రోషం బాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోషం బాలు
Rosham Balu.jpg
రోషం బాలు
జననంపెండెం బాలకృష్ణ
జూలై 6, 1977
బండ లింగాపూర్
నివాసంహైదరాబాద్
వృత్తిసినీనటుడు
ప్రసిద్ధులుసినీనటుడు
స్వస్థలంబండ లింగాపూర్ గ్రామం, జగిత్యాల జిల్లా, తెలంగాణ
జీవిత భాగస్వామిపెండెం సంధ్య
పిల్లలుపెండెం శ్రీ గణేష్ చంద్రశేఖర్ రావు
తల్లిదండ్రులు
 • పెండెం లక్ష్మినారాయణ (తండ్రి)
 • కీ.శే.పెండెం లక్ష్మి (తల్లి)

రోషం బాలు తెలుగు సినిమా నటుడు.[1] రోషం చిత్రం ద్వారా హీరోగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

రోషం బాలు 1977, జూలై 6న జగిత్యాల జిల్లా, బండలింగాపూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి పెండెం లక్ష్మినారాయణ, తల్లి పెండెం లక్ష్మి. రోషం బాలుకు 2012, నవంబర్ 30న సంధ్యతో వివాహం జరిగింది. వారికీ ఒక కొడుకు పెండెం శ్రీ గణేష్ చంద్రశేఖర్ రావు.

విద్యాబ్యాసం[మార్చు]

బండలింగాపూర్, జగిత్యాలలో ఉన్నత విద్య పూర్తిచేసిన బాలు, మెట్‌పల్లిలోని కనక సోమేశ్వర జూనియర్ కళాశాలో ఇంటర్మీడియట్, సాయి ఐ.టి.ఐ. కళాశాలలో ఎలక్ట్రికల్ డిప్లొమా చదివాడు. హైదరాబాదులోని నోబెల్ డిగ్రీ కళాశాలో డిగ్రీ, ఎన్.ఎం.డి.సి. ఎడ్యుకేషనల్ కళాశాలో బీఈడీ పూర్తి చేశాడు. ఐ.ఏ.ఎస్.ఈ. డీమ్డ్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పట్టా పొందాడు.

సినిమారంగం[మార్చు]

సినిమారంగంపై మక్కువతో 2004లో హైదరాబాదుకు వచ్చిన బాలు సాయి కిరణ్ హీరోగా నటించిన 'మానస' సినిమాలో తొలిసారిగా నటించాడు. తరువాత సక్సెస్, ప్రామిస్, ధడాల్, ఇటు ఒక అమ్మాయి ఒక అబ్బాయి, రెడ్, కమలతో నా ప్రయాణం, దక్షిణ మధ్య రైల్వే జట్టు, బిక్కు రాథోడ్, జై బోలో తెలంగాణా, జై తెలంగాణ, నివురు, పరిత్యాగి, బి.హౌస్, బాక్స్, బందూక్, జననేత చిత్రాల్లో క్యారెక్టర్ నటుడిగా నటించాడు. సాయి గీత ఫిలిమ్స్ పతాకంపై 2007లో బాలు హీరోగా, నిర్మాతగా 'రోషం' అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ తరువాత కొన్ని చిత్రాలలో ప్రధాన పాత్రలను పోషించాడు.

తెలంగాణ ఉద్యమం[మార్చు]

తెలుగు చిత్రసీమలో తెలంగాణ వారికి జరుగుతున్న వివక్ష పట్ల గొంతెత్తి, టిఆర్ఎస్ అధినేత పిలుపునందుకొని తెలంగాణ ఫిలిం జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమంలో సినీరంగం నుండి పాల్గొన్నాడు. తన సినీ ఆకాంక్షను పక్కకు పెట్టి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్ని తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పోరాడాడు. తెలంగాణ పొలిటికల్ జేఏసీలో స్టీరింగ్ కమిటీ సభ్యుడిగా క్రియాశీలకంగా పాల్గొన్నాడు. మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్, సకలజనుల సమ్మె, ఉస్మానియా యూనివర్సిటీ లో విద్యార్థి గర్జన, సంసద్ యాత్ర, వంటావార్పు లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

నటించిన చిత్రాలు[మార్చు]

 1. రోషం
 2. నరకంలో జై తెలంగాణ
 3. జననేత[3]
 4. ఫిబ్రవరి 14
 5. మునుము[4]
 6. బందూక్

మూలాలు[మార్చు]

 1. సాక్షి, సినిమా (14 May 2014). "దెయ్యాలపై పరిశోధన". Sakshi. మూలం నుండి 11 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 11 September 2019.
 2. Telugu One, Rosham Movie Hero Balu Guest Hour (Mar 1, 2010). "Interview With Rosham Movie Hero Balu" (ఆంగ్లం లో). మూలం నుండి 3 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 3 September 2019. Cite news requires |newspaper= (help)
 3. నమస్తే తెలంగాణ (July 6, 2017). "జననేత విజయగాథ - NTNEWS". web.archive.org. మూలం నుండి 4 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 4 September 2019.
 4. ఆంధ్రప్రభ, సినిమా (June 3, 2016). "సందేశాత్మక 'మునుము'". మూలం నుండి 11 సెప్టెంబర్ 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 11 September 2019. Cite news requires |newspaper= (help)

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రోషం_బాలు&oldid=2833204" నుండి వెలికితీశారు