వంగరి నర్సయ్య
వంగరి నర్సయ్య | |
---|---|
జననం | 1920 సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ |
మరణం | జనవరి 6, 2022 సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ |
మరణ కారణం | వృద్ధాప్యం |
నివాస ప్రాంతం | సిరిసిల్ల |
వృత్తి | చేనేత కార్మికుడు |
ప్రసిద్ధి | స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ పోరాటయోధుడు |
మతం | హిందూ |
పిల్లలు | ముగ్గురు కొడుకులు, నలుగురు కూమార్తెలు |
వంగరి నర్సయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, [1] తెలంగాణ పోరాటయోధుడు. శతాధిక వృద్ధుడిగా గుర్తింపు పొందిన నర్సయ్య, సిరిసిల్ల పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడిగా 20 సంవత్సరాలపాటు తన సేవలు అందించాడు.[2]
జననం
[మార్చు]నర్సయ్య 1920లో తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల పట్టణంలో జన్మించాడు. తండ్రిపేరు లక్ష్మయ్య.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]నర్సయ్యకు నర్సవ్వతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కొడుకులు (దేవదాస్, శ్రీనివాస్, అంబదాస్), నలుగురు కుమార్తెలు ఉన్నారు.[3]
సామాజిక సేవ
[మార్చు]నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని, అనేక కార్యక్రమాలలో పాల్గొన్నాడు. ముంబై, సోలాపూర్ ప్రాంతాలలో పద్మశాలి సంఘాలు స్థాపించి, కార్మికుల సమస్యలపై పోరాటం చేశాడు. కేసీఆర్ 2008లో సిరిసిల్ల నేతకార్మికుల సంక్షేమం కోసం రూ.50లక్షల నిధిని సమకూర్చి, ఆ నిధిని పేదలకు అందించే బాధ్యతను పద్మశాలి సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడిగా వంగరి నర్సయ్యకు అప్పగించాడు. సిరిసిల్ల పద్మశాలి సమాజానికి ఐదు దశాబ్దాల పాటు సేవలు అందించిన నర్సయ్య, పేదలకు వడ్డీ లేని రుణాలు అందించి ట్రస్ట్‌ను సమర్థవంతంగా నడిపించాడు.[2] సిరిసిల్ల పట్టణంలో పద్మశాలి కళ్యాణ భవన నిర్మాణంలో కీలకపాత్ర పోషించాడు.
రాజకీయ జీవితం
[మార్చు]2009, ఏప్రిల్ 16న జరిగిన ఉమ్మడి అంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసిన నర్సయ్య[4] 1,490 ఓట్లతో పదవ స్థానంలో నిలిచాడు.[5]
మరణం
[మార్చు]102 సంవత్సరాలు జీవించిన నర్సయ్య 2022, జనవరి 6న సిరిసిల్ల పట్టణంలో మరణించాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "స్వాతంత్ర్య సమరయోధులు, జవాన్లను సన్మానించాలి". andhrajyothy. 2021-08-15. Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09.
- ↑ 2.0 2.1 2.2 "పోరాట యోధుడు వంగరి నర్సయ్య కన్నుమూత". Sakshi. 2022-01-07. Archived from the original on 2022-01-07. Retrieved 2022-01-09.
- ↑ 3.0 3.1 "Vangari Narsaiah" (PDF). www.ceotelangana.nic.in. Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; ":1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "Vangari Narsaiah(Independent(IND)):Constituency- SIRCILLA(KARIMNAGAR) - Affidavit Information of Candidate:". myneta.info. Archived from the original on 2013-10-07. Retrieved 2022-01-09.
- ↑ "IndiaVotes AC: Sircilla 2009". IndiaVotes. Archived from the original on 2022-01-09. Retrieved 2022-01-09.