తెలంగాణ భాషా దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

తెలంగాణ భాషా దినోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సెప్టెంబరు 9న తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపబడుతున్న దినోత్సవం. తెలంగాణ రచయిత కాళోజీ నారాయణరావు 100వ జయంతి సందర్భంగా.. కాళోజీ పుట్టినరోజైన సెప్టెంబరు 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.[1][2][3]


2016 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకుంటున్న ప్రజాకవి, రచయిత, గాయకుడు గోరటి వెంకన్న
2019 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకుంటున్న కోట్ల వెంకటేశ్వరరెడ్డి
2021 కాళోజీ స్మారక పురస్కారాన్ని అందుకుంటున్న పెన్నా శివరామకృష్ణ

కార్యక్రమాలు[మార్చు]

కాళోజీ జయంతి రోజున తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు తోపాటు జిల్లా కేంద్రాల్లో రాష్ట్రవ్యాప్తంగా భాషా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు తెలంగాణ భాషపై చర్చాగోష్ఠులు, వ్యాసరచన, ఉపన్యాస, కవితా పోటీలు నిర్వహిస్తారు. తెలంగాణలో భాషా, సాహిత్యరంగంలో విశేష కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ నుండి రాష్ట్రస్థాయి కాళోజీ సాహిత్య పురస్కారాన్ని ప్రధానం చేస్తారు.

కాళోజీ సాహిత్య పురస్కారం[మార్చు]

 1. 2015 - అమ్మంగి వేణుగోపాల్, రచయిత, సాహితీ విమర్శకుడు.[4][5]
 2. 2016 - గోరటి వెంకన్న, ప్రజాకవి, రచయిత, గాయకుడు.[6]
 3. 2017 - డా. సీతారం
 4. 2018 - అంపశయ్య నవీన్[7]
 5. 2019 - కోట్ల వెంకటేశ్వరరెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌, హోంశాఖ మంత్రి మెహమూద్ అలీ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కె.వి. రమణాచారి, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు డాక్టర్‌ నందిని సిధారెడ్డి, తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షుడు బాద్మి శివకుమార్‌, మహబూబ్‌నగర్‌ జెడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణ, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, కాళోజీ ఫౌండేషన్‌కు చెందిన నాగిళ్ల రామశాస్త్రి పాల్గొన్నారు.[8][9]
 6. 2020 - రామా చంద్రమౌళి, కవి, రచయిత. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పురస్కారం అందజేశాడు. సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.[10][11]
 7. 2021 - పెన్నా శివరామకృష్ణ, కవి, రచయిత. రవీంద్ర భారతిలో జరిగిన కాళోజీ జయంతి ఉత్సవాలలో అవార్డు కింద రూ.1,01,116/- నగదు బహుమతిని, శాలువాను, మెమెంటోను రాష్ట్ర మంత్రులు వి. శ్రీనివాస్‌ గౌడ్‌, మహమూద్‌ అలీ, శాసనసభ్యులు రసమయి బాలకిషన్, శాసన మండలి సభ్యులు గోరటి వెంకన్న చేతుల మీదుగా అందుకున్నాడు.[12]

ఇతర లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు. "తెలంగాణ భాషా దినోత్సవంగా కాళోజీ జయంతి". Retrieved 19 December 2016.
 2. జనం సాక్షి. "అధికారికంగా తెలంగాణ భాషా దినోత్సవం". Retrieved 19 December 2016.
 3. నవ తెలంగాణ. "కాళోజీ నారాయణరావు జయంతి రోజే తెలంగాణ భాషా దినోత్సవం". Retrieved 19 December 2016.
 4. 10టివి. "రచయిత అమ్మంగి వేణుగోపాల్ కు కాళోజి తొలి స్మారక పురస్కారం." Archived from the original on 28 January 2021. Retrieved 19 December 2016.
 5. telangananewspaper. "Ammangi Venugopal Honour Kaloji Puraskar Award 2015". Retrieved 19 December 2016.
 6. నమస్తే తెలంగాణ. "తెలంగాణ ముద్దు బిడ్డ గోరటి వెంకన్న కాళోజీ పురస్కారం". Retrieved 19 December 2016.[permanent dead link]
 7. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (8 September 2018). "అంపశయ్య నవీన్‌కు కాళోజీ పురస్కారం". Archived from the original on 21 May 2019. Retrieved 21 May 2019.
 8. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (10 September 2019). "కలంయోధుడు.. కాళోజీ". www.ntnews.com. Archived from the original on 10 September 2019. Retrieved 10 September 2019.
 9. వి6 వెలుగు, హమారా హైదరాబాద్ (10 September 2019). "బతుకును ఆరాధించిన కవి కాళోజీ". Archived from the original on 10 September 2019. Retrieved 10 September 2019.
 10. ఈనాడు, తెలంగాణ (10 September 2020). "రామా చంద్రమౌళికి కాళోజీ పురస్కారం ప్రదానం". www.eenadu.net. Archived from the original on 10 September 2020. Retrieved 10 September 2020.
 11. నమస్తే తెలంగాణ, తెలంగాణ (9 September 2020). "సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ సాహిత్య అవార్డు". ntnews. Archived from the original on 10 September 2020. Retrieved 10 September 2020.
 12. Sakshi (10 September 2021). "ఉద్యమకారులకు స్ఫూర్తి.. కాళోజీ". Archived from the original on 10 September 2021. Retrieved 10 September 2021.