Jump to content

దేవరకొండ విఠల్ రావు

వికీపీడియా నుండి
దేవరకొండ విఠల్ రావు
దేవరకొండ విఠల్ రావు

దేవరకొండ విఠల్ రావు


ముందు జితేందర్ రెడ్డి
తరువాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు
నియోజకవర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1947-11-14)1947 నవంబరు 14
లగ్‌చర్ల, బొంరాస్‌పేట్ మండలం, వికారాబాదు జిల్లా, తెలంగాణ
మరణం 2016 మే 28(2016-05-28) (వయసు 68)
హైదరాబాదు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి డి.నిర్మల
సంతానం 2 కుమారులు, 2 కుమార్తెలు
September 26, 2006నాటికి మూలం లోక్‌సభ వెబ్సైటు

దేవరకొండ విఠల్ రావు ( నవంబర్ 14, 1947 - మే 5, 2016) భారత పార్లమెంటు సభ్యుడు. ఇతడు 14వ లోక్‌సభకు మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.[1] వీరి కుటుంబం డి.వి.ఆర్. ఇంజనీరింగ్ కళాశాల స్థాపించారు.

జననం, విద్య

[మార్చు]

విఠల్ రావు 1947 నవంబరు 14న సాయప్ప - తిమ్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, బొంరాస్‌పేట్ మండలం లగ్‌చర్ల గ్రామంలో జన్మించాడు.[2] ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ, ఎల్.ఎల్.బి. చదివాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

విఠల్ రావుకు 1971, జూలైం 7న నిర్మలతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజకీయ జీవితం

[మార్చు]

విఠల్ రావు 20 యేళ్ల పాటు గాంధీభవన్ లో ఉంటూ పీ.సీ సీ కోశాధికారిగా పనిచేసారు. 2004లో జరిగిన 14వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీచేసి తెలుగు దేశం పార్టీ అభ్యర్థి ఎల్కోటి ఎల్లిరెడ్డిపై 47,907 ఓట్ల మెజారిగీతో గెలుపొందారు.[3] నాటి ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరారెడ్డికి సన్నిహితంగా మెలిగారు. ఎం.పి.ల ఫోరం కన్వీనరుగా పనిచేసారు. ఎంపీగా పనిచేసిన కాలంలోనే అప్పన్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. మహబూబ్‌నగర్ లో కొన్నేళ్లుగా మూతపడ్డ బోయపల్లి రైల్వే గేటును సొంతనిధులతో ప్రారంభించేందుకు కృషి చేశారు. పద్మశాలి సంఘం రాష్ట్రనేతగా పనిచేసి సంఘం బలోపేతానికి కృషిచేశారు.

2008లో జరిగిన 15వ లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నుంచి పోటీచేసి ప్రస్తుత సీఎం కేసీఆర్ చేతిలో 18 వేల ఓట్లతో ఓడిపోయారు. 2014లో కోడంగల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయాక జిల్లాకు రాకపోకలు తగ్గించారు. హైదరాబాద్ శివారులో డీవీఆర్ పేరుతో విద్యా సంస్థలు నడిపాడు.[4]

నిర్వర్తించిన పదవులు

[మార్చు]
  • పట్టణాభివృద్ధి కమిటీ సభ్యుడు
  • ప్రత్యేకాధికారాల కమిటీ సభ్యుడు
  • అంచనాలపై ఆర్థిక కమిటీ సభ్యుడు
  • 7 సార్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్
  • ట్రేడ్ యూనియన్ కార్యకర్త

మరణం

[మార్చు]

విఠల్ రావు ఊపిరితిత్తుల వ్యాధి కారణంగా తన 60వ యేట 2016, మే 28న కన్నుమూసారు.[5]

మూలాలు

[మార్చు]
  1. "Mahbubnagar Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Archived from the original on 2021-11-04. Retrieved 2021-12-16.
  2. "Members : Lok Sabha (Rao, Shri Devarakonda Vittal)". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-16. Retrieved 2021-12-16.
  3. "Fourteenth Lok Sabha State wise Details Andhra Pradesh". loksabhaph.nic.in. Archived from the original on 2021-01-27. Retrieved 2021-12-16.
  4. ఆంధ్రజ్యోతి, తెలంగాణ, తే.29.5.2016, విఠల్ రావు మృతి.
  5. విఠల్ రావు మృతి[permanent dead link]

బయటి లింకులు

[మార్చు]