సంతనూతలపాడు
ఈ వ్యాసాన్ని తాజాకరించాలి. |
సంతనూతలపాడు | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°32′37.2480″N 79°56′27.4920″E / 15.543680000°N 79.940970000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండలం | సంతనూతలపాడు |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08592 ) |
పిన్‌కోడ్ | 523225 |
సంతనూతలపాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామ పంచాయితీ, మండల కేంద్రం. [1]
సమీప గ్రామాలు
[మార్చు]బొడ్డువారిపాలెం, చండ్రపాలెం, చిలకపాడు, ఎండ్లూరు, యనికపాడు, గుమ్మలంపాడు.
సమీప పట్టణాలు
[మార్చు]చీమకుర్తి 6.3 కి.మీ, కొండేపి 14.3 కి.మీ, మద్దిపాడు 15.8 కి.మీ, ఒంగోలు 12 కి.మీ.
మౌలిక సదుపాయాలు
[మార్చు]ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం. (PACS)
బ్యాంకులు
[మార్చు]1.కెనరా బ్యాంక్
2.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3.ఆంధ్రా ప్రగతి గ్రామీణ బ్యాంక్
4.గతంలో సిండికేట్ కోఆపరేటివ్ బ్యాంక్
5.దేనా బ్యాంక్
సాగు/త్రాగు నీటి సౌకర్యం
[మార్చు]- పెద్ద చెరువు.
- చిన్న చెరువు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయం
[మార్చు]ఈ దేవాలయం అత్యంత పురాతనమైనది. ఈ దేవాలయంలో నిత్యం పూజలు జరుగుచున్నా అవి అంతంత మాత్రమే. చెరువు పొంగినప్పుడల్లా, దేవాలయంలో మోకాలు లోతు నీరు నిలుస్తుంది. ఈ దేవాలయాన్ని 1969లో దేవాదాయ ధర్మాదాయశాఖకు అప్పగించారు. ఈ దేవస్థానం క్రింద ఉన్న 110 ఎకరాల భూమి కౌలుకు, 2002 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠా మహోత్సవాలు, నిర్వహించెదరు. ఈ ఉత్సవాలలో భాగంగా, శనివారం నాడు, ప్రత్యేక హోమాలు నిర్వహించారు. ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశస్థాపన, హోమాలు నిర్వహించారు. ఈ రెండవరోజు ఆదివారం నాడు ప్రత్యేకంగా గ్రామోత్సవం నిర్వహించారు.
శ్రీ చెన్నకేశ్వస్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయానికి 45.65 ఎకరాల మాన్యం భూమి ఉంది.
శ్రీ కొండపాటి పోలేరమ్మ అమ్మవారి ఆలయం
[మార్చు]సంతనూతలపాడు లోని కొత్త ఎస్.సి.కాలనీలో, తొమ్మలకుంట వద్ద వేంచేసియున్న ఈ అమ్మవారి ఆలయ నాల్గవ వార్షికోత్సవం, ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేక అలంకరణలో నిలిపినారు. పోతురాజుకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసారు. ఈ సందర్భంగా భక్తులకు, గ్రామస్తులకు అన్నసంతర్పన నిర్వహించారు.
శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి ఆలయం
[మార్చు]స్థానిక రజక పాలెం లోని అంకమ్మ తల్లి ఆలయంలో పొంగళ్ళ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆలయ ప్రథమ వార్షిక ఉత్సవ వేడుకలను మాఘ శుద్ధ నవమి, నాడు ప్రారంభించారు.
శ్రీ సీతా రామాలయం
[మార్చు]సంతనూతలపాడు లోని పెద్ద బజారులో ఉన్న ఈ ఆలయంలోని సీతారాముల నూతన ఉత్సవ పంచ లోహ విగ్రహాలకు, మహా సంప్రోక్షణ కార్యక్రమం, శ్రీరామనవమి నాడు, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించెదరు.
శ్రీ కోదండ రామాలయం
[మార్చు]1913 లో నిర్మించిన ఈ ఆలయానికి, 9 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇంకా పూజారులకు 10 ఎకరాల మాన్యం భూమి ఉంది. 20 గదుల స్థలం ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో సింగిల్ ట్రస్టీ దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో ఉన్నది.
శ్రీ నాగార్పమ్మ తల్లి ఆలయం
[మార్చు]ఈ ఆలయంలో ఆశ్వయుజ మాసం, అమ్మవారి కొలుపులు వైభవంగా నిర్వహించారు.
శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం
[మార్చు]ఈ ఆలయం స్థానిక జెండా చెట్టు సమీపoలో ఉంది.
శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం
[మార్చు]ఈ ఆలయ వార్షికోత్సవ వేడుకలను, వైభవంగా నిర్వహించారు.
మూలాలు
[మార్చు]- ↑ "గ్రామములు, పంచాయితీలు - ప్రకాశం జిల్లా". District Office, Prakasam District. 2019. Archived from the original on 2019-04-18.