పోతురాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బతుకమ్మ పండగ సందర్భముగా.. వనస్థలిపురములో పోతురాజుల వేష ధారులు

పోతరాజు లేదా పోతురాజు pōtu-rāju. n. గంగమ్మ, పెద్దమ్మ లాంటి గ్రామదేవత ల మగడిగా పూజలు అందుకునేవాడు. "పాడు ఊరికి మంచపుకోడు పోతురాజు" అనేది తెలుగు సామెత. in a ruined village the leg of a cot is a god. cf., 'a Triton of the minnows' (Shakespeare.)

బమ్మెర పోతరాజు ఆంధ్ర భాగవత రచయిత బమ్మెర పోతనకి మరోపేరు. పోతురాజు లేకుండా ఏ కొలుపు, ఏ జాతర, ఏ తిరునాళ్లు, ఏ బోనాలు జరగవు. అంత ముఖ్యమైనవాడు ఈ పోతురాజు.[1] మైసమ్మ, పోచమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, మారమ్మ ,ఈదమ్మ, దుర్గమ్మ, మహంకాళి, పెద్దమ్మ మొదలైన దేవతలందరి కోటకు కావలిగా పోత లింగమై శివుని ఆజ్ఞ మేరకు నిలుస్తాడు పోతురాజు.[2]

గ్రామదేవత ఉత్సవాలలో పూనకంతో వున్న పోతరాజు తన దంతాలతో మేక పోతును కొరికి, తలను మోండెం నుండి వేరుచేసి పైకి ఎగురవేస్తాడు, దీనినే గావు పెట్టడం అంటారు. గ్రామ దేవతల ఊరేగింపులో ముందుగా పోతు రాజు విగ్రహము ముందుంటుంది. ఈ ఊరేగింపులో కొందరు పురుషులు పోతు రాజు వేషం ధరించి ఆడుతారు. అలాగే పురాణ సంబంధిత నాటకాలు వేసే టప్పుడు ముందుగా పోతురాజు విగ్రహాన్ని పెట్టి నాటకము ఆడుతారు.

పోతురాజు విగ్రహము. మొగరాల మహాభారత నాటకములో తీసిన చిత్రము

మూలాలు[మార్చు]

  1. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (13 July 2019). "'అమ్మ దేవతల' తమ్ముడు మన పోతురాజు". ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి. మూలం నుండి 14 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 14 July 2019. Cite news requires |newspaper= (help)
  2. మనతెలంగాణ, లైఫ్ స్టైల్ (14 July 2019). "నూటొక్క శక్తి దేవతల తమ్ముడు జానపదుల పోతురాజు". మూలం నుండి 14 July 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 14 July 2019. Cite news requires |newspaper= (help)
"https://te.wikipedia.org/w/index.php?title=పోతురాజు&oldid=2691078" నుండి వెలికితీశారు