జితేందర్ రెడ్డి
Jump to navigation
Jump to search
జితేందర్ రెడ్డి | |||
![]()
| |||
పదవీ కాలము సెప్టెంబర్ 1, 2014 – 2019 | |||
నియోజకవర్గము | మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | నాగర్ కర్నూల్, తెలంగాణ, భారతదేశం | 26 జూన్ 1954||
రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | రాజేశ్వరి రెడ్డి | ||
సంతానము | ముగ్గురు | ||
నివాసము | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | ఉస్మానియా విశ్వవిద్యాలయం | ||
వృత్తి | వ్యాపారవేత్త | ||
డిసెంబర్ 17, 2016నాటికి | మూలం | [1] |
జితేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు. 2014లో 16వ పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర సమితి తరపున మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించాడు.[1]
జననం[మార్చు]
1954, జూన్ 26న రామచంద్రారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని నాగర్ కర్నూల్ లో జన్మించాడు.
విద్యాభ్యాసం[మార్చు]
హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.కాం చదివాడు.
వివాహం[మార్చు]
1981, డిసెంబరు 19న రాజేశ్వరి రెడ్డితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు.
రాజకీయ జీవితం[మార్చు]
- వ్యాపార రంగంలో విజయం సాధించిన జితేందర్ రెడ్డి 1999లో రాజకీయాల్లోకి ప్రవేశించి 13వ లోకసభకు ఎన్నికయ్యాడు
- 1999-2000 మధ్యకాలంలో
- 2010లో తెలంగాణ రాష్ట్ర సమితి పొలిట్ బ్యూరో సభ్యులు నియమించబడ్డాడు
- 2014, మేలో 16 వ లోకసభకు ఎన్నికయ్యాడు
- 2014, జూన్ 13 నుండి సభా కార్యక్రమాల సలహా సంఘం సభ్యులుగా ఉన్నాడు
- 2014, సెప్టెంబరు 15న పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఫుడ్ మేనేజ్మెంట్ జాయింట్ కమిటీ చైర పర్సన్ నియమించబడ్డాడు
- పార్లమెంట్ లోకల్ ఏరియా డెవెలప్మెంట్ పథకాల కమిటీ సభ్యులుగా ఉన్నాడు
- 2014, సెప్టెంబరు 19 నుండి స్టాండింగ్ రక్షణ కమిటీ సభ్యులుగా నియమించబడ్డాడు
- సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులుగా ఉన్నాడు
- 2015, జనవరి 29 నుండి జనరల్ పర్పసెస్ కమిటీ సభ్యులుగా ఉన్నాడు
- 2016, జూన్ 2 రక్షణ స్టాండింగ్ కమిటీ సబ్ కమిటీ సభ్యులుగా నియమించబడ్డాడు
ఇతర వివరాలు[మార్చు]
- 1976-1995 మధ్యకాలంలో మస్కట్ (ఒమన్) లోని షాపూర్జీ పల్లోంజికన్స్ట్రక్షన్ కంపెనీలో అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ గా పనిచేశాడు
- మస్కట్ (ఒమన్) లోని నేషనల్ ట్రేడింగ్ కంపెనీలో భాగస్వామిగా ఉన్నాడు
- గత 22 సంవత్సరాలుగా నాన్-రెసిడెంట్ ఇండియన్ గా ఉన్నాడు.
- 1999 వరకు ఎన్నారైగా ఉండి, 1999 లో ఎన్నారై ఎంపీగా ఎన్నికయ్యాడు
మూలాలు[మార్చు]
- ↑ Parliament of India LOK SABHA HOUSE OF THE PEOPLE. "Sixteenth Lok Sabha Members Bioprofile". 164.100.47.194/Loksabha. Retrieved 2 March 2017. CS1 maint: discouraged parameter (link)
ఇతర లంకెలు[మార్చు]
వర్గాలు:
- CS1 maint: discouraged parameter
- All articles with dead external links
- Articles with dead external links from ఫిబ్రవరి 2020
- Articles with permanently dead external links
- జీవిస్తున్న ప్రజలు
- 1954 జననాలు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- నాగర్కర్నూల్ జిల్లా రాజకీయ నాయకులు
- మహబూబ్ నగర్ జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు