పిడతలగుడిపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పిడతలగుడిపాడు
—  రెవిన్యూ గ్రామం  —
పిడతలగుడిపాడు is located in Andhra Pradesh
పిడతలగుడిపాడు
పిడతలగుడిపాడు
అక్షాంశరేఖాంశాలు: 15°32′34″N 79°56′24″E / 15.542883°N 79.939907°E / 15.542883; 79.939907
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా ప్రకాశం జిల్లా
మండలం సంతనూతలపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,148
 - పురుషుల సంఖ్య 1,062
 - స్త్రీల సంఖ్య 1,086
 - గృహాల సంఖ్య 544
పిన్ కోడ్ 523226
ఎస్.టి.డి కోడ్

పిడతలగుడిపాడు, ప్రకాశం జిల్లా, సంతనూతలపాడు మండలానికి చెందిన గ్రామము.[1]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,148 - పురుషుల సంఖ్య 1,062 - స్త్రీల సంఖ్య 1,086 - గృహాల సంఖ్య 544

2001 వ .సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,021.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,009, మహిళల సంఖ్య 1,012, గ్రామంలో నివాస గృహాలు 460 ఉన్నాయి.

సమీప గ్రామాలు[మార్చు]

బొడ్డువారిపాలెం, చండ్రపాలెం, చిలకపాడు, ఎండ్లూరు, యనికపాడు, గుమ్మలంపాడు.

సమీప పట్టణాలు[మార్చు]

చీమకుర్తి 6.3 కి.మీ, కొండేపి 14.3 కి.మీ, మద్దిపాడు 15.8 కి.మీ, ఒంగోలు 16.1 కి.మీ.

గ్రామములోని మౌలిక సదుపాయాలు[మార్చు]

అంగనవాడీ కేంద్రం.

గ్రామములోని దేవాలయాలు[మార్చు]

  1. శ్రీ గంగమ్మ తల్లి ఆలయం.
  2. శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం.
  3. శ్రీ నాగార్పమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఆగస్టు-24, శ్రావణ మాసం, చివరి ఆదివారం నాడు, రజకసంఘం ఆధ్వర్యంలో నాగార్పమ్మ తల్లి ప్రతిష్ఠా వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [2]
  4. శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- 23 లక్షల రూపాయల వ్యయంతో, నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2015, జూన్-10వ తేదీ బుధవారంనాడు, ప్రత్యేకహోమాలతో ప్రారంభించారు. 11వ తేదీ గురువారంనాడు, ప్రత్యేకంగా ధ్వజస్తంభం, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలను, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ఆకుపూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆయా ప్రాంతాలనుండి వచ్చిన మహిళాభక్తులు, పెద్ద యెత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం, భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అదే రోజున ఆలయ ముఖద్వారం నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. [3]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

  • గ్రామసంభందిత వివరాలకు ఇక్కడ చూడండి [1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఆగస్టు-25; 1వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, జూన్-12; 1వపేజీ.