అనుమాండ్ల భూమయ్య
ఆచార్య అనుమాండ్ల భూమయ్య పూర్వ ఉపకులపతి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం | |
---|---|
![]() ఆచార్య అనుమాండ్ల భూమయ్య, ఆయన స్వగృహం వద్ద | |
పుట్టిన తేదీ, స్థలం | వెదురుగట్ట, కరీంనగర్ జిల్లా, తెలంగాణ | జులై 3, 1949
వృత్తి | పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి (25.8.2008 నుండి 22.8.2011) ఇంచార్జ్ వైస్ చాన్స్‌లర్ (8.11.2010 నుండి 25.7.2011) కళాశాల అధ్యాపకులు (1973-2009) |
భాష | తెలుగు |
జాతీయత | భారతదేశం |
పౌరసత్వం | భారతదేశం |
పూర్వవిద్యార్థి | శ్రీ రాజరాజేశ్వరీ డిగ్రీ కళాశాల, జగిత్యాల |
రచనా రంగం | కవిత్వం, విమర్శ |
చురుకుగా పనిచేసిన సంవత్సరాలు | 1994-ప్రస్తుతం |
కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసరుగా పనిచేసి, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా పదవీ విరమణ చేసిన అనుమాండ్ల భూమయ్య (జ: 1949 జూలై 3) సుప్రసిద్ధ పద్య కవి. పద్యాన్ని పాటలాగ పాడి, విద్యార్థులు పద్యాన్ని ప్రేమించేట్టు చేయగలిగిన ఆచార్యులు.
బాల్యం, విద్యాభ్యాసం[మార్చు]
అనుమాండ్ల భూమయ్య కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలం, వెదురుగట్టు గ్రామంలో జన్మించాడు[1]. తల్లిపేరు శాంతమ్మ. తండ్రి లక్ష్మయ్య. నలుగురు మగసంతానంలో ఇతడు మూడోవాడు. ఇతని నాన్న ఓ వైపు వ్యవసాయం చూసుకుంటూనే మరోవైపు నేత పని చేసేవాడు. చొప్పదండి జడ్పీ స్కూలులో ప్రాథమిక విద్య చదివాడు. 15వ సంవత్సరంలో ఇతనికి అనంతలక్ష్మితో వివాహం జరిగింది. కరీంనగర్‌లో పి.యు.సి. చదివి బి.ఎస్సీ కోసం జగిత్యాల కాలేజీలో చేరాడు. అక్కడ ప్రసిద్ధ సాహితీవేత్త కోవెల సంపత్కుమారాచార్యులు ద్వారా నాకు తెలుగు సాహిత్యంపై ఆసక్తి కలిగి సాహిత్యగ్రంథాలు చదివాడు. బి.ఎస్సీ తరువాత నేను ఉస్మానియా యూనివర్శిటీలో ఎం.ఎ తెలుగు చదివాడు. అక్కడ దివాకర్ల వెంకటావధాని, సి.నారాయణరెడ్డి ఇతని గురువులు.
ఉద్యోగం[మార్చు]
ఎం.ఎ అయిపోగానే వరంగల్‌లోని ఎల్.బి.కాలేజీలో తెలుగు జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగం ప్రారంభించాడు. మరోవైపు ఎం.ఫిల్ పూర్తిచేశాడు. 1980లో కాకతీయ యూనివర్శిటీలో పి.హెచ్.డి.పూర్తిచేశాను. 1983లో అదే యూనివర్శిటీలో రీడర్‌గా, ఆ తర్వాత ప్రొఫెసర్‌గా పనిచేశాడు. కాకతీయ విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగానికి అధిపతిగా పనిచేసి అటుపిమ్మట తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా పనిచేశాడు.
రచనలు[మార్చు]
రచయితగా 27 గ్రంథాలను వెలువరించాడు. ఇందులో కవిత్వం 10, విమర్శ 17 ఉన్నాయి.
కవితా గ్రంథాలు[మార్చు]
- వేయినదుల వెలుగు - 1994
- వెలుగు నగల హంస - 1995
- అగ్నివృక్షము - 1996
- జ్వలిత కౌసల్య - 1999
- చలువ పందిరి - 1999
- ఆనందగీతి - 2004
- శివానందగీతి - 2005
- అష్టావక్రగీత (పద్యానువాదం) - 2006
- శాంతిగర్భ - 2009
- సౌందర్యలహరి గీతాలు (గేయానువాదం) - 2013
వెలుగు నగల హంస, శాంతిగర్భ, అగ్నివృక్షము, జ్వలిత కౌసల్య గ్రంథాలు ఆంగ్లం లోనికి అనువాదమయ్యాయి. 2004 లో అప్పటివరకూ వచ్చిన వేయినదుల వెలుగు, వెలుగు నగల హంస, అగ్నివృక్షము, జ్వలిత కౌసల్య, చలువపందిరి - ఈ ఐదు కవితలు కలిపి పంచవటి అనే కవితా సంకలనంగా ప్రచురితమయింది.
విమర్శ గ్రంథాలు[మార్చు]
- కొరవి గోపరాజు సాహిత్య వ్విశ్లేషణ (రచన : 1976) - 1983
- నాయని సుబ్బారావు కృతులు : పరిశీలన - 1981
- 'వేయిపడగలు' ఆధునిక ఇతిహాసం - 1984
- వ్యాస భారతి - 1988
- ఆద్యుడు కట్టమంచి - 1992
- 'మాలపల్లి' అభ్యుదయ మహాకావ్యం - 1992
- వ్యాసభూమి - 1998
- నాయనితో కాసేపు - 2000
- ఆధునిక కవిత్వంలో దాంపత్యం - 2000
- కర్పూర వసంతరాయలు : కథా కళా ఝంకృతులు - 2000
- తెలంగాణ భావ విపంచిక : 'గోలకొండ కవుల సంచిక' - 2000
- తెలంగాణ చైతన్య స్ఫూర్తి : 'ప్రజల మనిషి' - 2004
- అంతర్వీక్షణం - 2004
- 'ఆంధ్ర పురాణం' : భారతీయ సంస్కృతి వైభవం - 2005
- నాయని సుబ్బారావు - 2009
- వేమన అనుభవసారం - 2012
- సౌందర్యలహరి : భావమకరందం - 2013
- వివిధ పత్రికల్లో ప్రచురించబడిన పరిశోధన వ్యాసాలు : 60
- రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని సమర్పించిన పరిశోధనా పత్రాలు : 34
పురస్కారాలు[మార్చు]
- వేయి నదుల వెలుగు పద్యకావ్యానికి ఉత్తమ పద్యకావ్యంగా గరికపాటి సాహిత్యపురస్కారం
- వేయి నదుల వెలుగు పద్యకావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు.
మూలాలు[మార్చు]
- All articles with dead external links
- Articles with dead external links from మే 2020
- Articles with permanently dead external links
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- తెలుగు కవులు
- తెలుగు రచయితలు
- కరీంనగర్ జిల్లా రచయితలు
- కరీంనగర్ జిల్లా కవులు
- కరీంనగర్ జిల్లా ప్రవచనకర్తలు
- కరీంనగర్ జిల్లా ఉపాధ్యాయులు
- 1949 జననాలు