నల్లి కుప్పుస్వామి చెట్టి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్లి కుప్పుస్వామి చెట్టి
జననం1940, నవంబరు 9
వృత్తివస్త్ర పారిశ్రామికవేత్త
నల్లి సిల్క్స్‌
పిల్లలురామనాథన్ నల్లి, విశ్వనాథన్ నల్లి, గీతాదేవి, జయశ్రీ

నల్లి కుప్పుస్వామి చెట్టి తమిళనాడుకు చెందిన వస్త్ర పారిశ్రామికవేత్త. కళలు, సంస్కృతి, విద్య కోసం అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. 2003లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడు.[1]

జననం

[మార్చు]

నల్లి కుప్పుస్వామి చెట్టి 1940, నవంబరు 9న తమిళనాడు రాష్ట్రం, కాంచీపురంలోని పద్మశాలి కుటుంబంలో జన్మించాడు.[2] రామకృష్ణ మిషన్ పాఠశాలలో చదువుకున్నాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి తన బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సును చదివాడు.[3]

వ్యాపారరంగం

[మార్చు]

1958లో తన తాత నల్లి చిన్నసామి చెట్టి మరణించిన తర్వాత, ఇతను కుటుంబ వ్యాపార ట్రేడ్‌మార్క్ అయిన నల్లి సిల్క్స్‌ను వారసత్వంగా పొందాడు. ఇతను వెట్రిక్కు మూండ్రే పడిగల్, నీది నూల్గలిల్ నిర్వగం, పడగచేరి మహన్ అనే మూడు తమిళ పుస్తకాలను రచించాడు.[4]

సంస్థలు, అనుబంధాలు

[మార్చు]

శ్రీకృష్ణ గానసభ,[5] శ్రీ పార్థసారథి స్వామి సభ, బ్రహ్మ గానసభ, శ్రీ భైరవి గానసభ, ముద్ర, మైలాపూర్ ఫైన్ ఆర్ట్స్ క్లబ్, చెన్నై కల్చరల్ అకాడమీకి అధ్యక్షుడిగా... మద్రాస్ ఫిల్మ్ సొసైటీ, మైలాపూర్ అకాడమీకి ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు.[6] తమిళ్ ఛాంబరు ఆఫ్ కామర్స్ పోషకుడిగా కూడా ఉన్నాడు.[7] ఇండో ఆస్ట్రేలియన్ ఛాంబర్, ఇండో-జపాన్ ఛాంబరు వంటి ఇతర ఛాంబర్లలో కూడా సభ్యుడిగా ఉన్నాడు.తమిళ విశ్వవిద్యాలయం, తంజావూరు ప్లానింగ్ బోర్డు సభ్యుడు, సెనేట్ సభ్యుడు, భారతియార్ విశ్వవిద్యాలయం సభ్యుడు, సెంట్రల్ సిల్క్ బోర్డ్ సభ్యుడు, సౌత్ జోన్ కల్చరల్ సెంటర్ (చెన్నై), మద్రాస్ ప్రోగ్రెస్ యూనియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ పోషకుడిగా ఉన్నాడు.

అవార్డులు, ప్రశంసలు

[మార్చు]
సంవత్సరం అవార్డులు, గౌరవాలు ప్రదానం చేసిన సంస్థ
2006 యజమాని-ఉద్యోగి రిలేషన్షిప్ అవార్డు రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్[8]
2003 పద్మశ్రీ[1] భారత ప్రభుత్వం
2000 కలైమామణి తమిళనాడు ప్రభుత్వం[9]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. 2015. Archived from the original (PDF) on 2015-10-15. Retrieved 2023-07-28.
  2. "The 'soft' corner for silks". Business Line (in ఇంగ్లీష్). 20 March 2000. Retrieved 2023-07-28. Born into the Padmasaliyar weaving community, which has a hoary tradition going back to the Chola period, Nalli Kuppusami Chettiar is proud of his lineage.
  3. Kannan, Swetha (19 October 2011). "Going faster on the silk route". The Hindu Business Line. Retrieved 2023-07-28.
  4. Krishna, M-Balamurali (12 November 2012). "From textile magnate to writer". The New Indian Express. Retrieved 2023-07-28.
  5. "December season, a hallmark of Chennai". The Hindu. 2008-12-13. Archived from the original on 16 December 2008. Retrieved 2023-07-28.
  6. "Profile of Dr. Nalli Kuppuswami Chetti". samudhra. Archived from the original on 24 అక్టోబరు 2013. Retrieved 28 July 2013.
  7. "Members". Tamil Chamber. Archived from the original on 2021-05-15. Retrieved 2023-07-28.
  8. "Rotary honours Nalli Kuppuswamy Chetty". The Hindu. 2006-05-17. Archived from the original on 6 June 2008. Retrieved 2023-07-28.
  9. "Kalaimamani awards: CM refutes criticism". The Hindu. 2000-11-26. Archived from the original on 17 August 2002. Retrieved 2023-07-28.