పెండెం జగదీశ్వర్
స్వరూపం
పెండెం జగదీశ్వర్ | |
---|---|
జననం | జూన్ 28, 1976 కొమ్మాయిగూడెం గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా, తెలంగాణ |
మరణం | 2018 జూలై 17 చిట్యాల | (వయసు 42)
మరణ కారణం | ఆత్మహత్య |
నివాస ప్రాంతం | 8-21/13, క్రిస్టియన్ కాలనీ, రామన్నపేట గ్రామం & మండలం, యాదాద్రి - భువనగిరి జిల్లా , తెలంగాణ 508113 |
వృత్తి | తెలుగు ఉపాధ్యాయులు |
మతం | హిందూ |
భార్య / భర్త | రాణీ సుధ |
పిల్లలు | హరిచందన, వికాస్‌తేజ |
తండ్రి | నరసింహ |
తల్లి | సత్తమ్మ |
పెండెం జగదీశ్వర్ (జూన్ 28, 1976 - జూలై 17, 2018) బాలల కథా రచయిత, కార్టూనిస్టు, తెలుగు ఉపాధ్యాయుడు. బాల సాహితీరత్నగా పేరుపొందడమేకాకుండా 2005లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం అందుకున్నాడు.[1][2]
జననం
[మార్చు]జగదీశ్వర్ 1976 జూన్ 28న చేనేత కుంటుబానికి చెందిన నరసింహ, సత్తమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి - భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం కొమ్మాయిగూడెం గ్రామంలో జన్మించాడు.
రచనా ప్రస్థానం
[మార్చు]1994 నుండి రచనలు చేస్తున్న జగదీశ్వర్ అనేక కథలు వ్యాసాలు రాశాడు. వాటిని పుస్తకాలుగా ప్రచురించాడు.
పుస్తకాలు
[మార్చు]- ఆనంద వృక్షం (పర్యావరణ కథల సంపుటి)
- పసిడిమొగ్గలు
- ఉపాయం
- గజ్జలదెయ్యం
- బాలల కథలు
- విడ్డూరాల బుడ్డోడు
- నూటపదహారు నవ్వులు
- తానుతీసినగోతిలో
- ముగ్గురు అవివేకులు
- విముక్తి
- ఆంధ్రప్రదేశ్ జానపదకథలు
- బడి పిలగాల్ల కతలు
- మాతో పెట్టుకోకు
గుర్తింపులు
[మార్చు]- తెలంగాణ మాండలికంలో పిల్లలు చెప్పుకునే ఇరవై జానపద, హాస్యకథలతో రాసిన `బడి పిలగాల్ల కతలు´(2015) అనే పుస్తకం తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి బాలల కథాసంకలనంగా ప్రశంసలందుకుంది. ఇందులోని 'నాకోసం యెవలేడుస్తరు?, వొంకాయంత వొజ్రం' కథలు మహారాష్ట్రలో ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకాలలో 2016-17 విద్యాసంవత్సరం నుండి పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టబడ్డాయి.[3]
- తెలంగాణ మాండలికంలోనే 'గమ్మతి గమ్మతి కతలు,(2016), దోస్తులు చెప్పిన కతలు'(2018) పుస్తకాలను కూడా ప్రచురించాడు.
- `చెట్టు కోసం ´కథ 2007 నుండి 2016 వరకు మహారాష్ట్రలో ఆరవ తరగతి తెలుగులో పాఠ్యాంశంగా కొనసాగింది.
- ప్రభుత్వ తెలుగు పాఠ్య పుస్తకాల (3వ తరగతి ప్రథమ భాష, 6, 7 తరగతులు ద్వితీయ భాష) రచనలో పాల్గొన్నాడు.
- వయోజనులు, నూతన అక్షరాస్యుల కోసం స్టేట్ రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో పలు పుస్తకాలు రాశాడు.
- సాక్షరభారత్ వాచక రూపకల్పనలో పాలు పంచుకున్నాడు.
- బాలసాహిత్య గ్రంథాల ప్రచురణలో రాజీవ్ విద్యామిషన్ కు సేవలందించాడు.
- నల్లగొండ జిల్లా ఆర్వీయం బాలల మాసపత్రిక `జాబిలి´కి సంపాదక వర్గ సభ్యునిగా పనిచేశాడు.
పురస్కారాలు
[మార్చు]- 'ఉత్తమ బాలసాహితీ గ్రంథం' పురస్కారం - 'గజ్జెల దెయ్యం' - తెలుగు విశ్వవిద్యాలయం (2005)[4]
- మహాకవి శ్రీశ్రీ పురస్కారం
- 'బాలసాహితీరత్న' పురస్కారం - బాలసాహిత్య పరిషత్
- సాహితీ మేఖల, అక్షర కళాభారతి, చింతల స్వచ్ఛంద సంస్థలనుండి ఉగాది పురస్కారాలు
- వాసాల నర్సయ్య బాలసాహిత్య పురస్కారం
- గాడేపల్లి యువ సాహిత్య పురస్కారం
- తెలంగాణ ప్రతిభా పురస్కారం - 2017 (నటరాజ్ డ్యాన్స్ అకాడమీ, హైదరాబాద్, 28.07.2017) - తెలుగు వికీపీడియా కృషి[5][6]
మరణం
[మార్చు]ఈయన 2018, జూలై 17వ తేదీన చిట్యాల శివారులోని బాలనర్సింహ గుడి వద్ద రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.[7]
మూలాలు
[మార్చు]- ↑ ఈనాడు (18 July 2018). "బాలల మిత్రుడు ఇక లేరు". Archived from the original on 18 July 2018. Retrieved 18 July 2018.
- ↑ ఆంధ్రజ్యోతి (18 July 2018). "ప్రముఖ బాలల రచయిత పెండెం జగదీశ్వర్ ఆత్మహత్య". Archived from the original on 18 July 2018. Retrieved 18 July 2018.
- ↑ నమస్తే తెలంగాణ (18 July 2018). "సాహితీవేత్త జగదీశ్వర్ ఆత్మహత్య". Archived from the original on 18 July 2018. Retrieved 18 July 2018.
- ↑ ప్రజాశక్తి (18 July 2018). "బాల సాహితీవేత్త జగదీశ్వర్ దుర్మరణం". Archived from the original on 18 July 2018. Retrieved 18 July 2018.
- ↑ సాక్షి. "కళాకారులకు ప్రతిభా పురస్కారాలు". Archived from the original on 29 జూలై 2017. Retrieved 18 July 2018.
- ↑ ఆంధ్రజ్యోతి. "పలువురికి ప్రతిభా పురస్కారాలు". Retrieved 18 July 2018.[permanent dead link]
- ↑ రచయిత పెండెం జగదీశ్వర్ ఆత్మహత్య