మాదాల రంగారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాదాల రంగారావు

జన్మ నామంమాదాల రంగారావు
జననం మే 25, 1948
మరణం 2018 మే 27(2018-05-27) (వయసు 70)
హైదరాబాదు
ఇతర పేర్లు ఎర్ర సూర్యుడు
క్రియాశీలక సంవత్సరాలు 1974 - ?
పిల్లలు మాదాల రవి
ప్రముఖ పాత్రలు మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవ శంఖం

మాదాల రంగారావు (మే 25, 1948 - మే 27, 2018) తెలుగు సినిమా నిర్మాత, దర్శకుడు, నటుడు.[1] వామపక్ష భావజాలం కలిగిన ఈయన అవినీతి, అణిచివేత లాంటి సామాజిక సమస్యలను ప్రతిబింబిస్తూ అనేక సినిమాలు రూపొందించాడు.[2] నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించాడు. మరో కురుక్షేత్రం, యువతరం కదిలింది, ఎర్రమల్లెలు, విప్లవశంఖం, నవోదయం, మహాప్రస్థానం, తొలిపొద్దు, ప్రజాశక్తి, బలిపీఠంపై భారతనారి, ఎర్రపావురాలు, స్వరాజ్యం, జనం మనం వంటి సినిమాల్లో నటించారు. నాంపల్లి స్టేషన్ కాడా రాజా లింగో, కాలేజీ కుర్రవాడ కులాసాగా తిరిగేటోడా, అమరవీరులెందరో అనే పాటలు అత్యంత ప్రజాదరణను పొందాయి.[3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

అతను ప్రకాశం జిల్లా మైనం పాడు మాదాల స్వగ్రామంలో 1948 మే 25న ఆయన జన్మించాడు. ప్రజా నాట్యమండలి లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నాడు. మరో ప్రముఖ దర్శకుడు టి. కృష్ణ, నిర్మాత పోకూరి బాబురావు ఈయన సహోధ్యాయిలు. రంగారావు కొడుకు మాదాల రవి. తండ్రి సినిమాల్లో బాల నటుడిగా నటించాడు.[4] 1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించాడు.[5]

వామపక్ష సిద్ధాంతాలకు అండదండ

[మార్చు]

తాను నిర్మించిన చిత్రాల ద్వారా వచ్చిన లాభాన్ని సీపీఎం పార్టీ కార్యాలయానికి విరాళంగా ఇచ్చేవాడు. ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లోని థియేటర్లలో ప్రదర్శించడం ద్వారా వచ్చిన లాభాన్ని స్థానిక సీపీఎం కార్యాలయాలకు అందించేవాడు. మారుతున్న పరిస్థితుల్లో కూడా నమ్ముకొన్న సిద్ధాంతాలను తుదిశ్వాస వరకు విడవలేదు.

సినిమాలు

[మార్చు]

చైర్మన్ చెలమయ్య ఆయన మొదటి సినిమా. నవతరం ప్రొడక్షన్స్ పతాకంపై ఈయన 1980 లో తీసిన యువతరం కదిలింది సినిమాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది పురస్కారం లభించింది. నవతరం పిక్చర్స్‌ బ్యానర్లో సినిమాలు నిర్మించిన మాదాల, ఎక్కువగా విప్లవ భావాలు కలిగిన చిత్రాలనే తీశాడు. నేటి తరంలో విప్లవ సినిమాలకు చిరునామాగా నిలిచిన ఆర్‌ నారాయణమూర్తికి మాదాల స్పూర్తిగా నిలిచారు.

మరణం

[మార్చు]

గత కొంతకాలంగా శ్వాసకోస సంబంధ వ్యాధితో బాధపడుతున్న మాదాల రంగారావు 2018, మే 27 ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాదులో మరణించాడు.[6][5]

మూలాలు

[మార్చు]
  1. "'Red star' Madala Ranga Rao shines". thehindu.com. ది హిందు. Retrieved 29 December 2017.
  2. "Madala Ranga Rao--The real red star!". sulekha.com. Retrieved 29 December 2017.
  3. "విప్లవ నటుడు మాదాల రంగారావు కన్నుమూత".
  4. రాజబాబు. "కెసిఆర్ మూడెకరాలు ఇస్తానని చెప్పి.. ప్రభుత్వాలు అంతే: మాదాల రవి". oneindia.com. Retrieved 29 December 2017.
  5. 5.0 5.1 ప్రజాశక్తి, తాజా వార్తలు (27 May 2018). "రెడ్‌స్టార్‌, నిర్మాత‌ మాదాల రంగారావు కన్నుమూత". Archived from the original on 27 May 2018. Retrieved 27 May 2018.
  6. "ఎర్రసూర్యుడు మాదాల రంగారావు కన్నుమూత".

బయటి లంకెలు

[మార్చు]