శ్రీదేవి మంత్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీదేవి మంత్రి
శ్రీదేవి మంత్రి


చైర్మన్
తెలంగాణ అధికార భాషా సంఘం
పదవీ కాలం
2022 జూన్ 30 – 2024 జనవరి 2
ముందు దేవులపల్లి ప్రభాకరరావు

వ్యక్తిగత వివరాలు

జననం 1971 జనవరి 2
తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు శశిభూషణ్ రావు
సంతానం నైనీషా
నివాసం నారెపల్లి, ఘట్‌కేసర్ మండలం, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
వృత్తి రచయిత, రాజకీయ నాయకురాలు

శ్రీదేవి మంత్రి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఉద్యమకారిణి, రాజకీయ నాయకురాలు. ఆమె 2022 జూన్ 30[1] నుండి 2024 జనవరి 2 వరకు తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా విధులు నిర్వహించింది.

జననం[మార్చు]

శ్రీదేవి 1971, జనవరి 2న తెలంగాణ రాష్ట్రం, నల్లగొండలో జన్మించింది. శ్రీదేవి తండ్రిపేరు శశిభూషణ్ రావు. డిగ్రీ వరకు చదువుకుంది.[2]

రాజకీయ జీవితం[మార్చు]

శ్రీదేవి మంత్రి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసింది. ఆమె సోషల్ మీడియాలో తన రాతల ద్వారా తెలంగాణవాదాన్ని వినిపించింది. ఆమె మిలియన్ మార్చ్, సాగరహారం, రైల్ రోకో, సకలజనుల భెరీ లాంటి అనేక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం బాపూ కేసీఆర్ దళంను స్థాపించి ప్రభుత్వ పథకాలను విస్తృతంగా తన రాతల ద్వారా ప్రచారం కల్పిస్తోంది. శ్రీదేవి మంత్రి తెలంగాణ సమాజానికి అందించిన సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 2022 జూన్ 30న తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా నియమించగా,[3][4] ఆమె జులై 10న భాద్యతలు స్వీకరించగా[5], 2024 జనవరి 2న తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌ విధుల నుండి తొలగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది.[6][7]

మూలాలు[మార్చు]

  1. Namasthe Telangana (30 June 2022). "తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్‌గా శ్రీదేవి మంత్రి". Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.
  2. Disha Web (30 June 2022). "కార్పొరేషన్ చైర్మన్లుగా ఆ ముగ్గురు నియామకం". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  3. Mana Telangana (30 June 2022). "కార్పొరేషన్లుకు చైర్మన్ల నియామకం". Archived from the original on 30 June 2022. Retrieved 30 June 2022.
  4. Eenadu (1 July 2022). "అధికార భాషా సంఘం ఛైర్‌పర్సన్‌గా మంత్రి శ్రీదేవి". Archived from the original on 10 July 2022. Retrieved 10 July 2022.
  5. Namasthe Telangana (11 July 2022). "బడుగుల భాషను బతికించాలె". Archived from the original on 11 July 2022. Retrieved 11 July 2022.
  6. Andhrajyothy (3 January 2024). "అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌ ఔట్‌". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.
  7. Namaste Telangana (3 January 2024). "అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌ నియామకం రద్దు". Archived from the original on 3 January 2024. Retrieved 3 January 2024.