గూడెం మహిపాల్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూడెం మహిపాల్‌ రెడ్డి
గూడెం మహిపాల్ రెడ్డి


పదవీ కాలం
2014–2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1963-09-19) 1963 సెప్టెంబరు 19 (వయసు 60)[1]
పటాన్‌చెరు, పటాన్‌చెరు మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి యాదమ్మ
సంతానం ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె

గూడెం మహిపాల్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[2] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున పటాన్‌చెరు శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

జననం, విద్య

[మార్చు]

మహిపాల్ రెడ్డి 1963, సెప్టెంబరు 19న సత్తిరెడ్డి, మణెమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరు మండలం, పటాన్‌చెరు గ్రామంలో జన్మించాడు. 1977లో పటాన్‌చెరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి 10వ తరగతి పూర్తిచేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మహిపాల్ రెడ్డికి యాదమ్మతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

రాజకీయ విశేషాలు

[మార్చు]

1991లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మహిపాల్ రెడ్డి 1991లో ట్రేడ్ యూనియన్ లీడర్ గా, 1995లో పటాన్‌చెరు ఎంపిటీసిగా, 2002లో మెదక్ జిల్లా ఎంపిటీసి సభ్యుల ఫోరం అధ్యక్షుడిగా పనిచేశాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన మహిపాల్ రెడ్డి 2009లో బహుజన్ సమాజ్ పార్టీలో చేరాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[3] 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి స్వప్న దేవ్ పై 18,886 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్  పై 37,699 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6] [7]

ఇతర వివరాలు

[మార్చు]

చైనా, సింగపూర్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.

మూలాలు

[మార్చు]
  1. telangana.gov.in
  2. "Member's Profile – Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-08-27.
  3. "Gudem Mahipal Reddy | MLA | TRS | Patancheru | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-15. Retrieved 2021-08-27.
  4. Sakshi (11 November 2018). "మినీ ఇండియా". Archived from the original on 1 ఆగస్టు 2021. Retrieved 2021-08-27.
  5. "Gudem Mahipal Reddy(TRS):Constituency- PATANCHERU(SANGAREDDY) – Affidavit Information of Candidate". myneta.info. Retrieved 2021-08-27.
  6. "Patancheru Assembly Election Result 2018: TRS MLA Gudem Mahipal Reddy ahead of Congress' Kata Srinivas Goud". www.timesnownews.com. Retrieved 2021-08-27.
  7. Eenadu (4 December 2023). "హ్యాట్రిక్‌ వీరులు.. హైదరాబాద్‌లో 10 మంది." Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.