అష్టభాషి బహిరీ గోపాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

అష్టభాషి బహిరీ గోపాలరావు మహబూబ్ నగర్ జిల్లా లోని ప్రసిద్ధక్షేత్రం శ్రీరంగాపూర్ నిర్మాత. క్రీ.శ. 1676 ప్రాంతానికి చెందినవాడు. వనపర్తి సంస్థానంనకు పూర్వపు రాజధాని అయిన సూగూరు సంస్థానం స్థాపకులు వీర కృష్ణారెడ్డికి మునిమడు. గోల్కొండ నవాబులులచే 'బహిరీ' అని కితాబు పొందాడు.. ఇతని మేనల్లుడే బిజ్జుల తిమ్మభూపాలుడు. ఇతనికి మొదట సంతానం లేకపోవడం వలన బంధువుల బిడ్డ వెంకటరెడ్డిని దత్తత తీసుకున్నాడు. తదనంతరం ఇతనికి కుమార బహిరీ గోపాలరావు జన్మించినా, దత్త పుత్రుడు వెంకటరెడ్డినే తదనంతరం సూగూరు సంస్థానానికి వారసుడిగా ప్రకటించాడు.

సాహిత్య కృషి[మార్చు]

అష్టభాషి బహిరీ గోపాలరావుగా ప్రసిద్ధి చెందిన జనుంపల్లి గోపాలరావు[1] గొప్ప పండితుడు. ఎనిమిది భాషలలో విద్వాంసుడు. కావుననే అష్టభాషల గోపాలరావుగా సుప్రసిద్ధుడు. తిరుపతి, కంచి, శ్రీరంగం మొదలగు క్షేత్రాలను దర్శించి, అక్కడి కవులను సత్కరించి సూగూరుకు తీసుకవచ్చాడు. స్వయంగా తానే రామచంద్రోదయం అను శ్లేష కావ్యాన్ని, శృంగార మంజరీ అను భాణాన్ని సంస్కృతంలో రచించాడు.[2]..

మూలాలు[మార్చు]

  1. పాలమూరు సాహితీ వైభవం, రచన: ఆచార్య ఎస్వీ రామారావు, 2010 ప్రచురణ, పేజీ 32
  2. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-33