కొత్త ప్రభాకర్ రెడ్డి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కొత్త ప్రభాకర్ రెడ్డి
Kotha Prabhakar Reddy.jpg
ఎంపి
పదవీ కాలం
2014–2019
నియోజకవర్గం మెదక్ లోకసభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం (1966-06-06) 6 జూన్ 1966 (వయస్సు: 51  సంవత్సరాలు)
హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
సంతానం 2
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

కొత్త ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు మరియు 16వ పార్లమెంటు సభ్యులు. 2014లో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు.[1]

జననం[మార్చు]

ప్రభాకర్ రెడ్డి 1966, జూన్ 6 న తెలంగాణ లోని హైదరాబాద్లో జన్మించారు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

ప్రముఖ పారిశ్రామికవేత్తగా పేరున్న ప్రభాకర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సన్నిహితుడు. కేపీఆర్ ట్రస్టు ద్వారా పలు సంక్షేమ పథకాలను ప్రారంభించారు.[2]

కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రి పదవిని చేపట్టడంకోసం మెదక్ లోకసభ నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికలకు టీఆర్ఎస్ పార్టీ తరపున ప్రభాకర్ రెడ్డి పోటీచేసి గెలుపొందారు. 2104 సెప్టెంబరు 13న జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి పై భారీ మెజారిటీతో గెలిచారు. 2014, నవంబరు 25న లోకసభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రభాకరరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.[3]

మూలాలు[మార్చు]

  1. తెలుగు వెబ్ దునియా. "మెదక్ ఉప ఎన్నికల్లో గెలుపు సాధారణమే : ప్రభాకర్ రెడ్డి". telugu.webdunia.com. Retrieved 13 February 2017. 
  2. మెడిన్ టిజి. "మెదక్ టీఆర్ఎస్ అభ్యర్థి ‘కొత్త’". madeintg.com. Retrieved 13 February 2017. 
  3. మేడిన్ టిజి. "లోక్ సభలో టీఆరెఎస్ కు ‘కొత్త’ ఎంపీ". madeintg.com. Retrieved 13 February 2017.