రేగులపాటి కిషన్ రావు
రేగులపాటి కిషన్ రావు | |
---|---|
జననం | రేగులపాటి కిషన్ రావు 1946 డిసెంబరు 1 |
మరణం | 2023 జనవరి 5 | (వయసు 76)
వృత్తి | కవి, నవల రచయిత, ఉపాధ్యాయుడు |
జీవిత భాగస్వామి | విజయలక్ష్మి |
రేగులపాటి కిషన్ రావు (1946, డిసెంబరు 1 - 2023, జనవరి 5) తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, నవల రచయిత, ఉపాధ్యాయుడు. సంఘసంస్కరణ అభ్యుదయ భావాలతో రచనలు చేసిన కిషన్ రావు దాదాపు 30 గ్రంథాలను వెలువరించాడు.[1]
జననం
[మార్చు]కిషన్ రావు 1946, డిసెంబరు 1న తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలంలోని చింతల్‌ఠానా లో జన్మించాడు.[2]
ఉద్యోగం
[మార్చు]1967లో బాలకొండలో ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1970 నుంచి 2004 వరకు ఉపాధ్యాయునిగా పనిచేశాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]కిషన్ రావుకు విజయలక్ష్మితో వివాహం జరిగింది. భర్త స్ఫూర్తితో విజయలక్ష్మి కూడా రచనలు చేసింది.
రచనా ప్రస్థానం
[మార్చు]1967 నుండి 1977 వరకు 22 కథలు, 3 నాటికలు రాసాడు. 1978లో ‘కుళ్లుబుద్ధి’ అనే కథ కథాంజలి మాస పత్రికలో ప్రచురింపబడింది. 4 నవలలు, 6 కథా సంకలనాలు (కథక చక్రవర్తి, సంస్కారం కథలు, ఈతరం పెళ్లికూతురు, అన్వేషణ, పరిమళించిన కవిత్వం), 13 కవిత్వ సంకలనాలు వెలువరించాడు.[1]
రచనలు
[మార్చు]నవలలు
- ఆమె వితంతువు కాదు (1976)
- పతివ్రత ఎవరు (1978)
- సంఘర్షణ (1981)
- ప్రేమకు పెళ్ళెప్పుడు (1982)
ఇతర రచనలు
మరణం
[మార్చు]2016 నుండి అనారోగ్యంతో దాదాపు మంచం పైనే ఉన్న కిషన్ రావు 2023, జనవరి 5న మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "అర్హులకే సాహితీ పురస్కారాలు అందాలి (కథా రచయత రేగులపాటి కిషన్ రావు)". www.andhrabhoomi.net. Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.
- ↑ 2.0 2.1 telugu, NT News (2023-01-06). "రేగులపాటి కిషన్‌రావు ఇక లేరు". www.ntnews.com. Archived from the original on 2023-01-06. Retrieved 2023-01-06.
- ↑ "Prahalada Natakam". Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.
- ↑ "Pragati Ratham". Archived from the original on 2023-01-05. Retrieved 2023-01-05.