Jump to content

రఘునందన్ రావు

వికీపీడియా నుండి
రఘునందన్ రావు

పదవీ కాలం
4 జూన్ 2024 – ప్రస్తుతం
ముందు కొత్త ప్రభాకర్ రెడ్డి
నియోజకవర్గం మెదక్

ఎమ్మెల్యే
పదవీ కాలం
2020 నవంబరు - 2023 డిసెంబరు 03
ముందు సోలిపేట రామలింగారెడ్డి
తరువాత కొత్త ప్రభాకర్ రెడ్డి
నియోజకవర్గం దుబ్బాక

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు ఎం.భగవంతరావు, భారతి
జీవిత భాగస్వామి మంజుల దేవి
సంతానం సింధూ
నివాసం పటాన్‌చెరు, తెలంగాణ

మాధవేని రఘునందన్ రావు (జననం 23 మార్చి 1965)తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. తెలంగాణ రాష్ట్రం దుబ్బకా కు చెందిన ఎమ్మెల్యే (ఉప ఎన్నిక 2020 లో గెలిచింది). తెలంగాణ రాష్ట్ర భావజాలానికి ఆయన బలమైన మద్దతుదారుగా పేరుపొందాడు. వృత్తిరీత్యా న్యాయవాది. ఆయన మెదక్ జిల్లా వాసి. భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి.ప్రస్తుతం మెదక్ లోక్ సభ సభ్యుడు[1].

ప్రారంభ జీవితం - విద్య

[మార్చు]

రఘునందన్ రావు సిద్దిపేటలో ఎం.భగవంతరావు, భారతి దంపతులకు జన్మించాడు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో B.Sc, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ ఎల్ బీ, హైదరాబాద్ నుంచి బి.ఎడ్, కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మానవ హక్కులలో పీజీ, డిప్లొమా పూర్తి చేశారు.

విద్యాభ్యాసం తరువాత సిద్ధిపేట నుండి ఒక పారిశ్రామిక ప్రాంతం అయిన పటాన్ చెరువుకు 1991 లో నివాసం మార్చాడు , అక్కడ ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక వార్తా పత్రిక ఈనాడు లో అక్కడ 5 సంవత్సరాల కాలానికి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా పనిచేశాడు . అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ గా చేరాడు.

వృత్తి జీవితం

[మార్చు]

న్యాయవాదిగా కెరీర్ ను ప్రారంభించాడు. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ బెయిల్ పిటిషన్ ను హ్యాండిల్ చేయడంలో ఆయనకు పేరు వచ్చినది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

రఘునందన్ రావు మొదట తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినవాడు. [3] అతను ఏప్రిల్ 27, 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సమితితో ఉన్నాడు . [4] అతను పొలిట్‌బ్యూరో సభ్యుడు, మెదక్ జిల్లా కన్వీనర్. [5] 14 మే 2013 న తెలుగు దేశ పార్టీ పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనే ఆరోపణలపై ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ [6] నుండి సస్పెండ్ చేశారు. [7] తదనంతరం ఆయన కాంగ్రెస్ లో చేరారు కానీ ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో కొద్ది రోజులకు బీజేపీ లో చేరారు, 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలోని dubbak నియోజకవర్గం నుండి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు[8]. ఆయన తెలంగాణలోని భారతీయ జనతా పార్టీ అధికారిక ప్రతినిధి. [9] పస్తుతం 2020 నవంబరు ఏడో తేదీన జరిగే దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గా పోటీచేసారు.[10]తెలంగాణ రాష్ట్రం దుబ్బకాకు చెందిన ఎమ్మెల్యేగా (ఉప ఎన్నిక 2020 లో) 1068 ఓట్ల మెజారిటీతో విజయం సాదించారు.[11][12][13][14]

రఘునందన్ రావు 2024లో మెదక్ నియోజకవర్గం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల మెజార్టీతో లోక్‌సభ సభ్యుడిగా గెలుపొందాడు.[15]

మూలాలు

[మార్చు]
  1. "మెదక్‌లో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు ఘన విజయం | BJP MP Candidate Raghunandan Rao Won Medak Parliament Seat 2024 | Sakshi". www.sakshi.com. Retrieved 2024-06-05.
  2. "Suspended leader hits back at TRS leadership - The New Indian Express". newindianexpress.com. Archived from the original on 2016-08-16. Retrieved 2016-07-21.
  3. "Harish Rao elected union president - ANDHRA PRADESH - The Hindu". thehindu.com. Retrieved 2016-07-21.
  4. "YouTube". youtube.com. Retrieved 2016-07-21.
  5. "News Archives: The Hindu". hindu.com. Archived from the original on 2011-03-17. Retrieved 2016-07-21.
  6. "Suspended leader hits back at TRS leadership - The New Indian Express". newindianexpress.com. Archived from the original on 2016-08-16. Retrieved 2016-07-21.
  7. "YouTube". youtube.com. Retrieved 2016-07-21.
  8. "దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావు". www.andhrajyothy.com. Retrieved 2020-11-01.
  9. "Raghunandan Rao Madhavaneni". www.facebook.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-20.
  10. "BJP దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా రఘునందన్ రావు.. దశాబ్ధాల కల ఈసారైనా..!". Samayam Telugu. Retrieved 2020-11-01.
  11. HMTV (10 November 2020). "దుబ్బాకలో బీజేపీ సంచలన విజయం". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  12. ETV Bharat News (10 November 2020). "ఉత్కంఠగా సాగిన పోరులో భాజపా గెలుపు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  13. Eenadu (23 October 2023). "సిట్టింగ్‌ ఎమ్మెల్యే వైపే మొగ్గు". Archived from the original on 24 October 2023. Retrieved 24 October 2023.
  14. Eenadu (14 November 2023). "గట్టి పోటీ.. ఓటమితో సరిపెట్టి". Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  15. Andhrajyothy (5 June 2024). "గులాబీ తోటలో విరిసిన కమలం". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.