నీలం మధు
నీలం మధు | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 - ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
---|---|---|---|
జననం | 1983 చిట్కుల్ గ్రామం, పటాన్‌చెరు మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి, బహుజన్ సమాజ్ పార్టీ | ||
తల్లిదండ్రులు | నీలం నిర్మల్, రాధ | ||
జీవిత భాగస్వామి | కవిత | ||
సంతానం | 2 | ||
నివాసం | చిట్కుల్, | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
నీలం మధు ముదిరాజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]నీలం మధు తెలంగాణ మలి దశ ఉద్యమంలో పాల్గొంటూ రాజకీయాల పట్ల ఆసక్తితో 2006లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో చిట్కుల్ గ్రామ వార్దు సభ్యుడిగా ఆ తరువాత 2014లో ఉప సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఆయన 2014లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పటి టిఆర్ఎస్) తరపున జెడ్పీటిసిగా పోటీ చేసి ఓడిపోయాడు. నీలం మధు 20019లో జరిగిన పంచాయితీ ఎన్నికల్లో చిట్కుల్ గ్రామ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. నీలం మధు ఎన్ఎంఆర్ యువసేన స్థాపించి పటాన్‌చెరు నియోజకవర్గంలో వివిధ సామజిక కార్యక్రమాలు నిర్వహించి 2023లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించాడు, కానీ సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన 2023 అక్టోబర్ 16న బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు.[2][3]
నీలం మధు ఆ తరువాత అక్టోబర్ 27న ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా[4], ఆయనకు మొదట ఎమ్మెల్యే టికెట్ కేటాయించగా పటాన్‌చెరు నియోజకవర్గంలో పెద్దఎత్తున నిరసనలు రావడంతో[5] అతనికి కాకుండా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్‌గౌడ్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి నవంబర్ 10న బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు.[6] ఆయన ఆ ఎన్నికల్లో బీఎస్పీ తరపున పోటీ చేసి 46162 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు.[7] నీలం మధు 2024 ఫిబ్రవరి 13న బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేసి[8], ఫిబ్రవరి 15న హైదరాబాద్ గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీప్‌దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[9]
మూలాలు
[మార్చు]- ↑ Eenadu. "సర్పంచి నుంచి.. ఎంపీ అభ్యర్థిగా." Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
- ↑ Andhrajyothy (16 October 2023). "బీఆర్‌ఎస్‌కు పఠాన్‌చెరు నేత మధు రాజీనామా." Archived from the original on 15 February 2024. Retrieved 15 February 2024.
- ↑ Eenadu (16 October 2023). "భారాసకు నీలం మధు ముదిరాజ్ రాజీనామా". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
- ↑ Prabha News (27 October 2023). "కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
- ↑ NT News (8 November 2023). "కాంగ్రెస్‌లో… కల్లోలం". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
- ↑ Eenadu (10 November 2023). "నీలం మధు.. భారాస టు బీఎస్పీ.. వయా కాంగ్రెస్". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
- ↑ Election Commision of India (2023). "Patancheru Assembly Constituency Results 2023". Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
- ↑ 10TV Telugu (13 February 2024). "బీఎస్పీకి నీలం మధు రాజీనామా.. 15న కాంగ్రెస్‌లో చేరిక" (in Telugu). Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "కాంగ్రెస్‌లో చేరిన నీలం మధు". 15 February 2024. Archived from the original on 4 April 2024. Retrieved 4 April 2024.