నలిమెల భాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కవి, పరిశోధకుడు, బహుభాషావేత్త అయిన నలిమెల భాస్కర్ 1956లో కరీంనగర్ జిల్లా నారాయణపూర్‌లో జన్మించారు. తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి 2011లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు 14 భాషలలో పట్టుంది.[1] తెలంగాణ పదకోశాన్ని రూపొందించడమే కాకుండా పలు భారతీయ భాషల కథలను తెలుగులోకి అనువదించారు. అద్దంలో గాంధారి, మట్టిముత్యాలు, సుద్దముక్క వంటి 17 సంకలనాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం తెలంగాణ రచయితల వేదిక జాతీయ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. 2014, మార్చి 10న 2013 సంవత్సరానికిగాను అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీచే పురస్కారం ప్రకటించబడింది.[2] మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన "స్మారక శిశిగల్" నవలను నలిమెల భాస్కర్ తెలుగులో "స్మారక శిలలు" పేరిట తెలుగులోకి అనువదించారు. పి.వి.నరసింహారావు తర్వాత ఈ పురస్కారం పొందిన కరీంనగర్ జిల్లా రచయితలలో భాస్కర్ రెండో వ్యక్తి.

పురస్కారాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]