మైనంపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


మైనంపాడు
రెవిన్యూ గ్రామం
మైనంపాడు is located in Andhra Pradesh
మైనంపాడు
మైనంపాడు
నిర్దేశాంకాలు: 15°34′26″N 79°57′14″E / 15.574°N 79.954°E / 15.574; 79.954Coordinates: 15°34′26″N 79°57′14″E / 15.574°N 79.954°E / 15.574; 79.954 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంసంతనూతలపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం2,270 హె. (5,610 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)525225 Edit this at Wikidata

మైనంపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్ నం. 523 225. ఎస్.టి.డి.కోడ్ = 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

ఎండ్లూరు 1.8 కి.మీ, గురువారెడ్డిపాలెం 2.5 కి.మీ, రుద్రవరం 4 కి.మీ, పేర్నమీట్ట 5.5 కి.మీ, నేలటూరు 5.7 కి.మీ,

సమీప పట్టణాలు[మార్చు]

సంతనూతలపాడు 6.7 కి.మీ, చీమకుర్తి 9.1 కి.మీ, మద్దిపాడు 9.1 కి.మీ, ఒంగోలు 13.1 కి.మీ.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

 1. ఈ గ్రామంలో 1939లో బేసిక్ ట్రైనింగ్ పాఠశాల ఏర్పడింది. 1971లో ప్రాథమిక పాఠశాల, ఆ తరువాత కొద్ది సంవత్సరాలకు డైట్ పాఠశాల ఏర్పడినవి. [9]
 2. ఈ గ్రామ జి.హెచ్.ఎస్. పాఠశాల విద్యార్థిని కె.ధనలక్ష్మి, కడపలో జరిగిన రాష్ట్ర స్థాయి హాకీ క్రీడలో ప్రతిభ కనబరిచి, పంజాబులోని బస్సీపట్నంలో జరిగిన అండర్-15 బాలికల పోటీలలో పాల్గొన్నది. ఈ పాఠశాల నుండి జాతీయ పోటీలలో పాల్గొన్న మొదటి బాలిక ఈమె. [2]
 3. ఈ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో చదువుచున్న కుంచాల రమేశ్ అను విద్యార్థి, జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైనాడు. ఇతడు 2014, అక్టోబరు-22 నుండు 24 వరకు జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో మంచి ప్రతిభ కనబరచి, రాష్టజట్టుకు ఎంపికైనాడు. ఇతడు నవంబరు/2014 లో జరుగు జాతీయస్థాయి పోటీలలో, అండర్-14 విభాగంలో, రాష్ట్ర జట్టులో పాల్గొంటాడు. [10]
 4. ఈ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని క్రీడామైదానంలో, 2014, నవంబరు-7 నుండి, రాష్ట్రస్థాయి సబ్-జూనియర్ ఖో-ఖో పోటీలు నిర్వహించెదరు. [11]

గ్రామంలోని మౌలిక వసతులు[మార్చు]

బ్యాంకులు[మార్చు]

సిండికేటు బ్యాంకు.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

 1. శివాలయం:- గ్రామంలోని ఈ శివాలయం అత్యంత పురాతనమైనది. సుమారు 400 సంవత్సరాలనాడు, మందపాటి రాజులకాలంలో, తమకు సంతానం లేదని, ఎండ్లూరు, సంతనూతలపాడు, రుద్రవరం, మైనంపాడు, మంగమూరు గ్రామాలలో శివాలయాలను పునహ్ ప్రతిష్ఠించారు. అదే క్రమంలో, ఈ గ్రామంలో ఏర్పాటు చేసిన శ్రీ మల్లేశ్వర స్వామి దేవాలయంగూడా ఆ రాజులు నిర్మించారు. ఈ దేవాలయానికి మొత్తం 17.35 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి అధికారులు 2001 నుండి బహిరంగ వేలం నిర్వహించుచున్నారు. గత ఏడాది వేలంలో రు.85,000-00 కౌలు వచ్చింది. ఇక పురాతన కాలంలోనే భజంత్రీల మాన్యాన్ని, పూర్వీకులు స్వాధీనం చేసుకున్నారు. నేడు దేవాలయానికి భజంత్రీలు ఉన్నారనే విషయమే గ్రామస్తులకు తెలియదు. దేవాలయం శిథిలావస్థలో ఉంది. పూజలు గూడా దాదాపు ముగిసినట్లే కనిపించుచున్నది. [3]
 2. ఈ గ్రామంలో క్రీ.శ.1174 లో నిర్మించిన శ్రీ మల్లేశ్వరస్వామివారి అలయానికీ, శ్రీ వీరేశ్వరస్వామివారి ఆలయానికీ కలిపి, 1.35 ఎకరాల మాన్యం భూమి ఉంది. ఇదిగాక మోతకూలీ క్రింద ఒక ఎకరం భూమి ఉంది. [7]
 3. ఈ ఈ గ్రామంలో క్రీ.శ.1472 లో నిర్మించిన శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయానికీ, శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయానికీ కలిపి, 20.75 ఎకరాల మాన్యం భూమి ఉంది. [7]
 4. శ్రీ నాగార్పమ్మ ఆలయం:- స్థానిక పడమటి బజారులోని ఈ ఆలయంలో, అమ్మవారి కొలువులు, 2014, ఆగస్టు-1,2,3 తేదీలలో, ప్రత్యేకంగా "కిలారి" కుటుంబీకుల ఆధ్వర్యంలో, ఘనంగా నిర్వహించారు. మూడురోజులు నిర్వహించిన ఈ కొలువులలో, తొలిరోజు 1వ తేదీ శుక్రవారం నాడు అమ్మవారికి ప్రత్యేకంగా సముద్రస్నానాలు నిర్వహించారు. రెండవ రోజు, రెండ తేదీ శనివారం నాడు, అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. చివరి రోజు, మూడవ రోజైన 3వ తేదీ ఆదివారం నాడు, భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్సించుకుని పూజలు చేసారు. [8]
 • శీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగొపాలస్వామివారి ఆలయం, శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం, శ్రీ గంగా భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామివారి ఆలయం ఉన్నాయి. ఈ పురాతన ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మొదట ఈ నాలుగు ఆలయాలకూ, బాలాలయాలను ప్రతిష్ఠాపన చేసారు. [12]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం[మార్చు]

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి వార్షిక కొలుపులు, 2017,జూన్-25వతేదీ ఆదివారంనాడు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు చేపట్టినారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. 26వతేదీ సోమవారంనాడు మహిళలు అమ్మవారికి పొంగళ్ళు సమర్పించెదరు. [13]

ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

 1. శ్రీ పెద్దిరెడ్డి కోటిరెడ్డి, మైనంపాడు గ్రామ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేయుచునే సమాజసేవ చేస్తున్నారు. తన భార్య శ్రీమతి ఆదిలక్ష్మి క్యాన్సరుతో మృతిచెందగా, ఆమెపేరుమీద, "పెద్దిరెడ్డి ఆదిలక్ష్మిఫౌండేషన్" స్థాపించి, పలువురు పేద విద్యార్థులకు అండగా నిలుచుచున్నారు. ప్రతి ఏడాది, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహకారంతో దాదాపు 2.5 లక్షల రూపాయలతో పేద విద్యార్థులకోసం, మహిళల భోజనం కోసం, వైద్య శిబిరాలకోసం వెచ్చించుచున్నారు. ఈ సంస్థద్వారా ఇప్పటికి 60,70 మంది విద్యార్థులకు, ఉన్నత చదువులోనూ, 30 మంది ఉద్యోగాలలోనూ స్థిరపడినారు. [4]
 2. మైనంపాడు గ్రామానికి చెందిన శ్రీమతి పెరుగు వెంకమ్మ (104), సర్పంచి దగ్గర నుండి శాసనసభ ఎన్నికల వరకూ దాదాపు దాదాపు 80 సంవత్సరాలుగా ఓటు వేస్తూనే ఉన్నారు. ఆ గ్రామం అప్పుడు మద్దిపాడు సమితి క్రింద ఉండేది. [5]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 5,283 - పురుషుల సంఖ్య 2,654 - స్త్రీల సంఖ్య 2,629 - గృహాల సంఖ్య 1,439

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 4,633.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,353, మహిళల సంఖ్య 2,280, గ్రామంలో నివాస గృహాలు 1,115 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,270 హెక్టారులు.

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,అక్టోబరు-4; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2013,నవంబరు-22; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఫిబ్రవరి-23; 1వపేజీ. [5] ఈనాడు ప్రకాశం; 2013,జూలై-18;8వపేజీ. [6] ఈనాడు ప్రకాశం; 2013,ఆగస్టు-2; 16వపేజీ. [7] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,మే-30; 2వపేజీ. [8] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,ఆగస్టు-4; 1వపేజీ. [9] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,సెప్టెంబరు-27; 2వపేజీ. [10] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,అక్టోబరు-29; 2వపేజీ. [11] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014,నవంబరు-7; 2వపేజీ. [12] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016,ఏప్రిల్-4; 2వపేజీ. [13] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2017,జూన్-26; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మైనంపాడు&oldid=3200147" నుండి వెలికితీశారు