వెల్లాల సదాశివశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వెల్లాల సదాశివశాస్త్రి (1861-1925) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కవి. జిల్లాలోని పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లె ఇతని స్వగ్రామం[1]. తల్లి వెంకటసుబ్బమ్మ, తండ్రి శంకరజ్యోసులు. ఇతడు జటప్రోలు సంస్థానంలో నివసించాడు. ఇతడు ప్రధానంగా చరిత్ర సంబంధిత రచనలు చేశాడు. సురభి మాధవ రాయలు వ్రాసిన చంద్రికా పరిణయం కావ్యానికి అవధానం శేషశాస్త్రితో కలిసి వ్యాఖ్య వ్రాశాడు. ఇతడు మొత్తం 27 గ్రంథాలు రచించాడు. వాటిలో 15 గ్రంథాలు మాత్రం ముద్రించబడ్డాయి[2]. తెల్కపల్లి రామచంద్రశాస్త్రితో ఇతనికి సాహిత్యపరమైన వాదవివాదాలు చెలరేగినాయి. రామచంద్రశాస్త్రి భారతీ తారామాల రచన చేస్తే దానిని ఇతడు భారతీతారామాల ఖండనము అనే పేరుతో విమర్శించాడు. ఇతడు "రామచంద్ర పంచకము" పేరుతో రామచంద్రశాస్త్రిని విమర్శిస్తే, తెల్కపల్లి రామచంద్రశాస్త్రి "సదాశివాష్టకము" పేరుతో బదులు ఇచ్చాడు. ఇలా ఇరువురూ నిందాపూర్వక పద్యాలు వ్రాసుకున్నారు[3].

రచనలు[మార్చు]

ఇతని ముద్రిత రచనలు[2]:

 1. కావ్యాలంకార సంగ్రహ విమర్శనము
 2. వెలుగోటివారి రాజవంశ చరిత్రము
 3. సురభి వంశచరిత్రము
 4. ఆంధ్రుల చరిత్ర - విమర్శనము
 5. వీరభద్రీయ ఖండనము[4]
 6. కంఠీరవ చరిత్రము
 7. రామచంద్ర చరిత్రము
 8. నామిరెడ్డి చరిత్రము
 9. యతినిందా నిరాకరణము
 10. రామానుజ గోపాల విజయము
 11. ఆంధ్ర దశరూపక విమర్శనము
 12. కన్యకాంబ చంపువు (సంస్కృతం)
 13. పరివ్రాజ చంద్రిక
 14. ఉద్యాహాభాస విరాసం
 15. ఖండనాభాస నిరసనము

మూలాలు[మార్చు]

 1. తెలుగు సాహితీ వేత్తల చరిత్ర, రచన: మువ్వల సుబ్బరామయ్య, కృష్ణవేణి పబ్లికేషన్స్, విజయవాడ,2014, పుట-28.
 2. 2.0 2.1 గుడిపల్లి నిరంజన్ (మే 2019). నాగర్‌కర్నూల్ జిల్లా సాహిత్యచరిత్ర (1 ed.). హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ. p. 25. Retrieved 31 March 2020. Check date values in: |date= (help)
 3. గుడిపల్లి నిరంజన్ (మే 2019). నాగర్‌కర్నూల్ జిల్లా సాహిత్యచరిత్ర (1 ed.). హైదరాబాద్: తెలంగాణ సాహిత్య అకాడమీ. p. 42. Retrieved 31 March 2020. Check date values in: |date= (help)
 4. ఇంటర్నెట్ ఆర్కీవ్స్‌లో పుస్తక ప్రతి