ముప్పవరం (కొండపి మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


ముప్పవరం
రెవిన్యూ గ్రామం
ముప్పవరం is located in Andhra Pradesh
ముప్పవరం
ముప్పవరం
నిర్దేశాంకాలు: 15°27′00″N 79°45′32″E / 15.45°N 79.759°E / 15.45; 79.759Coordinates: 15°27′00″N 79°45′32″E / 15.45°N 79.759°E / 15.45; 79.759 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొండపి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం1,425 హె. (3,521 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం3,406
 • సాంద్రత240/కి.మీ2 (620/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523273 Edit this at Wikidata

ముప్పవరం, ప్రకాశం జిల్లా, కొండపి మండలానికి చెందిన గ్రామం.[1] కొండపి మండలంలో ముప్పవరం అతి ముఖ్యమైన గ్రామం. పిన్ కోడ్: 523 273.

నాగార్జున సాగర్ ఎడమ కాలువ ఈ గ్రామం గుండా ప్రవహిస్తూ గ్రామంను సస్యశ్యామలం చేస్తున్నది. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఇక్కడి ముఖ్యమైన ఆహారపంట వరి, ముఖ్యమైన వాణిజ్యపంట పొగాకు. ప్రకృతి అందాలతో కళకళలాడుతూ సిరిసంపదలతో తులతూగే ముప్పవరం స్వర్గాన్ని తలపించును అనడం లో అతిశయోక్తి లేదు.[ఆధారం చూపాలి] ఈ గ్రామం జనాభా సుమారు రెండు వేలు. జాతీయ రహదారిటంగుటూరు నుండి 18 కిలోమీటర్ల సమీపాన ఉన్న ఈ గ్రామంనకు చేరుకునుట చాలా సులభము. ముప్పవరం మండల వ్యవస్థకు పూర్వము కందుకూరు తాలూకాలో ఉండేది. కందుకూరు నుండి రెండు మార్గములు ఉన్నాయి. ఒకటి బస్సు రూటు. ఈ మార్గము ఇంచుమించు 50 కిలోమీటర్లు ఉంటుంది. కందుకూరు నుండి రెండు గంటలు పట్టవచ్చు. ఇక రెండవది 25 కిలోమీటర్లు. ఈ మార్గము కేవలం ద్విచక్ర వాహనములకు అనువైనది. ముప్పవరము నకు జిల్లా కేంద్రము ఒంగోలు. ఇచ్చట ఒంగోలు నుండి విరివిరిగా బస్సులు ఉన్నాయి. ముప్పవరం గ్రామంలో ప్రజలు అందరు ఎంతో కలిసి మెలిసి గ్రామ అభివృద్ధికి సహాయము చేసుకుంటారు. ఇక్కడి దర్శనీయ ప్రదేశాలలో ముఖ్యమైనవి శివాలయం, అమ్మవారి గుడి. గ్రామస్తుల నుండి నిత్యం పూజలు, భజనలతో ప్రాముఖ్యత సంతరించుకున్న ఈ దేవాలయాలు ఇక్కడి ప్రజల భక్తి ప్రవృత్తలకు నిలువెత్తు నిదర్శనం. ఇక్కడి శివాలయం అరుగులు యువకుల రాజకీయ చర్చలకు వేదిక. ఈ గ్రామంను సందర్శించుటకు జూన్ నుండి ఫిబ్రవరి అనుకూలం. ఈ గ్రామంలో ఒక ఉన్నత పాఠశాల ఉన్నది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 3,088.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,556, మహిళల సంఖ్య 1,532, గ్రామంలో నివాస గృహాలు 749 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 1,425 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 3,406 - పురుషుల సంఖ్య 1,724 -స్త్రీల సంఖ్య 1,682 - గృహాల సంఖ్య 881

సమీప గ్రామాలు[మార్చు]

చోడవరం 2 కి.మీ,పెరిదేపి 3 కి.మీ,గోగినేనివారిపాలెం 3 కి.మీ,వెన్నూరు 3 కి.మీ,ఎం.వేములపాడు 5 కి.మీ.

సమీప పట్టణాలు[మార్చు]

సంతనూతలపాడు 14.3 కి.మీ,జరుగుమిల్లి 16.5 కి.మీ,పొన్నలూరు 17.8 కి.మీ,చీమకుర్తి 18.7 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

దక్షణాన జరుగుమిల్లి మండలం,ఉత్తరాన సంతనూతలపాడు మండలం,తూర్పున టంగుటూరు మండలం,దక్షణాన పొన్నలూరు మండలం.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]