బుర్రా వెంకటేశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుర్రా వెంకటేశం
Burra Venkatesham.jpg
బుర్రా వెంకటేశం
జననం
బుర్రా వెంకటేశం గౌడ్

1968 ఏప్రిల్‌ 10
వృత్తిబిసి సంక్షేమ శాఖ కార్యదర్శి
సుపరిచితుడు/
సుపరిచితురాలు
ఐ.ఎ.ఎస్ ఆఫీసర్, సాహితీకారుడు, పాటల రచయిత
జీవిత భాగస్వామిగీతాలక్ష్మి
పిల్లలుయోగ్య హరిప్రకాశ్, భవ్యశ్రీ
తల్లిదండ్రులు
  • బుర్రా నారాయణ గౌడ్ (తండ్రి)
  • బుర్రా గౌరమ్మ [1] (తల్లి)

బుర్రా వెంకటేశం గౌడ్ 1995 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.[2]

జననం[మార్చు]

బుర్రా వెంకటేశం 1968 ఏప్రిల్‌ 10న తెలంగాణ రాష్ట్రం, జనగామ జిల్లా, ఓబుల కేశవపురం గ్రామంలో బుర్రా నారాయణ గౌడ్, గౌరమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన రెండో తరగతిలో ఉండగానే తన ఏడేళ్ల వయస్సులోనే తండ్రి నారాయణను కోల్పోయాడు. ఏడవ తరగతి వరకు స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదివి ఏడవ తరగతి ఉమ్మడి వరంగల్ జిల్లా మొదటి ర్యాంకు సాధించాడు. ఆయన తరువాత నల్గొండ జిల్లా సర్వేలు గురుకుల పాఠశాలలో 8 వ తరగతి నుండి పదో తరగతి వరకు చదివి పదో తరగతిలో టాపర్‌గా నిలిచారు. బి. వెంకటేశం తరువాత హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ ప్రైవేటుగా చదివి టాపర్‌గా నిలిచి చదువుకుంటూనే మరోపక్క ట్యూషన్స్ చెబుతూ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ చేశాడు.[3]

వృత్తి జీవితం[మార్చు]

బుర్రా వెంకటేశం ఐఏఎస్ కావాలనే సంకల్పంతో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ సబ్జెక్టులుగా తీసుకుని 1990లో తొలిసారి సివిల్స్ రాశాడు, మొదటి ప్రయత్నంలో ఆయన సెంట్రల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం సాధించి శిక్షణ అనంతరం 1993 జనవరిలో బెంగుళూరులో కస్టమ్స్ అధికారిగా చేరాడు. ఆయన రెండో ప్రయత్నంగా ఆంత్రోపాలజీ, తెలుగు లిటరేచర్ ఆప్షనల్ సబ్జెక్టులుగా తీసుకుని కోచింగ్ లేకుండానే 1994లో సివిల్స్ కు ప్రిపేర్ అయి 1995లో మెయిన్స్ రాసి తరువాత వెలువడిన ఫలితాల్లో జాతీయ స్థాయిలో 15వ ర్యాంకు & ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ ర్యాంకు సాధించి టాపర్‌గా నిలిచాడు.

బుర్రా వెంకటేశం ఐఏఎస్ శిక్షణ అనంతరం 1996లో ఆదిలాబాద్ ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఆయన 1996లో చివర్లో తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సబ్ కలెక్టర్‌గా, 1998లో రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా, 1999లో వరంగల్ మునిసిపల్ కమిషనర్‌గా,[4] 2001లో చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా, 2003లో గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెదక్, గుంటూరు జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌కు ప్రాజెక్టు డైరెక్టర్‌గా, ఏపీ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా, స్టేట్‌ టూరిజం డిపార్ట్‌మెంట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో బుర్రా వెంకటేశం

బుర్రా వెంకటేశంను 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత అఖిల భారత సర్వీస్ అధికారుల విభజనలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు.[5] ఆయన తరువాత తెలంగాణ రాష్ట్ర హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా, సమాచార పౌరసంబంధాల కమిషనర్‌గా నియమితుడయ్యాడు.[6] బుర్రా వెంకటేశం 2015లో తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక & పర్యాటక శాఖ కార్యదర్శిగా నియమితుడై 2017లో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదురోజులపాటు నిర్వహించిన తెలుగు మహాసభల కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.[7] బుర్రా వెంకటేశంకు బిసి సంక్షేమ శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ జనవరి 2018లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[8] ఆయనను 2020 ఫిబవ్రరి 2న తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.[9][10]

బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి[మార్చు]

బుర్రా వెంకటేశం 2022లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ సందర్బంగా ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అభ్యర్థులకు సలహాలు-సూచనలు అందించేందుకు వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన ప్రత్యేక అవగాహన కార్యక్రమాలకు ముఖ్య అతిధిగా హాజరై అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసి తన ప్రసంగాల ద్వారా అనేక సలహాలు, సూచనలు అందజేశాడు.[11][12]

రచనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Sakshi (28 July 2021). "ఐఏఎస్‌ అధికారికి మాతృవియోగం". Archived from the original on 28 July 2021. Retrieved 28 July 2021.
  2. Namasthe Telangana (26 March 2021). "వెనుకబడిన సంక్షేమ శాఖ కార్యాలయం ఆకస్మిక తనిఖీ". Namasthe Telangana. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  3. Andhra Jyothy (2018). "పుస్తకం మలిచిన మనిషిని..!". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  4. Eenadu (19 April 2021). "మహా ప్రగతి." Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  5. Sakshi (23 August 2014). "ఎక్కడివారక్కడే." Archived from the original on 21 March 2022. Retrieved 21 March 2022.
  6. జనంసాక్షి (11 June 2014). "ఐ అండ్‌ పీఆర్‌ కమిషనర్‌గా బుర్రా వెంకటేశం". janamsakshi.org. Archived from the original on 24 September 2019. Retrieved 24 September 2019.
  7. Zee News Telugu (4 January 2018). "2017లో తెలుగు సాహితీ పరిమళాలు..!". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
  8. Mana Telangana (2 January 2018). "రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు". Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.
  9. 10TV (3 February 2020). "ఇదే ఫస్ట్ టైమ్ : తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు" (in telugu). Archived from the original on 22 March 2022. Retrieved 22 March 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  10. Eenadu (29 October 2021). "స్వశక్తిపై నమ్మకముంటేనే విజయం". Archived from the original on 1 April 2022. Retrieved 1 April 2022.
  11. Namasthe Telangana (5 June 2022). "అధ్యయనం, అవగాహనతోనే పోటీపరీక్షల్లో విజయం". Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  12. Andhra Jyothy (20 May 2022). "గ్రూప్-1 ప్రిపరేషన్ పై సరిగా దృష్టి పెట్టండి...సక్సెస్ సాధిస్తారు:బుర్రా వెంకటేశం" (in ఇంగ్లీష్). Archived from the original on 5 June 2022. Retrieved 5 June 2022.
  13. ఈనాడు, కధనాలు (25 July 2019). "విజయంతో స్వీయచిత్రం". Archived from the original on 25 July 2019. Retrieved 25 July 2019.
  14. New Indian Express, Cities Hyderabad (23 July 2019). "Selfie of Success book review: Climbing the ladder". The New Indian Express. Archived from the original on 24 July 2019. Retrieved 25 July 2019.
  15. News18 Telugu (28 August 2019). "సక్సెస్... సక్సెస్...సక్సెస్... సింప్లీ 'సెల్ఫీ ఆఫ్ సక్సెస్'". News18 Telugu. Archived from the original on 30 August 2019. Retrieved 30 August 2019.
  16. ఆంధ్రజ్యోతి, సాహిత్య వార్తలు సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ పుస్తక సమీక్ష (8 August 2019). "సెల్ఫీ ఆఫ్‌ సక్సెస్‌ పుస్తక సమీక్ష". lit.andhrajyothy.com. Archived from the original on 24 September 2019. Retrieved 24 September 2019.
  17. Deccan Chronicle (9 July 2019). "Understanding success". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  18. V6 Velugu, V6 (2 August 2019). "సెల్ఫీ ఆఫ్ సక్సెస్ చదివిన మహేష్" (in ఇంగ్లీష్). Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
  19. Sakshi (5 January 2020). "మీ ముందుకు.. 'గెలుపు పిలుపు'". Sakshi. Archived from the original on 23 May 2021. Retrieved 23 May 2021.
  20. Teluguone (22 May 2021). "సీనియ‌ర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంక‌టేశం 'జీవ‌న ధ‌న్య' శ‌త‌కం ఆవిష్క‌రణ" (in english). Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.{{cite news}}: CS1 maint: unrecognized language (link)
  21. TeluguOne (22 February 2022). "బుర్రా వెంక‌టేశం జీవ‌న ధన్య శ‌త‌కాన్ని ఆవిష్క‌రించిన డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి". Archived from the original on 22 February 2022. Retrieved 22 February 2022.
  22. Eenadu (6 March 2022). "సమీక్ష". Archived from the original on 28 March 2022. Retrieved 28 March 2022.
  23. Namasthe Telangana (10 April 2022). "రామాయ‌ణంలోని ఈ పాత్ర‌ల గురించి మీకు తెలుసా !!". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  24. Namasthe Telangana (18 October 2021). "కవిత్వంతోనే నవ సమాజం సాధ్యం". Archived from the original on 10 April 2022. Retrieved 10 April 2022.
  25. Namasthe Telangana (24 September 2022). "బతుకమ్మ పాటకు వీడియో చేయండి.. లక్ష రూపాయలు గెలుచుకోండి". Archived from the original on 26 September 2022. Retrieved 26 September 2022.