వంగరి త్రివేణి
వంగరి త్రివేణి | |
---|---|
జననం | లాల్ గడి మలక్‌పేట్, శామీర్ పేట మండలం, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా, తెలంగాణ, | 1976 ఆగస్టు 6
నివాస ప్రాంతం | నిజామాబాద్, తెలంగాణ |
వృత్తి | అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం |
మతం | హిందూ |
భార్య / భర్త | నరసింహ గంజి |
పిల్లలు | విజ్ఞాన్, విశ్వ శ్రీ |
తండ్రి | నారాయణ |
తల్లి | లక్ష్మీనర్సమ్మ |
డాక్టర్ వంగరి త్రివేణి, తెలంగాణకు చెందిన రచయిత్రి, కవయిత్రి. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని తెలుగు అధ్యయనశాఖలో అసోసియేట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన 25 సం. బోధనానుభవంలో అనియత విద్యాబోధకురాలిగా, గ్రేడ్ II & గ్రేడ్ I తెలుగు పండిట్ (స్కూల్ అసిస్టెంట్ తెలుగు) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా కూడా పనిచేశారు. తెలుగు అధ్యయనశాఖకు విభాగాధిపతిగా, పాఠ్యప్రణాళికా సంఘ చైర్మన్ గా వ్యవహరించారు. ప్రజాసంబంధాల అధికారిగా, సాంస్కృతిక కార్యక్రమాల కో-ఆర్డినేటర్ గా, యువజన సంక్షేమ అధికారిగా, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, గ్రంథాలయ నిర్వహణా అధికారిగా, బాలికల వసతి గృహ ముఖ్య వార్డెన్ గా పాలనాపర పదవులు నిర్వర్తించారు.[1]
జననం, విద్య
[మార్చు]త్రివేణి 1976, ఆగస్టు 6న తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా, శామీర్ పేట మండలంలోని లాల్ గడి మలక్‌పేట్లో జన్మించారు. తెలుగులో ఎం.ఎ, ఎం.ఫిల్, పిహెచ్.డి., సంస్కృతంలో ఎం.ఎ., ఆంగ్లంలో ఎం.ఎ. పూర్తిచేసిన త్రివేణి యూజీసి నుండి నెట్ & జెఆర్ఎఫ్ లతోపాటు ఎస్ఆర్ఎఫ్ కూడా సాధించి., తెలుగు పండితశిక్షణ పొందారు.
రచనలు
[మార్చు]ప్రచురణలు: మొత్తం 40
వ్యాస సంపుటాలు
- పుప్పొడి (సాహిత్య వ్యాసాలు) - 2015
- పుత్తడి (సాహిత్య వ్యాసాలు) - 2015
- బవంతి (సాహిత్య వ్యాసాలు) - 2015
- బరంతి (సాహిత్య వ్యాసాలు) - 2015
- పొత్తిలి (సాహిత్య వ్యాసాలు) - 2015
- భాషిక (సాహిత్య వ్యాసాలు) - 2015
- అలుగు (సాహిత్య వ్యాసాలు) -2019
- అరుగు (సాహిత్య వ్యాసాలు) - 2020
- బటువు (సాహిత్య వ్యాసాలు) - 2021
- భరిణ (సాహిత్య వ్యాసాలు) - 2021[2]
సిద్ధాంత గ్రంథాలు
- ముదిగంటి సుజాతారెడ్డి రచనలు- సమగ్ర పరిశీలన – 2010 (పిహెచ్.డి. సిద్ధాంత గ్రంథం)[3]
- చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి కవిత్వ పరిశీలన -2006 (ఎం.ఫిల్. సిద్ధాంత గ్రంథం)
మోనోగ్రాఫ్స్
- పొట్లపల్లి రామారావు (ప్రపంచ తెలుగు మహాసభలు - 2017) - తెలుగు అకాడమీ
- వంగరి నరసింహార్య (ప్రపంచ తెలుగు మహాసభలు - 2017) - తెలుగు అకాడమీ
కవితా సంపుటి
- తూనీగలు (నానీలు) - 2006
జీవిత చరిత్ర
- అచల పరిపూర్ణయోగి శ్రీ నారసింహార్య (జీవిత చరిత్ర) - 2007
సాహిత్య చరిత్ర
- నిజామాబాద్ జిల్లా సాహిత్య చరిత్ర, తెలంగాణ సాహిత్య అకాడమీ - 2019
అనువాదాలు
- చిన్నారి సూర్యుడు - 2012 హిందీ మూలం : నహే సూరజ్ (జస్వంత్ సింగ్ బిర్జి)
- చిన్నా కష్టాలు - 2013 ఆంగ్ల మూలం : చోటూస్ అడ్వెంచర్స్ (కుంకుం సొమాని)
పరిష్కరణలు
- శ్రీ వామన చరిత్రము (చిరుతల నాటకము) - 2007
- శ్రీ మార్కండేయ విలాసము - ఉత్తరభాగము (హరికథ) - 2007
- శ్రీ రామలింగేశ్వర శతకము - 2007
- భక్తితత్త్వ సంకీర్తనలు - 2007
సంపాదకత్వం
- శ్రీరామ భక్తి శతకము - 2012
- శ్రీకృష్ణ భక్తి శతకము - 2012
- బ్రహ్మసారము - 2013
- భక్తితత్త్వ కీర్తనలు - 2013
- శిష్యరత్నాకర శతకము - 2014
- జీవామృత శతకము - 2014
- శ్రీ రుక్మిణీ పాండురంగ శతకము - 2022
- భక్తామృత శతకము - 2022
- రాఘవేంద్ర శతకము - 2022
- శ్రీ రంగ శతకము - 2022
సహ సంపాదకత్వం
- ప్రత్యేక సంచిక, నిజామాబాదు-2012 (నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు, ఆంధ్రప్రదేశ్)
- ప్రత్యేక సంచిక, నిజామాబాద్ - 2017 (ప్రపంచ తెలుగు మహాసభలు, తెలంగాణ రాష్ట్రం)
- 'తెలంగాణ తెలుగు' సాహిత్య సంచిక - 2013
- 'తెలంగాణ తెలుగు' సాహిత్య సంచిక 2014
- 'తెలంగాణ తెలుగు' సాహిత్య సంచిక 2015
- సహిత (అధ్యాపకుల కవితా సంకలనం) - 2018
- ఇందూరు ఆణిముత్యాలు (ప్రత్యేక సంచిక) - 2021
పరిశోధక పత్ర సమర్పణలు
జాతీయ - అంతార్జాతీయ - ప్రాంతీయ / రాష్ట్రీయ సాహిత్య సదస్సులలో 100కు పైగా పరిశోధక పత్రాలను సమర్పణ చేశారు.
పరిశోధక వ్యాస ప్రచురణలు
తెలుగు అకాడమి 'తెలుగు' వైజ్ఞానిక మాసపత్రిక, తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య సంచిక వాఙ్మయి', సి.పి. బ్రౌన్ అకాడమీ 'సాహితీ స్రవంతి', మిసిమి, మూసీ, భూమిక, చినుకు, మంజీర వంటి సాహిత్య పత్రికలలో వివిధ దినపత్రికలు, ఆదివారం అనుబంధాలలో, ఆయా సదస్సు సావనీర్లలో 100కు పైగా వ్యాస ప్రచురణలు చేశారు.
- జాతి సమైక్యత చిహ్నం, నమస్తే తెలంగాణ, జనవరి 2023[4]
సన్మానాలు, పురస్కారాలు
[మార్చు]- రాష్ట్రపతి పురస్కారం 'మహర్షి బాదరాయణ వ్యాస సమ్మాన్ - 2019' యువ పరిశోధక ప్రోత్సాహ పురస్కారం, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి సంస్థ, భారతదేశ ప్రభుత్వం, న్యూఢిల్లీ, 15 ఆగస్టు 2019, నగదు పురస్కారం రూ 1,00,000/-[5]
- అమృతలత అపురూప అవార్డు 2021[6]
మూలాలు
[మార్చు]- ↑ telugu, NT News (8 March 2022). "ఒడిదుడుకులను ఎదుర్కొని…". www.ntnews.com. Archived from the original on 2023-02-12. Retrieved 20 February 2023.
- ↑ "ఆదివారం మూడు పుస్తకాల ఆవిష్కరణ". Telangana Live. 25 November 2022. Archived from the original on 2023-02-12. Retrieved 20 February 2023.
- ↑ "ఆకాశంలో విభజన రేఖల్లేవు : రాగిణి, నవత". Asianet News Network Pvt Ltd. 2021-01-23. Archived from the original on 2021-06-19. Retrieved 20 February 2023.
- ↑ telugu, NT News (8 January 2023). "జాతి సమైక్యత చిహ్నం". www.ntnews.com. Archived from the original on 8 January 2023. Retrieved 20 February 2023.
- ↑ "డాక్టర్ త్రివేణికి మహర్షి బాదరాయణ వ్యాస్ సమ్మాన్ పురస్కారం". Andhrajyothy Telugu News. 9 December 2020. Archived from the original on 2023-02-12. Retrieved 20 February 2023.
- ↑ "డాక్టర్ వంగరి త్రివేణికి అపురుప అవార్డు ప్రదానం". NavaTelangana. Archived from the original on 20 February 2023. Retrieved 20 February 2023.