కళా తెలంగాణం (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కళా తెలంగాణం
Kala Telanganam Book Cover Page.jpg
కళా తెలంగాణం పుస్తక ముఖచిత్రం
కృతికర్త: సంకలనం
సంపాదకులు: మామిడి హరికృష్ణ, విష్ణుభట్ల ఉదయ్ శంకర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): తెలంగాణ కళారూపాలపై వ్యాసాలు
ప్రచురణ: సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ
విడుదల: డిసెంబర్ 17, 2017
పేజీలు: 224
ఐ.ఎస్.బి.ఎన్(ISBN): 978-81-936345-6-1


కళా తెలంగాణ పుస్తకం ప్రపంచ తెలుగు మహాసభలు - 2017 వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రచురించబడింది. ఈ పుస్తకాన్ని 2017, డిసెంబరు 17న హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ప్రపంచ తెలుగు మహాసభలు వేడుకలలో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, సి. లక్ష్మా రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణలు ఆవిష్కరించారు.[1]

సంపాదకవర్గం[మార్చు]

పుస్తకం గురించి[మార్చు]

భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాదు ఆకాశవాణిలు సంయుక్తంగా జానపద, సంగీత ఉత్సవాలు నిర్వహించాయి. ఆకాశవాణిలో 2017, ఏప్రిల్ 2నుండి కళలు - కళారూపాలు - వాటి ప్రత్యేకత అనే కార్యక్రమం ప్రసారమయింది. ఆ కార్యక్రమంలో ప్రసారమైన తెలంగాణ జానపద కళారూపాల ప్రసంగాలన్నింటిని ఒక పుస్తకంగా ప్రచురించారు.

వ్యాసాలు[మార్చు]

క్రమసంఖ్య వ్యాసం పేరు రచయిత పేరు పేజీ నెం
1 బైండ్ల కథ కె.వి. రామకృష్ణ 1
2 బిక్షుక కుంట్లు అబ్బు గోపాల్ రెడ్డి 5
3 చెక్కబొమ్మలాట డా. సి.హెచ్. రవికుమార్ 13
4 చిందు యక్షగానం డా. గడ్డం మోహన్ రావు 19
5 డప్పు అందే భాస్కర్ 31
6 గుస్సాడీ డా. భట్టు రమేష్ 41
7 గోంధాళీ వీధి భాగోతం డా. భట్టు రమేష్ 45
8 కడ్డీ తంత్రి కథ డా. దాసరి రంగ 51
9 కోలాటం లింగా శ్రీనివాస్ 59
10 మిత్తలి డా. బాసని సురేష్ 69
11 ఒగ్గు కథ డా. నునుమాస స్వామి 75
12 పన్నెండుమెట్ల కిన్నెర డా. దాసరి రంగ 81
13 రాజగోండుల చరిత్రకారులు - ప్రధాన్‌లు అడ్లూరి శివప్రసాద్ 86
14 రుంజ కథలు అడ్లూరి శివప్రసాద్ 95
15 సాధనా శూరులు డా. బాసని సురేష్ 103
16 శారద కథ డా. నునుమాస స్వామి 111
17 తోలుబొమ్మలాట కె.వి. రామకృష్ణ 115
18 తోటి కథలు డా. శ్రీమంతుల దామోదర్ 123
19 యక్షగానం డా. మొరంగపల్లి శ్రీకాంత్ 129
20 తెలంగాణ గిరిజన కళారూపాలు డా. భట్టు రమేష్ 137
21 జానపదుల గిరిజన వాద్యాలు డా. అన్నావఝ్జుల మల్లికార్జున్ 143
22 చిత్రకళ డా. సురభి వాణీదేవి 147
23 శిల్పకళ టి. ఉడయవర్లు 153
24 నాటకకళ డా. సంగనభట్ల నరసయ్య 159
25 నకాశీ రాయసం లక్ష్మీ 165
26 పెద్దరాతి కళాయుగం శ్రీరామోజు హరగోపాల్ 171
27 తెలంగాణ పద కవిత్వం డా. మొరంగపల్లి శ్రీకాంత్ 185

మూలాలు[మార్చు]

  1. నమస్తే తెలంగాణ, తెలంగాణ వార్తలు (18 December 2017). "రాష్ట్ర సాధనకు బాటలు వేసిన పాట". Archived from the original on 27 February 2019. Retrieved 27 February 2019. CS1 maint: discouraged parameter (link)