మాదాల నారాయణస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాదాల నారాయణస్వామి (ఫిబ్రవరి 13, 1914 - డిసెంబర్ 9, 2013) సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు. ఎంఎన్‌ఎస్‌గా ప్రసిద్ధిగాంచారు.

జననం[మార్చు]

ఈయన ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో 1914, ఫిబ్రవరి 13 న జన్మించారు. తల్లిదండ్రులు: రాఘవులు, రాఘవమ్మ. 99ఏళ్ల వయస్సు గల ఎంఎన్‌ఎస్ ఉత్తమ కమ్యూనిస్టుగా, నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలిచారు. ‘భారత- చైనా మిత్ర మండలి’ వ్యవస్థాపక అధ్యక్షులుగానూ పనిచేశారు. బెనారస్ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ డిగ్రీ తీసుకున్నారు. 1936లో భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యారు. 1946-1951 తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో రహస్య జీవితం గడిపారు.ఆ సమయంలోనే తన సోదరుడు మాదాల కోటయ్య ఎన్‌కౌంటర్‌లో కోల్పోయారు. కమ్యూనిస్టు పార్టీపై నిషేధం తొలగించిన తర్వాత 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా ఒంగోలు శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1962లో ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. శాసనసభ్యుడిగానూ, పార్లమెంటు సభ్యుడిగానూ పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పనిచేశారు. రైతు కూలీల సమస్యలనూ, కార్మిక సమస్యలనూ చట్ట సభల్లో ప్రస్తావించి, వాటి సాధన కోసం పోరాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం సందర్భంగా కొల్లా వెంకయ్యతో కలిసి రాజీనామా చేశారు.

మరణం[మార్చు]

2013, డిసెంబర్ 9 న గుంటూరులో మరణించారు.[1], [2] భార్య సులోచన కుమారుడు విద్యాసాగర్ కుమార్తె వీణ ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "కమ్యూనిస్టు ఉద్యమ దీపస్తంభం" నమస్తే తెలంగాణా, వెబ్ ఎడిషన్,10-12-2013 పరిశీలన తేది, 10-12-2013" http://namasthetelangaana.com/Editpage/article.aspx?Category=1&subCategory=7&ContentId=309963
  2. అలుపెరగనియోధుడు మాదాల, సాక్షి ఈ పేపర్, గుంటూరు ఎడిషన్, 10-12-2013, పరిశీలన తేది: 10-12-2013 http://epaper.sakshi.com/apnews/Guntur_City/10122013/Details.aspx?id=2085974&boxid=25953830