ చెట్టు మహాలక్ష్మి అమ్మవారి ఆలయం[మార్చు]

సింగరాయకొండ రైల్వే మార్గంలోని ఈ ఆలయం వుంది.

గ్రామ ప్రముఖులు[మార్చు]

జంధ్యాల మంజుల, డి.ఆర్.డి.యే.సంస్థలో, తొలి మహిళా డైరెక్టర్ జనరల్. [2]

మూలాలు[మార్చు]

  1. ఆంధ్ర ప్రదేశ్ జిల్లాల జనగణన దత్తాంశ సమితి - పట్టణాలు (2011), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q58768667, archived from the original on 15 March 2018
  2. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  3. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  4. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18