కోట్ల వెంకటేశ్వరరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోట్ల వెంకటేశ్వరరెడ్డి
కోట్ల వెంకటేశ్వర రెడ్డి
జననంకోట్ల వెంకటేశ్వరరెడ్డి
నివాస ప్రాంతంమహబూబ్ నగర్
వృత్తిఉపాధ్యాయుడు
ప్రసిద్ధికవి
మతంహిందూ

కోట్ల వెంకటేశ్వరరెడ్డి తెలుగు కవి మరియు రచయిత.

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయులు. జలజం సత్యనారాయణతో కలిసి తెలంగాణ రచయితల వేదికకు జిల్లా బాధ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. నానీల రచనలో వీరిది అందెవేసిన చెయ్యి. "నూరు తెలంగాణ నానీలు", "నాన్నా! నాలా ఎదుగు" , "మనిషెల్లిపోతుండు", "గుండె కింద తడి", రహస్యాలు లేని వాళ్ళు, రంగు వెలసిన జెండా వంటి కవితా సంకలనాలు వెలువరించాడు[1], నాలుగు సార్లు రంజని-కుందుర్తి అవార్డ్ అందుకున్నాడు. సమతా రచయితల సంఘం వారి ఉత్తమ కవితా సంపుటి అవార్డును 1998లో అందుకున్నారు.

రచనలు[మార్చు]

  • నూరు తెలంగాణ నానీలు (నానీలు)
  • నాన్నా! నాలా ఎదుగు (దీర్ఘ కవిత)
  • మనిషెల్లిపోతుండు (వచన కవితలు)
  • గుండె కింద తడి (వచన కవితలు)
  • రహస్యాలు లేని వాళ్ళు (వచన కవితలు)
  • రంగు వెలసిన జెండా (వచన కవితలు)

పురస్కారాలు[మార్చు]

ఆయనకు పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం 2014 సంవత్సర కీర్తి పురస్కారం "వివిధ ప్రక్రియలు" విభాగంలో వచ్చినది.[2]

మూలాలు[మార్చు]

  1. పాలమూరు కవిత, సంపాదకులు. భీంపల్లి శ్రీకాంత్, పాలమూరు సాహితీ ప్రచురణ -2004, కవి జీవితాలు, పుట-163
  2. ప్రతిభామూర్తులకు కీర్తి పురస్కారాలు

ఇతర లింకులు[మార్చు]