వెలిగండ్ల
Jump to navigation
Jump to search
వెలిగండ్ల | |
— మండలం — | |
ప్రకాశం జిల్లా పటములో వెలిగండ్ల మండలం యొక్క స్థానము | |
ఆంధ్రప్రదేశ్ పటములో వెలిగండ్ల యొక్క స్థానము | |
అక్షాంశరేఖాంశాలు: 15°20′30″N 79°20′44″E / 15.341575°N 79.345511°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం |
మండల కేంద్రము | వెలిగండ్ల |
గ్రామాలు | 22 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 33,628 |
- పురుషులు | 17,256 |
- స్త్రీలు | 16,372 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 52.74% |
- పురుషులు | 67.42% |
- స్త్రీలు | 37.27% |
పిన్ కోడ్ | {{{pincode}}} |
వెలిగండ్ల | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 15°20′30″N 79°20′44″E / 15.341575°N 79.345511°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | వెలిగండ్ల |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 523224 |
ఎస్.టి.డి కోడ్ |
ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, వెలిగండ్ల చూడండి.
వెలిగండ్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, వెలిగండ్ల మండలానికి చెందిన గ్రామం .[1].పిన్ కోడ్: 523 224., ఎస్.టి.డి.కోడ్ = 08402.
విషయ సూచిక
గ్రామ నామ వివరణ[మార్చు]
వెలిగండ్ల అనే గ్రామనామం వెలి అనే పూర్వపదం, గండ్ల అనే ఉత్తరపదాల కలయికతలో ఏర్పడింది. వీటిలో వెలి అనే పదం వర్ణ సూచకమని పరిశోధకుడు చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు.[2] గండ్ల అనే పదం పర్వతసూచి. గండి-లు-అగా భాషావేత్తలు దీన్ని విడగొడ్తారు. దీనికి కొండ అని అర్థం.[3]'
గ్రామ భౌగోళికం[మార్చు]
సమీప గ్రామాలు[మార్చు]
సురవారిపల్లే.రంగన్నపల్లి.బాపనపల్లి.గన్నవరం.
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
- ఈ పాఠశాలలో చదువుచున్న బత్తుల విజయలక్ష్మి అను విద్యార్థిని, 2015,సెప్టెంబరు-18 నుండి 27 వరకు, తెలంగాణా రాష్ట్రంలోని వరంగల్లు పట్టణంలో నిర్వహించు దక్షిణభారతదేశ స్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొనుటకు ఎంపికైనది. ఈమె ఇప్పటి వరకు 12 సార్లు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొని తన ప్రతిభ ప్రదర్శించింది. [2]
- ఈ పాఠశాలలో 10వ తరగతి చదువుచున్న రెక్కల స్వాతి అను విద్యార్థిని, ఇటీవల నెల్లూరులోని ఏ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో జిల్లాజట్టుకి ప్రాతినిధ్యం వహించి, అత్యుత్తమ ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనది. ఈమె 2015,డిసెంబరు-19 నుండి పంజాబ్ రాష్ట్రంలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుంది. [3]
- ఈ పాఠశాలలో పదవ తరగతి చదువుచున్న షేక్ ఆలీనవాజ్, కె.సిద్ధయ్య, బి.విజయలక్ష్మి అను ముగ్గురు విద్యార్థులు, ఇటీవల అనంతపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలలలో తమ ప్రతిభ కనబరచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. వీరు 2015,డిసెంబరు-28 నుండి కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరులో నిర్వహించు జాతీయస్థాయి ఖో-ఖో పోటీలలో పాల్గొంటారు. [4]
- ఈ పాఠశాలలో చదువుచున్న ముంతా గణేష్ మరియు వేము మౌనిక అను విద్యార్థులు, 2016,జనవరి-9 నుండి 11 వరకు, కడప జిల్లాలోని రైల్వే కోడూరులో నిర్వహించిన రాష్ట్రస్థాయి పైకా ఖో-ఖో పోటీలలో తమ అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి, జాతీయస్థాయి పోటీలలకు ఎంపికైనారు. ఈ ఇద్దరు విద్యార్థులూ, 2016,జనవరి-21 నుండి 23 వరకు గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ లో నిర్వహించు జాతీయస్థాయి పైకా పోటీలలో పాల్గొంటారు. [5]
గ్రామంలోని ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలోని ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు[మార్చు]
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 30. Retrieved 10 March 2015.
- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 232. Retrieved 10 March 2015.
వెలుపలి లింకులు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2014,డిసెంబరు-25; 7వపేజీ.[2] ఈనాడు ప్రకాశం; 2015,సెప్టెంబరు-19; 6వపేజీ.[3] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-19; 8వపేజీ.[4] ఈనాడు ప్రకాశం; 2015,డిసెంబరు-24; 15వపేజీ.[5] ఈనాడు ప్రకాశం; 2016,జనవరి-19; 15వపేజీ.