పాకాల (సింగరాయకొండ)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పాకాల
రెవిన్యూ గ్రామం
పాకాల is located in Andhra Pradesh
పాకాల
పాకాల
నిర్దేశాంకాలు: 15°16′10″N 80°04′19″E / 15.269364°N 80.071964°E / 15.269364; 80.071964Coordinates: 15°16′10″N 80°04′19″E / 15.269364°N 80.071964°E / 15.269364; 80.071964 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంసింగరాయకొండ మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,252 హె. (5,565 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం14,467
 • సాంద్రత640/కి.మీ2 (1,700/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523101 Edit this at Wikidata

పాకల, ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలానికి చెందిన గ్రామం.[1]]]. పిన్ కోడ్: 523 101., యస్.ట్.డీ కోడ్=08598.

గ్రామ భౌగోళికం[మార్చు]

సింగరాయకొండ నుండి 8 కి.మీ దూరంలో ఈ ఊరు సముద్రపు దరిన ఉంది.

సమీప గ్రామాలు[మార్చు]

సోమరాజుపల్లి 2.8 కి.మీ, ఊళ్ళపాలెం 3.1 కి.మీ, ములగుంటపాడు 4.2 కి.మీ, బింగినిపల్లి 4.9 కి.మీ,కలికివాయక 6.1 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

సింగరాయ కొండ 4.9 కి.మీ, టంగుటూరు 8.8 కి.మీ, జరుగుమిల్లి 10.7 కి.మీ, ఉలవపాడు 12.6 కి.మీ.

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

ఉదయం 5గంటల నుండి ప్రతి 15 నిమిషాలకు పాకలకు ప్రైవేటు బస్సులు ఉన్నాయి., ప్రతినిత్యం ఆటోలు ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

పాకల ఊరిలో 7 ప్రాథమిక, 1 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ పశు వైద్యశాల, ప్రభుత్వ మంచినీటి పథకం, ప్రభుత్వ హాస్టల్ (10వ తరగతి వరకు), సదుపాయాలు ఉన్నాయి. చదువుకునే వారిని ప్రోత్సహించటానికి ప్రతీ యేడాది ఆగస్టు 15న పదవ తరగతి వారికి దాతల ద్వారా వచ్చిన నగదుని బహుమతిగా అందజేస్తారు.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

ఈ ఊరికి దాదాపుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ ఊరు, 3 పెద్ద చెరువులతో, రెండు కోనేరులతో, పచ్చని పొలాలతో కనిపించే ఈ ఊరు చాలా అందంగా ఉంటుంది.

గ్రామ పంచాయతీ[మార్చు]

ఈ ఊరు మండలంలో పెద్ద పంచాయితి.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

ఊరిలో అన్ని మతాల, కులాల, జాతుల వారు ఒకే కుటుంబంలా కలిసి ఉంటారు. ఒక రామాలయం, రెండు శివాలయాలు, ఒక వేణుగోపాల స్వామి ఆలయం, ఒక మసీదు, ఒక జాలమ్మ తల్లి ఆలయం, సుమారు పదివరకు చర్చిలు ఉన్నాయి.

  1. శివాలయం
  2. కృష్ణాలయం
  3. రామాలయం (3 ఉన్నాయి.
  4. జాలమ్మతల్లి గుడి.
  5. తిరుపతమ్మ గుడి.

ఊరిలో ప్రతీ ఏడాది జరిగే వినాయక చవితి సంబరాలు, ప్రతి ఐదు వత్సరాలకు జరిగే జాలమ్మ తిరునాళ్ళు (ఈ సంవత్సరం ఏప్రిల్ 23 నుండి 11 రోజుల పాటు ఉత్సవాలు జరగ బోతున్నాయి). చూసి తీరాల్సిందే. ఇంకా క్రిస్టమస్ వేడుకలు, నూతన సంవత్సర సంభరాలు, శ్రీరామనవమి, కృష్ణాష్టమి, ఇలా ఎన్నో వేడుకలు కనులకు విందు చేస్తాయి. పాకల గ్రామం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందింది.ఇక్కడ గల బీచ్ ను చూడడానికి ప్రతి ఆదివారము, పర్వదినవేళల్లో వందల సంఖ్యలో యాత్రికులు వస్తారు. బీచ్ దగ్గర అన్ని వసతులను పల్లెపాలెం గ్రామ కాపు కన్నా స్వాములు, గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహకారంతో ఏర్పాటు చేశారు.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

మా ఊరిలో ప్రధాన పంట వరి. ఇంకా పెసర, మినుములు, ప్రత్తి, రాగులు, అన్ని రకాల కూరగాయలు సాగులో ఉన్నాయి. ఊరిలో పండే మరో పంట ఉప్పు. ఇంకా చేపల వేట మరో ప్రధాన ఆదాయ వనరు. సరివి, జామాయిల్, సుబాబుల్, జీడి మామిడి తోటలు వంటివి ఉన్నాయి. వరి ఖరీఫ్ లో, మిగిలిన పంటలు రబీలో సాగుచేస్తారు. ఉప్పు మాత్రం ఎండాకాలంలో మొదలై 6నెలలు సాగుతుంది. ఇంకా పశువుల పెంపకం కూడా ప్రధాన ఆర్థిక వనరు. అందుకే ఒక ప్రభుత్వ పాల కేంద్రం, 7వరకు ప్రైవేటు పాలకేంద్రాలు ఉన్నాయి.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామ ప్రముఖులు[మార్చు]

కీ.శే. దాచూరి రామిరెడ్డి. ఎం.ఎల్.సి.

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామం విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో ప్రసిద్ధి చెందినది. దాదాపుగా 15000కి పైగా జనాభా, 3000కి పైగా ఇళ్ళు, 8000కి పైగా ఓటర్లు ఉన్న ఇప్పటి వరకు 50కి పైగా వైద్యులను, 30కి పైగా ఇంజనీరులను దేశానికి అందిచిన ఘనత ఈ ఊరిది. వీరిలో కొంత మంది వైద్యులు రూపాయి,5 రూపాయిలకు, 10 రూపాయిలకు కూడా వైద్యం అందించారు. వీరిలో కొంతమంది దేశ విదేశాలలో తమ ఇంజనీరింగ్ సేవలను అందిస్తున్నారు. ఇంకా దాదాపు 20మంది పోలీసులుగా రాష్ట్ర రక్షణలో తమవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఇంకా దాదాపు 20మంది టీచర్లు వివిధ ప్రాంతాలలో భావి భారత పౌరులను తీర్చిదిద్దుతున్నారు. మిగిలిన యువత వివిధ రకాల వృత్తి విద్యలలో ప్రావీణ్యత సాధించారు.

ఊరి ప్రధాన ఆట వాలీబాల్. ఉన్నత పాఠశాల స్థాయిలో జిల్లాలో వరుసగా ప్రతి సంవత్సరము విజేతలు ఈ వూరి వాళ్ళే. అనేకమంది యూనివర్సిటీ ఆటగాళ్ళు ఉన్నారు. ఇంకా క్రికెట్ కూడా ఆడుతారు.

గణాంకాలు[మార్చు]

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,681.[2] ఇందులో పురుషుల సంఖ్య 6,487, మహిళల సంఖ్య 6,194, గ్రామంలో నివాస గృహాలు 3,194 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,252 హెక్టారులు.

మూలాలు[మార్చు]