గురవారెడ్డి పాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురవారెడ్డి పాలెం
—  రెవిన్యూ గ్రామం  —
గురవారెడ్డి పాలెం is located in Andhra Pradesh
గురవారెడ్డి పాలెం
గురవారెడ్డి పాలెం
అక్షాంశరేఖాంశాలు: 15°32′34″N 79°55′52″E / 15.542883°N 79.9309907°E / 15.542883; 79.9309907
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,548
 - పురుషుల సంఖ్య 755
 - స్త్రీల సంఖ్య 793
 - గృహాల సంఖ్య 398
పిన్ కోడ్ 523211
ఎస్.టి.డి కోడ్ 08592

గురవారెడ్డి పాలెం, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]. పిన్ కోడ్: 523 211., ఎస్.ట్.డి.కోడ్ = 08592.

గ్రామ చరిత్ర[మార్చు]

స్వాతంత్ర్యోద్యమ సమయంలో, ఈ గ్రామం, గ్రామస్వరాజ్యానికి వెన్నుదన్నుగా నిలిచింది. స్వదేశీ వస్తువులే వాడాలన్న గాంధీజీ పిలుపు మేరకు ఈ గ్రామంలోని 200 కుటంబాలవారు ఖద్దరు తయారు చేపట్టినారు. ప్రత్తిని నూలుగా మార్చి, దారాలుగా తయారుచేసేవారు. మరికొందరు ఖద్దరు దుస్తులు తయారు చేసేవారు. ఇక్కడ తయారుచేసిన దుస్తులు డిల్లీలోని జాతీయ కాంగ్రెసు పార్టీ నాయకులదాకా వెళ్ళేవి. జిల్లా ఖద్దరు బోర్డు కార్యాలయం మొదట ఇక్కడే ఏర్పడింంది. తరువాత జిల్లా కేంద్రానికి మారినది. 1932 లో అప్పటి భారత జాతీయ కాంగ్రెసు అధ్యక్షులు దాక్టర్ బాబూరాజేంద్రప్రసాదుగారు ఈ గ్రామానికి వచ్చి, గ్రామ ప్రజల త్యాగనిరతిని, దేశభక్తినీ ప్రశంసించారు. ఈ గ్రామంలో శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిగారి పేరిట ఒక స్వాగత ద్వారం నిర్మించారు. [2]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

మైనంపాడు 2.5 కి.మీ, రుద్రవరం 3.6 కి.మీ, దొడ్డవరపాడు 4.1 కి.మీ, ఎండ్లూరు 4.2 కి.మీ, నెలతూరు 4.2 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

మద్దిపాడు 6.6 కి.మీ, సంతనూతలపాడు 9.2 కి.మీ, చీమకుర్తి 11 కి.మీ, ఒంగోలు 12.9 కి.మీ.

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

పశువైద్యశాల.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ షిర్డీ సాయిబాబా అలయం[మార్చు]

ఈ ఆలయంలో 2015, మే-29వ తేదీ శుక్రవారంనాడు, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించెదరు. [4]

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం & శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం[మార్చు]

ఈ రెండు ఆలయాలకు కలిపి 10.59 ఎకరాల మాన్యం భూమి ఉంది. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,548 - పురుషుల సంఖ్య 755 - స్త్రీల సంఖ్య 793 - గృహాల సంఖ్య 398

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,537.[2] ఇందులో పురుషుల సంఖ్య 748, మహిళల సంఖ్య 789, గ్రామంలో నివాస గృహాలు 365 ఉన్నాయి.

  • గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి

[1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-5; 9వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, జూన్-1; 1వపేజీ. [4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, మే-29; 2వపేజీ.