అక్షాంశ రేఖాంశాలు: 15°54′26.1360″N 79°5′42.0000″E / 15.907260000°N 79.095000000°E / 15.907260000; 79.095000000

దోర్నాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దోర్నాల
దోర్నాల సమీపంలో నల్లమల కొండలు
దోర్నాల సమీపంలో నల్లమల కొండలు
పటం
దోర్నాల is located in ఆంధ్రప్రదేశ్
దోర్నాల
దోర్నాల
అక్షాంశ రేఖాంశాలు: 15°54′26.1360″N 79°5′42.0000″E / 15.907260000°N 79.095000000°E / 15.907260000; 79.095000000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలందోర్నాల
విస్తీర్ణం24.5 కి.మీ2 (9.5 చ. మై)
జనాభా
 (2011)[1]
11,993
 • జనసాంద్రత490/కి.మీ2 (1,300/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు6,075
 • స్త్రీలు5,918
 • లింగ నిష్పత్తి974
 • నివాసాలు2,886
ప్రాంతపు కోడ్+91 ( 08596 Edit this on Wikidata )
పిన్‌కోడ్523331
2011 జనగణన కోడ్590590

దోర్నాల, ప్రకాశం జిల్లా, ఇదే పేరుతో ఉన్న దోర్నాల మండలానిక కేంద్రం. దోర్నాలను శ్రీశైల క్షేత్రానికి ముఖద్వారంగా భావిస్తారు. ఇది సమీప పట్టణమైన మార్కాపురం నుండి 32 కి. మీ. దూరంలో ఉంది.

పేరు వ్యుత్పత్తి

[మార్చు]

ఈ గ్రామాన్నీ, మండలాన్నీ వాడుకలో పెద్ద దోర్నాల గానే వ్యవహరిస్తారు.పూర్వం ఈ గ్రామం శ్రీశైలమహా క్షేత్రానికి ద్వారంలా ఉండటం వలన ఈ గ్రామానికి తొరణాల అనీ నామకరణం చేశారు అది కాస్తా వాడుక భాషలో దోర్నాలగా నామరూపం చెందినది,

జనగణన గణాంకాలు

[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,518. ఇందులో పురుషుల సంఖ్య 4,869, మహిళల సంఖ్య 4,649, గ్రామంలో నివాస గృహాలు 1,987 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 2,450 హెక్టారులు.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2886 ఇళ్లతో, 11993 జనాభాతో 2450 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6075, ఆడవారి సంఖ్య 5918. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 2207 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 647.[2]

భౌగోళికం

[మార్చు]

జిల్లా కేంద్రమైన ఒంగోలుకు వాయవ్య దిశలో 125 కి.మీ దూరంలో వుంది. ఇది సమీప పట్టణమైన మార్కాపురం నుండి 32 కి. మీ. దూరంలో ఉంది.

సమీప గ్రామాలు

[మార్చు]

చిన్న దోర్నాల 4 కి.మీ, కటకానిపల్లి 8 కి.మీ, శనికవరం 9 కి.మీ, కలనూతల 14 కి.మీ, బోయదగుంపల 16 కి.మీ.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో రెండు ప్రైవేటు బాల బడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 8, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఆరు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల మార్కాపురంలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు మార్కాపురంలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల చినదోర్నాలలోను, అనియత విద్యా కేంద్రం మార్కాపురంలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ఒంగోలు లోనూ ఉన్నాయి.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

జాతీయ రహదారి 765 పై ఊరు వుంది. సమీప రైలు స్టేషన్ 38 కి.మీ దూరంలో తర్లుపాడు, 40 కి.మీ దూరంలోని మార్కాపూర్ రోడ్ లో వుంది.

భూమి వినియోగం

[మార్చు]

దోర్నాలలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 493 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 515 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 587 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 164 హెక్టార్లు
  • బంజరు భూమి: 524 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 163 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 708 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 144 హెక్టార్లు
    • బావులు/బోరు బావులు: 144 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ప్రత్తి, వరి, పొద్దు తిరుగుడు, మిర్చి, ఆముదాలు, చిరుదాన్యాలు, కందులు.

దర్శనీయ ప్రదేశాలు

[మార్చు]

శ్రీ నరసింహ స్వామి దేవస్థానం - శ్రీ నరసింహ స్వామీ వారి దేవాలయం గ్రామంలో చాలా పురాతనమైన దేవాలయం ఈ దేవాలయ నిర్మాణం శ్రీ కృష్ణ దేవరాయలు వారి ఆధ్వర్యంలో జరుపబడినది. ఈ దేవాలయం లోనే నరసింహ స్వామీ వారితో పాటుగా శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారు, ఈశ్వరుడు కొలువై ఉన్నారు.

శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం - గ్రామంలో శ్రీ రామలింగేశ్వరా స్వామీ వారు కొండపై లింగమయా స్వామి గా కొలువై ఉన్నారు. ఆయన ఉన్న ఆ కొండని లింగమయా కొండగా భక్తులు ప్రస్తావిస్తారు. ఇక్కడి నుండి గ్రామాన్ని చూస్తే చుట్టూరా అనీ గ్రామాలు, గ్రామం మొతం చాలా బాగా కనిపిస్తుంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=దోర్నాల&oldid=4267742" నుండి వెలికితీశారు