దేశపతి శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేశపతి శ్రీనివాస్
దేశపతి శ్రీనివాస్

సినివారంలో దేశపతి శ్రీనివాస్


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మార్చి 2023
నియోజకవర్గం శాసనసభ సభ్యులు కోటా

వ్యక్తిగత వివరాలు

జననం 1970
సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
తల్లిదండ్రులు కీ.శే. శ్రీ గోపాలకృష్ణ శర్మ , కీ.శే. శ్రీమతి బాలసరస్వతి
జీవిత భాగస్వామి సునీత
సంతానం సాహితీ
నివాసం హైదరాబాదు, తెలంగాణ
వృత్తి కవి, రచయిత, గాయకుడు, రాజకీయ నాయకుడు

దేశపతి శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, గాయకుడు, వక్త. సిద్థిపేట వాస్తవ్యుడైన శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ ఓఎస్డీగా వ్యవహరిస్తున్నాడు.[1] తెలంగాణ ఉద్యమంలో కీలక నేతల్లో ఒకరిగా పాల్గొన్నాడు. అనేక కార్యక్రమాల్లో పాల్గొని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం తన వాదనలు వినిపించాడు.[2][3][4] తెలంగాణ ప్రభుత్వం, తెలుగు భాషా ప్రచారంలో చురుకైన పాత్ర పోషిస్తున్నాడు.[5]

బాల్యం, కుటుంబం[మార్చు]

కీర్తిశేషులు స్వర్గీయ దేశపతి బాలసరస్వతి, గోపాలకృష్ణ శర్మ గార్ల తనయుడు శ్రీ దేశపతి శ్రీనివాస శర్మ గారు. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు, ప్రవృత్తి రీత్యా ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమం కారణంగా వెలుగులోకి వచ్చిన కవి గాయకుడు, వక్త దేశపతి శ్రీనివాస శర్మ. పేదరికంలో పుట్టి, స్వయం ప్రకాశవంతుడై. నటుడిగా, వక్తగా, వాగ్గేయకారుడిగా అంచెలంచెలుగా ఎదిగి, తెలంగాణా మలిదశ ఉద్యమంలో తన ప్రత్యేక కళారూపాలతో జనవాహినులను ఉడికించి, ఉరికించి మైమరించిన దేశపతి శ్రీనివాస్‌ తెలంగాణా రాష్ట్ర సాధనలో ప్రముఖపాత్ర పోషించాడు.[6]

జీవిత విశేషాలు[మార్చు]

ఆయన తెలంగాణ రాష్ట్రం గజ్వేలు దగ్గర మునిగడప గ్రామంలో గోపాలకృష్ణ, బాల సరస్వతి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి ఉపాధ్యాయుడు, మంచి కవి. గోపాలకృష్ణ గారు మధుశ్రీ అనే ఖండకావ్యాన్ని రాశారు.ఆయనకు తెలుగు సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో నైపుణ్యం ఉంది. వారి తాతగారు (మాతామహులు) గొప్ప సంస్కృతాంధ్ర పండితులు. వారు 'పుష్పబాణ విలాసం అనే సంస్కృత గ్రంథాన్ని తెలుగు లోకి అనువదించారు. వారి మేనమామ రామేశ్వర శర్మగారు వారు నవ్యకళాసమితి అనే ఒక నాటక సమితిని యేర్పాటు చేసి, నాటకాలు, యక్షగానాలు తన మిత్రులతో కలిసి ఆడేవారు. వారి ప్రభావం శ్రీనివాస్ పై పడింది.

వృత్తి[మార్చు]

దేశపతి శ్రీనివాస్ వృత్తి రీత్యా పాఠశాల ఉపాధ్యాయుడు. తెలంగాణా విభజన కోసం నిర్వహించే అన్ని ప్రధాన బహిరంగ సభలు, ర్యాలీలలో ఆయన పాల్గొంటారు.

మంచి వక్త[మార్చు]

తెలంగాణ ఉద్యమంలో తన ప్రత్యేకత తెలంగాణ చరిత్ర ఉపన్యాసం మాట్లాడుతూ ఆయా సందర్భోచితంగా పాటను సరి జోడి చేసేవిధానం అందరిని ఆకట్టుకునే విధానం ప్రయోగం అతన్ని మంచి వక్తగా పేరు వచ్చింది.[7] తెలంగాణ ఉద్యమం సమయంలో ఉద్యమం గురించి చర్చించడానికి టెలివిజన్ చర్చా కార్యక్రమాలకు ఆయనను తరచుగా ఆహ్వానించేవారు.[8]

రచయిత[మార్చు]

దేశపతి రాసిన సాహిత్యం సినిమాలలో కూడా ఉపయోగించబడింది. నందిని సిద్దా రెడ్డి రాసిన నాగేటి సాల్లాల నా తెలంగాణ అనే ప్రసిద్ధ తెలంగాణ పాటను పాడినందుకు ఉద్యమంలో మంచి పేరు సంపాదించుకున్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుండి 08 మార్చి 2023 వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీగా పని చేశాడు. తెలంగాణ శాసనమండలికి మార్చి 2023లో ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆయన పేరును మార్చి 7న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగా[9] ఆయన 9న నామినేషన్ దాఖలు చేశాడు.[10] 16 మార్చి నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముగియడంతో బరిలో ఎవరు లేకపోడడంతో దేశపతి శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించి ఆయనకు ధ్రువీకరణ పత్రాలు అందజేశాడు.[11] దేశపతి శ్రీనివాస్ 2023 మార్చి 31న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[12][13]

దేశపతి శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్బంగా 2023 ఏప్రిల్ 2న సిద్దిపేట పోలీసు కన్వెన్షన్‌హాల్‌లో అభినందన సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌, ఎమ్మెల్సీ ఫారూఖ్‌హుస్సేన్‌, వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ది సంస్థ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందినీ సిధారెడ్డి, మాజీ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ జి. దేవీప్రసాద్ రావు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.[14]

మూలాలు[మార్చు]

  1. KCR to pen songs for party's audio campaign The Times of India. 17 March 2009.
  2. Tough fight for Cheriyal, station Ghanpur seats The Hindu. 19 May 2008.
  3. Meet the man behind the magic of Avadhanams
  4. Telangana to make Telugu compulsory in all schools
  5. WTC will showcase the depth of Telugu, says Deshapathi Srinivas
  6. "కళామతల్లి మెచ్చిన బాసు : దేశపతి శ్రీనివాసు". Archived from the original on 2016-03-06. Retrieved 2015-08-23.
  7. https://www.youtube.com/watch?v=3qpPM8izAh8
  8. Curtains down on World Telugu Conference – The Hindu
  9. Sakshi (8 March 2023). "ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు వీరే". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
  10. Andhra Jyothy (9 March 2023). "శాసన మండలికి ఎమ్మెల్యే కోటా అభ్యర్థులుగా దేశపతి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు". Archived from the original on 10 March 2023. Retrieved 10 March 2023.
  11. Andhra Jyothy (17 March 2023). "ముగ్గురు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఏకగ్రీవం". Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  12. NTV Telugu (31 March 2023). "ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన దేశపతి, నవీన్‌కుమార్‌, చల్లా". Archived from the original on 31 March 2023.
  13. Namasthe Telangana (31 March 2023). "ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన దేశపతి, నవీన్‌ కుమార్‌, చల్లా". Retrieved 31 March 2023. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  14. Namasthe Telangana (3 April 2023). "సుపరిపాలనలో భాగస్వామ్యం కావాలి". Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.

బయటి మూలాలు[మార్చు]